అన్వేషించండి

Death Traps of Students : విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. కారణాలు ఇవే అంటోన్న నివేదికలు, మీ పిల్లలు జాగ్రత్త

Student Deaths : పిల్లల్లు ఈ మధ్యకాలంలో ఎమోషనల్​గా వీక్​గా ఉంటున్నారు. చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ స్కూల్ నుంచి పిల్లలపై వస్తోన్న ప్రెజర్ ఏంటో.. ఎలా వారిని కాపాడాలో తెలుసుకుందాం.

Dark Reality of Classroom Cruelty : భారతదేశంలో పాఠశాలలను పిల్లలకు రెండవ ఇల్లుగా చెప్తారు. కానీ గత కొన్ని నెలల్లో కొందరు ఉపాధ్యాయులు, మందలింపుల వల్ల.. పిల్లల మానసిక వేదనకు గురి అవుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కిడ్స్ దీనిని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక వారు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇవి ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే కాదు.. ఒక లిస్ట్ ప్రిపేర్ చేయగలిగేంత పెరిగింది. ఇటీవల నాలుగో తరగతి చదువుతున్న అమైరా పాఠశాల బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నా లేదా 16 ఏళ్ల శౌర్య మెట్రో ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నా.. ఇన్సిడెంట్లు చెప్పేది ఒకటే. దీనిపై ABP న్యూస్ పిల్లలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఉపాధ్యాయుల క్రూరత్వం ఎలా మరణానికి కారణమవుతోంది? పిల్లలను ఎలా రక్షించుకోవాలనే దానిపై ఎక్స్‌ప్లెయినర్‌ చేసింది.

గత 6 నెలల్లో భారతదేశంలో పిల్లలు ఎలా ప్రాణాలు తీసుకున్నారు? ఈ రోజుల్లో పిల్లలు తమను తాము ఒంటరిగా, నిస్సహాయంగా భావించి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో.. పిల్లలు చెప్తోన్న కారణాలు ఏంటో చూసేద్దాం. 

10వ తరగతి చదివే శౌర్య.. లెటర్లో ఏముందంటే.. 

నవంబర్ 18, 2025న ఢిల్లీలోని రాజేంద్ర ప్యాలెస్ మెట్రో స్టేషన్‌లో 10వ తరగతి చదివే 16 ఏళ్ల విద్యార్థి శౌర్య ప్రదీప్ పాటిల్ ప్లాట్‌ఫారమ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శౌర్య సెంట్రల్ ఢిల్లీలోని ప్రసిద్ధ సెయింట్ కొలంబస్ స్కూల్లో చదువుతున్నాడు. అతని బ్యాగ్లో సూసైడ్ నోట్ దొరికింది. దానిలో ఆ అబ్బాయి ఉపాధ్యాయులు జూలీ వర్గీస్, మను కల్ రా, యుక్తి మహాజన్లతో సహా ప్రిన్సిపాల్ అపరాజితా పాల్‌ తనని చాలా కాలంగా మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆరోపించాడు.

లెటర్లో ఏముందంటే.. 

'క్షమించండి అమ్మ, నేను చాలాసార్లు మీ హృదయాన్ని విరిచాను. ఇప్పుడు చివరిసారిగా బ్రేక్ చేస్తున్నాను. పాఠశాల ఉపాధ్యాయులు ఎలా ఉన్నారంటే... నేను ఏమి చెప్పాలి... వారిపై చర్య తీసుకోవాలని నా చివరి కోరిక. దీనివల్ల నా లాంటి వారు ఎవరూ ఇలాంటి చర్య తీసుకోకూడదు.' అంటూ రాసుకొచ్చాడు. శౌర్య తండ్రి ప్రదీప్ పాటిల్ మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలపై ఉపాధ్యాయులు మందలించేవారని, అవమానించేవారని శౌర్య సంవత్సరం నుంచి ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పారు. సంఘటన జరిగిన రోజున డ్రామా క్లాస్‌లో పడిపోవడంతో.. ఒక టీచర్ అతన్ని 'ఓవరాక్టింగ్' అని ఎగతాళి చేస్తూ.. ఏడుస్తున్న పిల్లవాడితో 'ఎంత ఏడవాలనుకుంటే అంత ఏడువు, నాకు ఏమీ పట్టదు' అని అన్నారట అని చెప్పాడు.

9 ఏళ్ల అమైరా.. స్కూల్ బిల్డింగ్ నుంచి దూకేసి.. 

నవంబర్ 1, 2025న జైపూర్‌లోని ప్రసిద్ధ నీరజా మోడీ స్కూళ్లో 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల అమైరా నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. CCTV ఫుటేజ్‌లో ఆమె రెయిలింగ్‌పైకి ఎక్కి దూకినట్లు స్పష్టంగా కనిపించింది. అక్కడికక్కడే మరణించింది. అమైరా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తెను తోటి విద్యార్థులు పదేపదే వేధిస్తున్నారని, దూషిస్తున్నారని చెప్పారు. సంఘటన జరిగిన రోజున కూడా ఆమె చాలాసార్లు టీచర్ దగ్గరకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కాని వాళ్లు వినలేదని తెలిపారు.

అమైరా తల్లి కూడా వాట్సాప్‌లో ఆడియో పంపి వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. కాని స్టాఫ్ ఎలాంటి చర్య తీసుకోలేదు. అమైరా తన తల్లితో ఫోన్‌లో 'అమ్మా, నేను పాఠశాలకు వెళ్లను.. అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు' అని చెప్పింది. పోలీసు విచారణలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వెలుగులోకి వస్తోంది. ఇది 9 ఏళ్ల అమాయక బాలిక పరిస్థితి. చిన్న పిల్లలు కూడా ఎంత బలహీనంగా మారుతున్నారో చూపిస్తుంది. వేధింపులను ఆపాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.. కానీ వారు వినకపోతే పిల్లలు ఒంటరిగా మిగిలిపోతారు.

మూడున్నరేళ్ల పిల్లవాడిని దారుణంగా కొట్టిన టీచర్

నవంబర్ 19న మధ్యప్రదేశ్​లోని బేతుల్ జిల్లాలోని ముల్తాయ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మూడున్నరేళ్ల పిల్లవాడిని రెండు రోజుల పాటు కొట్టాడు. పిల్లవాడు సరిగ్గా మాట్లాడలేనంత చిన్నవాడు. బంధువులు గొడవ చేయడంతో బ్లాక్ విద్యా అధికారి ముగ్గురు సభ్యుల విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇది శారీరక వేధింపుల కేసు. కొంతమంది ఉపాధ్యాయులు ఇప్పటికీ పాత థోరణిలో ఉన్నారని చూపిస్తుంది. పిల్లలను కొట్టడం ద్వారా వారు మెరుగుపడతారనుకోవడం తప్పు. ఈ కేసులో పిల్లవాడు బతికే ఉన్నాడు. కానీ ఇలాంటి కేసులు మానసిక గాయాన్ని చేస్తాయి. తరువాత ఆత్మహత్యకు దారి తీయవచ్చు.

హాస్టల్‌లో ఉరివేసుకుని చనిపోయిన యూనివర్సిటీ స్టూడెంట్

జూలై 18, 2025న గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీలో సెకండియర్ BDS విద్యార్థిని జ్యోతి శర్మ తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి డెత్ నోట్‌లో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శైరీ వశిష్ఠ్, డాక్టర్ మహీందర్ సింగ్ చౌహాన్‌లపై చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, అవమానించారని ఆరోపించారు. జ్యోతి మాట్లాడుతూ.. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఆమెను నిరంతరం అవమానించేవారని, ప్రాజెక్ట్ ఫైల్‌లో సంతకం ఫోర్జ్ చేసినందుకు ఆరోపణలు చేస్తూ వేధించేవారని 'నేను ఇలా జీవించలేను' అని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, జైలుకు వెళ్లాలని కోరుకుంది.

జ్యోతికి గోధుమల అలర్జీ ఉందని.. దానివల్ల ఆమె ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేదని కుటుంబం తెలిపింది. కానీ ఉపాధ్యాయులు కూడా దీని గురించి ఎగతాళి చేసేవారు. ఈ ఘటన తర్వాత విద్యార్థులు క్యాంపస్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. యూనివర్సిటీ ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేసింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

15 ఏళ్ల వివేక్.. ఆత్మహత్య 

జూలై 1, 2015న, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన 10వ తరగతి విద్యార్థి వివేక్ మహాదేవ్ రౌత్ ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. వివేక్ సూసైడ్ నోట్‌లో.. 'నేను ఉరివేసుకుంటున్నాను ఎందుకంటే సూర్యవంశీ టీచర్ నన్ను మందలించారు. నా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడారు' అని స్పష్టంగా రాశాడు.

తరగతి గదిలో టీచర్ వివేక్‌ను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. అతను సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు టీచర్ కోపంతో తరగతి ముందు మందలించి.. ఎగతాళి చేస్తూ 'నీ తల్లిదండ్రులను పిలుస్తాను, నువ్వు చదవలేదని చెబుతాను' అని అన్నారు. వివేక్ కృంగిపోయి ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత స్థానికులు టీచర్‌ను కొట్టడంతో అతను ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు టీచర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కోచింగ్, కాలేజీ లేదా పాఠశాల అయినా.. ఉపాధ్యాయుల ప్రవర్తన పిల్లలను విచ్ఛిన్నం చేస్తుందని ఈ కేసులు చూపిస్తున్నాయి. అయితే 2025 నాటి పూర్తి గణాంకాలు ఇంకా రాలేదు. కానీ ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. 

ఇండియాలో పిల్లల ఆత్మహత్యల గణాంకాలు ఏమి చెబుతున్నాయంటే?

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం.. 2023లో భారతదేశం మొత్తం మీద 13,892 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 2013తో పోలిస్తే 65% ఎక్కువ. మొత్తం ఆత్మహత్యలలో విద్యార్థుల వాటా 8.1%. దీనికి ప్రధాన కారణాలు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, అకాడమిక్ ప్రెజర్, వేధింపులు, మానసిక వేదన. 2024-25 గణాంకాలు ఇంకా రాలేదు కానీ.. ట్రెండ్ పెరుగుతూనే ఉంది.

పాఠశాలల్లో కౌన్సెలింగ్, యాంటీ-వేధింపుల విధానం తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అమలు తక్కువగా ఉంది. NCPCR 2024 నివేదిక ప్రకారం.. 65% కంటే ఎక్కువ పాఠశాలల్లో ఇప్పటికీ ఎలాంటి యాంటీ-ర్యాగింగ్ విధానం లేదు. 78% పాఠశాలల్లో పూర్తి సమయం కౌన్సెలర్ కూడా లేరట.

ఉపాధ్యాయులు పిల్లల ప్రాణాలకు ఎందుకు శత్రువులుగా మారుతున్నారంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉపాధ్యాయులు చిన్న చిన్న విషయాలపై బహిరంగంగా అవమానిస్తున్నారు. అందరిముందు మందలించడం, వేధింపులను విస్మరించడం, ఫిర్యాదులు తీసుకోకపోవడం వంటివి జరుగుతున్నాయి. వాస్తవానికి, నేటి విద్యా వ్యవస్థ మార్కుల రేసుగా మారింది. ఇక్కడ ఉపాధ్యాయులు 100% ఫలితాలను తీసుకురావాలని, పిల్లవాడిని టాప్‌లో ఉంచాలని ఒత్తిడి చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఉపాధ్యాయులు భయపెట్టడం, మందలించడం, కొట్టడం మారి చదువుతాడనుకోవడం జరుగుతుంది. కానీ నేటితరం పిల్లలు భావోద్వేగపరంగా చాలా సున్నితంగా ఉంటున్నారు.

అందుకే విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. 2023లో సుప్రీంకోర్టు 15 బైండింగ్ మార్గదర్శకాలు ఇచ్చింది. చాలా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు వాటిని అమలు చేయడం లేదు. ఫలితంగా ఉపాధ్యాయులపై ఫలితాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీనివల్ల పాత పద్ధతిలో 'భయపెట్టడం-మందలించడం' చేస్తున్నారు.

పిల్లలు ఎందుకు ఎమోషనల్​గా ఇంత వీక్ ఉంటున్నారంటే..

లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఈస్ట్ ఆసియా జర్నల్ ప్రకారం 2024 అధ్యయనంలో భారతదేశంలో 12-17 సంవత్సరాల వయస్సు గల 22% మంది పిల్లలు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని తెలిపింది. కాని కేవలం 2% మంది మాత్రమే వృత్తిపరమైన సహాయం పొందగలుగుతున్నారట. అందుకే టీచర్ అవమానించినప్పుడు లేదా ఫిర్యాదు తీసుకోనప్పుడు పిల్లలు సులభమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదే ఆత్మహత్య. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు మునుపటికంటే ఎక్కువ సున్నితంగా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియా, పోటీ, కుటుంబ ఒత్తిడి వారిని ఒంటరిగా చేస్తోంది. చిన్న వయస్సులో వేధింపులు లేదా అవమానం వారికి ప్రపంచం ముగిసినట్లు అనిపిస్తుంది. కేవలం 9 ఏళ్ల అమైరా వేధింపులకు భయపడి నాలుగో అంతస్తు నుంచి దూకింది. ఇంత ఎత్తు నుంచి పెద్దలు కూడా చూడటానికి భయపడతారు. శౌర్యను చాలా ఎగతాళి చేశారు. అతను మెట్రో ముందు దూకడానికి ధైర్యం చేశాడు. చాలాసార్లు పిల్లలు సూసైడ్ నోట్‌లో ఎవరూ నా మాట వినడం లేదని రాస్తున్నారు. కానీ ఇప్పుడు డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి.

పిల్లలను ఆత్మహత్యల నుంచి రక్షించడానికి పరిష్కారాలు ఇవే

జూలై 2025లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా మాట్లాడుతూ.. 'విద్యార్థుల ఆత్మహత్య ఒక వ్యవస్థాగత వైఫల్యం. విద్య అసలు లక్ష్యం రేసును తయారు చేయడం కాదు.. పిల్లలను సురక్షితంగా, సంతోషంగా ఉంచాలి.' సుప్రీంకోర్టు 15 పాన్-ఇండియా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు వర్తిస్తాయి.

  • అర్హత కలిగిన కౌన్సెలర్ లేదా మనస్తత్వవేత్తను అన్ని విద్యా సంస్థల్లో ఉంచడం అవసరం.
  • పిల్లల సామర్థ్యం కంటే ఎక్కువ లక్ష్యాలను ఇవ్వడం నిషేధం.
  • ప్రతిచోటా హెల్ప్‌లైన్ నంబర్‌ను పెద్ద అక్షరాలతో రాయాలి.
  • తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
  • మానసిక ఆరోగ్య విధానం వేధింపులు, ర్యాగింగ్, కుల వివక్ష, ఉపాధ్యాయుల వేధింపులపై తక్షణ చర్య తీసుకోవాలి.
  • పిల్లవాడు బాధలో ఉన్నప్పుడు తక్షణమే రిఫరల్ ప్రోటోకాల్ తీసుకోవాలి.

ఇవన్నీ సరిగ్గా అమలు చేస్తే.. చాలా మంది పిల్లలను సూసైడ్ ఆలోచనల నుంచి రక్షించవచ్చు. దీనితో పాటు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. పిల్లల ఫిర్యాదులను తేలికగా తీసుకోకుండా వెంటనే చర్య తీసుకోవాలి. ఇవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే కాదు.. పిల్లల జీవితాలను రక్షించే మార్గమని గుర్తించుకోవాలి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget