అన్వేషించండి

Drinking Water After Tea : టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదా? ముందు తాగితే మంచిదా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే

Tea and Water Combination : చాలామంది టీ తాగిన తర్వాత నీళ్లు తాగకూడదని చెప్తారు. అందుకే ముందు నీళ్లు తాగి టీ తాగుతారు. కానీ ఇది ఎంతవరకు నిజం.. నిపుణుల సూచనలు ఏంటో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీ తర్వాత నీళ్లు తాగడం హానికరం కాదు, అదొక అపోహ.
  • వేడి టీ వెంటనే చల్లటి నీళ్లు కొందరికి అసౌకర్యం కలిగించవచ్చు.
  • టీ ముందు, తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.
  • 10-15 నిమిషాల గ్యాప్ లేదా మీ శరీరానికి తగ్గట్లు తాగండి.

Tea Before or After Water : ఉదయం లేవగానే టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదని.. ముందే నీళ్లు తాగాలని చెప్తుంటారు. టీ తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని మీరు కూడా వినే ఉంటారు. మరి ఇది ఎంత వరకు నిజం? టీ తాగకముందే నీళ్లు తాగాలా? తర్వాత తాగకూడదా నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్లు తాగొద్దని పెద్దలు ఎందుకు చెప్తారు?

వేడిగా ఉండే పదార్థం తాగిన వెంటనే చల్లటి నీరు తాగితే దంతాల్లో సెన్సిటివిటీ, గొంతులో అసౌకర్యం లేదా కడుపులో కొంత ఇబ్బంది కలగవచ్చని పెద్దలు టీ తాగిన తర్వాత నీళ్లు తాగవద్దని చెప్తారు. అలా టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదనే భావన చాలామందిలో పెరిగిపోయింది. 

టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదా?

టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఓ రకంగా చెప్పాలంటే.. టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం సురక్షితమే. అయితే చాలా వేడిగా ఉన్న టీ తాగిన వెంటనే బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగితే కొంతమందికి అసౌకర్యం కలగవచ్చని చెప్తున్నారు నిపుణులు.

టీ తాగేముందు నీళ్లు తాగితే.. 

టీ తాగే ముందు ఒక గ్లాస్ నీరు తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. అలాగే టీలో ఉండే కెఫిన్ ప్రభావం కొంత తగ్గవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉన్నవారు ముందుగా నీరు తాగితే కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

టీ తర్వాత నీళ్లు తాగితే కలిగే లాభాలు..

టీ తాగిన తర్వాత కొద్దిగా నీళ్లు తాగడం వల్ల నోరు తాజాగా ఉంటుంది. అలాగే పళ్లపై ఉండే టీ మరకలు, షుగర్ కొంతవరకు తొలగిపోవడానికి కూడా సహాయపడుతుంది. శరీరానికి అదనపు ద్రవాలు అందడం వల్ల హైడ్రేషన్ కూడా మెరుగుపడుతుంది.

చల్లటి నీళ్లు తాగితే మంచిది కాదా?

చల్లని నీళ్లు తాగితే మంచిది కాదు అని కూడా చెప్పాలేము. ఎందుకంటే ఇది అందరికీ ఇబ్బంది కాదు. కానీ వేడివేడి టీ తాగిన వెంటనే ఐస్ వాటర్ తాగితే కొందరిలో పంటి నొప్పి, దంతాల్లో సున్నితత్వం, గొంతులో అసౌకర్యం కనిపించవచ్చు. అందుకే సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తారు.

టీ వల్ల డీహైడ్రేషన్ వస్తుందా?

టీ లో కెఫిన్ ఉంటుంది. అయితే సాధారణ పరిమాణంలో టీ తాగడం వల్ల తీవ్రమైన డీహైడ్రేషన్ రాదు. అయినప్పటికీ రోజంతా సరిపడా నీళ్లు తాగడం అవసరం. టీ నీళ్లకు ప్రత్యామ్నాయం కాదు.

టీ తర్వతా నీళ్లు తాగడానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి?

టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం ప్రమాదకరం కాకపోయినా.. 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగితే మరింత సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వేడి టీ తాగిన తర్వాత ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

అపోహ మాత్రమే..

టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే ఆరోగ్యానికి పెద్ద నష్టం జరుగుతుందని చెప్పడం కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే చాలా వేడి టీ తర్వాత వెంటనే చాలా చల్లటి నీళ్లు తాగడం వల్ల కొందరికి తాత్కాలిక అసౌకర్యం కలగవచ్చు అంతేకానీ.. టీకి ముందు నీరు తాగడం, టీ తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగడం రెండూ సాధారణంగా మంచి అలవాట్లే. మీ శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుని.. దానికి తగ్గట్లు అలవాటు చేసుకోవాలి. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget