Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలా? రోజూ ఈ పానీయాన్ని తాగండి
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటే డయాబెటిస్ తగ్గుతుంది.
ఒక్కసారి శరీరంలో డయాబెటిస్ (Diabetes) చేరిందంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. కానీ ఆరోగ్యకరమైన జీవన శైలి, తాజా ఆహారంతో అదుపులో ఉంచుకోవచ్చు. చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలే మధుమేహాన్ని మన శరీరంలోకి ఆహ్వానిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా మారి ఇలా డయాబెటిస్ వస్తుంది. ఇంట్లోనే తయారు చేసిన ఒక పానీయంతో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది మీ జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, ఇన్సులిన్ స్థాయిలను సహజంగా నిర్వహించేలా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఏమిటా జ్యూస్?
కాకరకాయ, నేరేడు పండ్తతో ఈ జ్యూస్ ను తయారుచేస్తారు. ఇది జీర్ణ రుగ్మతలు, చర్మ సమస్యలు, శరీరంలోని టాక్సిన్లను తొలగించడం వంటి ఎన్నో పనులను చేస్తుంది. అలాగే ఇన్సులిన్ స్థాయిలను కూడా ఆరోగ్యకరంగా నిర్వహిస్తుంది.
కాకరకాయ, నేరేడు... ఈ రెండింటిలో అవసరమైన పోషకాలు, మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అధిక చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. కాకరకాయలో పాలీ పెప్టైడ్ పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ అసమతుల్యతను పరిష్కరిస్తుంది. అలాగే అధిక చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలో మంట, వాపు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఇక నేరేడు పండు విషయానికి వస్తే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, బయోటిన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. దీన్ని కాకరకాయ రసంతో కలిపి తీసుకుంటే చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్లు జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తి ని అధికంగా చేస్తాయి. ఈ జ్యూసును క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం, జుట్టు సమస్యలకు చికిత్స జరుగుతుంది.
ఎలా చేయాలి?
కాకరకాయను శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేయాలి. మిగతా కాకరకాయ ముక్కలు కోసి మిక్సీలో వేయాలి. ఐదు నేరేడు పండ్లను లోపల ఉన్న విత్తనాన్ని తీసి పడేసి మిగతా భాగాన్ని వేయాలి. వీటిని మిక్సీలో మెత్తగా చేయాలి. ఒక స్పూన్ నిమ్మరసం, రాళ్ల ఉప్పు కూడా కలిపి మిక్సీ చేయాలి. గ్లాసు నీళ్లు కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే పానీయం రుచిని పెంచడానికి తాజా కొత్తిమీర ఆకులు, అర స్పూన్ తురిమిన అల్లాన్ని కలపొచ్చు. ఈ రసాన్ని వడకట్టి గ్లాసులో వేసుకొని తాగేయాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఈ పానీయం చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ లేని వారు దీన్ని తాగితే, జుట్టు, చర్మం మెరుపు సంతరించుకుంటాయి. అలాగే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది.
Also read: నా భార్య నా తల్లిదండ్రుల ముందు అలా ప్రవర్తిస్తోంది, వారు లేనప్పుడు మరోలా ఉంటోంది, ఆమెను మార్చడం ఎలా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.