Rosemary Oil : కెమికల్స్ లేని రోజ్మేరీ ఆయిల్ ఇంట్లోనే చేసుకోండిలా.. జుట్టుకు అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే
Homemade Rosemary Oil : రోజ్మేరీ జుట్టు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ఎలాంటి కెమికల్స్ లేకుండా దీనిని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

- రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు, స్కాల్ప్ ఆరోగ్యానికి మంచిది.
- కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో ఇంట్లోనే సులభంగా తయారుచేయవచ్చు.
- ఇది రక్త ప్రసరణ పెంచి, చుండ్రు తగ్గించి, కుదుళ్లు బలపరుస్తుంది.
Rosemary Oil for Hair Growth : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే, జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు చాలా పెరుగుతున్నాయి. దీనిలో భాగంగా హెల్తీ హెయిర్ కోసం చాలామంది సహజమైన పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వాటిలో రోజ్మేరీ ఆయిల్ ఒకటి. ఇది జుట్టు పెరుగుదలకు, స్కాల్ప్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని సోషల్ మీడియాలో.. బ్యూటీ నిపుణుల సూచనల్లో తరచూ వినిపిస్తోంది. మార్కెట్‌లో రోజ్మేరీ ఆయిల్ సులభంగా దొరికినా.. ఇంట్లోనే సహజంగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో? ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్మేరీ ఆయిల్ కోసం కావాల్సిన పదార్థాలు
తాజా లేదా ఎండబెట్టిన రోజ్మేరీ ఆకులు – ఒక కప్పు
కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ – ఒక కప్పు
గాజు సీసా - 1
తయారీ విధానం
ముందుగా రోజ్మేరీ ఆకులను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. అలాగే ఓ గిన్నెలో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ పోయాలి. అందులో రోజ్మేరీ ఆకులు వేసి చాలా చిన్న మంటపై ఉంచాలి. దానిని 20–30 నిమిషాలు వేడి చేయాలి. అయితే నూనె మరిగిపోకుండా జాగ్రత్త పడాలి. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని చల్లటి, పొడి ప్రదేశంలో ఉంచితే కొన్ని వారాల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రోజ్మేరీ ఆయిల్ జుట్టుకు అప్లై చేస్తే కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
రోజ్మెరీ ఆయిల్ ప్రయోజనాలు..
రోజ్మేరీ ఆయిల్ స్కాల్ప్‌లో రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో హెయిర్ ఫాలికల్స్‌కు పోషకాలు బాగా అందే అవకాశం ఉంటుంది. దీనివల్ల జుట్టు రాలడం తగ్గవచ్చు. రెగ్యులర్‌గా అప్లై చేస్తే.. కుదుళ్లు బలపడటానికి, చిట్లిపోవడం తగ్గించడానికి హెల్ప్ చేయవచ్చు. రోజ్మేరీలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో చుండ్రు, దురద తగ్గుతుంది.
రోజ్మేరీ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మారుతుందని చెప్తారు. కొన్ని పరిశోధనల ప్రకారం రోజ్మేరీలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు కణాలను రక్షించడంలో పాత్ర పోషించవచ్చు. స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగై జుట్టు ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. బలహీనమైన వెంట్రుకలకు బలం అందించి జుట్టు మరింత దట్టంగా చేస్తుంది.
అధిక రసాయనాలు ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్‌కు బదులుగా రోజ్మేరీ ఆయిల్‌ను ఇలా ఇంట్లోనే సహజమైన పద్ధతిలో తయారు చేసుకుని జుట్టుకు ఉపయోగించవచ్చు. అయితే రోజ్మేరీ ఆయిల్ అందరికీ ఒకే విధంగా పనిచేయకపోవచ్చు. అలాగే తీవ్రమైన జుట్టు రాలడం లేదా స్కాల్ప్ సమస్యలు ఉంటే నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
జుట్టుకు సంబంధించిన మరిన్ని చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Before You Go
Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























