Coffee Or Tea : పరగడుపున కాఫీ లేదా టీ తాగేస్తున్నారా? అలా చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
ఉదయాన్నే పరగడుపున కాఫీ లేదా టీ తాగుతారు చాలా మంది. కానీ అలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పొద్దున్నే వేడి వేడి కాఫీ లేదా టీ గొంతులో పడనిదే చాలా మంది తమ పనులు కూడా మొదలుపెట్టారు. వాటిని ఆస్వాదిస్తూ తాగిన తర్వాతే ఏదైనా చేస్తారు. నిజానికి ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల కాఫీలు తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, అకాల మరణం నుంచి రక్షిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. సాధారణ కాఫీ కాకుండా బ్లాక్ కాఫీ తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. బ్లాక్ కాఫీని తాగడం వల్ల గుండె జల్లును, అల్జీమర్స్, పార్కిన్సన్స్, టైప్ 2 డయాబెటిస్, కాలేయ వ్యాధి, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇంతక ముందు ఎక్కువగా టీ ఇష్టపడే వాళ్ళు. కానీ ఇప్పుడు కాఫీ ప్రియులే ఎక్కువగా ఉంటున్నారు. రిఫ్రెష్ అవడానికి ఉదయాన్నే వీటిని తాగుతుంటారు. కానీ వాటిని పరగడుపునే తీసుకోవడం మాత్రం ప్రమాదకరం. అలా చేయడం మీ పొట్టకి హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. టీ కంఫర్ట్ గా ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో వాటిని తాగడం వల్ల పొట్ట ఇబ్బంది పడుతుందని చెబుతున్నారు. పరగడుపున వాటిని తీసుకువడం వల్ల పొట్టలో కొన్ని రకాల ఆమ్లాలు ఏర్పడి అవి జీర్ణక్రియకి ఆటంకం కలిగిస్తాయి.
గ్లాసు నీళ్ళు తాగడం ముఖ్యం
రాత్రి అంతా నోరు మూసుకుని నిద్రపోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. పొద్దున్నే పరగడుపున టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆ బ్యాక్టీరియా నేరుగా పేగుల్లోకి చేరుతుంది. దీని వల్ల జీవక్రియకి అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా అజీర్ణం, గుండెల్లో మంట వస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫీన్ కారణంగా శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాఫీ లేదా టీ తీసుకునే ముందు ఒక గ్లాసు మంచి నీరు తాగడం వల్ల అటువంటి సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు.
కాఫీ లేదా టీ PH విలువలు 4, 5 గా ఉంటాయి. ఇవి ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగిస్తాయి. ఈ పానీయాలు తీసుకునే ముందు గది సాధారణ ఉష్ణోగ్రతలో ఉండే ఒక గ్లాసు నీటిని తీసుకోవడం మంచిది. ఇలా తాగడం వల్ల పొట్టలో ఏర్పడే యాసిడ్ ఉత్పత్తులని టిడి నియంత్రించడంలో సహాయపడుతుంది. అలా కాకుండా వాటిని నేరుగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే ప్రమాదంలోకి నెట్టుకున్న వాళ్ళు అవుతారు. నీళ్ళు తాగకుండా నేరుగా వేడి వేడి కాఫీ, టీ తాగడం వల్ల పేగుల్లో కాలిన గాయాలు, పూతలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.
రాత్రంతా నిద్రలో ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందుకే ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల శరీరం రీహైడ్రేట్ అవుతుంది. దీని వల్ల గుండెల్లో మంట, అసిడిటీ, తలనొప్పి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతే కాదు పేగులని శుభ్రపరుస్తుంది కూడా. పేగు కదలికలో సహాయం చేసి మలబద్ధకం సమస్యని నివారిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!
Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే