అన్వేషించండి
Ram Charan: సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
Sukriti Veni Bandreddi: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన 'గాంధీ తాత చెట్టు' చిత్ర బృందానికి రామ్ చరణ్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.
సుక్కు కుమార్తెకు గ్లోబల్ స్టార్ కంగ్రాట్స్
1/5

ప్రముఖ దర్శకుడు క్రియేటివ్ జీనియస్ సుకుమార్, తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ ఉపాసన దంపతులు అభినందించారు.
2/5

సుకృతి వేణి ప్రధాన పాత్రలో, ఆనంద్ చక్రపాణి మరొక పాత్రలో నటించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'. శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రానికి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
3/5

'గాంధీ తాత చెట్టు' సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు సుకృతి వేణిని, చిత్ర బృందాన్ని అభినందించారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇంటికి 'గాంధీ తాత చెట్టు' చిత్ర బృందాన్ని ఆహ్వానించారు.
4/5

సుకుమార్ సతీమణి తబితతో పాటు 'గాంధీ తాత చెట్టు' చిత్ర బృందం మెగాస్టార్ ఇంటికి వెళ్ళింది. వాళ్లతో కాసేపు రామ్ చరణ్, ఉపాసన దంపతులు సంభాషించారు. మంచి సినిమా తీశారంటూ అభినందించారు.
5/5

'గాంధీ తాత చెట్టు' చిత్ర బృందంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు
Published at : 25 Jan 2025 03:26 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















