The Rig Theme Park: వావ్.. నడి సముద్రంలో థీమ్ పార్క్.. సౌదీ బాబాయ్‌లది బుర్రే బుర్ర!
సౌదీ అరేబియా సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సముద్రం మధ్యలో పనికిరాకుండా ఉన్న ఆయిల్ రిగ్‌ను థీమ్ పార్క్‌గా మార్చేస్తోంది.
అదో ఎడారి ప్రాంతం.. తవ్వితే పెట్రోల్ వస్తుందేమోగానీ.. తాగేందుకు నీటి చుక్క కూడా దొరకదు. అక్కడ వ్యవసాయం కూడా అసాధ్యం. అలాంటి ప్రాంతంలో చిన్న ఇల్లు కట్టుకుని జీవించడమే కష్టం. కానీ, అక్కడ ఏకంగా మహా నగరాన్నే కట్టేశారు. అదేనండి.. ఇసుక తిన్నెల్లో వెలసిన భూలోక స్వర్గం దుబాయ్. సెవన్ వండర్స్ చూడాలంటే.. ప్రపంచమంతా తిరగాలేమో. కానీ, దుబాయ్ వెళ్తే.. జీవితంలో మరిచిపోలేని వండర్స్‌ను చూడవచ్చు.
సౌదీ అరేబియా ‘ది రిగ్’ అనే ఓ అద్భుతానికి శ్రీకారం చుట్టింది. రిగ్ అంటే సముద్ర గర్భం నుంచి ఇంధనాన్ని సేకరించే కేంద్రం (ఆయిల్ రిగ్). సౌదీ అరేబియా సముద్రంలో పనికిరాకుండా పడివున్న ఓ ఆయిల్ రిగ్‌ను పూర్తిగా తొలగించడానికి బదులుగా.. దాన్ని థీమ్ పార్క్‌గా మార్చేస్తున్నారు. నడి సముద్రంలో అలల మధ్య.. థ్రిల్లింగ్ ఎక్స్‌పీయరెన్స్ కోరుకొనేవారికి.. ఈ ‘రిగ్’ కలల గమ్యస్థానం కానుందని చెప్పడంలో వేరే సందేహమే లేదు.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
సౌదీ విజన్ 2030లో భాగంగా మరింత మంది పర్యాటకులను ఆకట్టుకొనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ థీమ్ పార్క్ నిర్మిస్తున్నారు. ఇందులో రోలర్ కాస్టర్ రైడ్స్, సబ్‌మెరిన్స్, బంగీజంపింగ్, స్కైడైవింగ్ మాత్రమే కాకుండా.. అనేక అడ్వేంజర్లను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు.. ఇంటర్ కనెక్ట్ ప్లాట్‌ఫార్మస్ ద్వారా మూడు హోటళ్లు, 11 రెస్టారెంట్లను ఇంటర్‌కనెక్ట్ చేయనున్నారు. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘‘ఈ పాజెక్ట్ సౌదీలో మరో ప్రత్యేక టూరిజం అట్రాక్షన్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటకులను ఇది తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఆతిథ్యంతోపాటు అడ్వేంజర్, అక్వాటిక్ స్పోర్టింగ్ అనుభూతిని కూడా అందించాలనేది మా లక్ష్యం’’ అని తెలిపారు.
Also Read: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
సముద్రం మధ్యలో ఉండే ఈ థీమ్ పార్క్‌కు చేరేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్లను అందుబాటులోకి తేనున్నారు. అలాగే 50 బెర్త్‌లతో కూడిన పడవల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫ్‌షోర్ మల్టీపర్పస్ నిర్మాణంగా నిలిచిపోనుంది. నిరుపయోగంగా మారిన రిగ్‌ను ఈ స్థాయిలో మరెక్కడా వినియోగించుకోలేదు. అయితే, ఈ రిగ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది ఇంకా వెల్లడించలేదు. ఈ సందర్భంగా ‘ది రిగ్’ ఎలా ఉండబోతుందో తెలుపుతూ.. ఆకట్టుకునే వీడియోను రిలీజ్ చేసింది. చూస్తే మీరు కూడా వావ్ అంటారు. మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్తే.. అక్కడి నుంచి అలా సౌదీలోని ‘ది రిగ్’ను కూడా చూసి వచ్చేయండి.
Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి