Samantha: సమంతకున్న ఈ వ్యాధి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత తనకున్న అరుదైన వ్యాధి గురంచి బయటపెట్టింది.
తెలుగు అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ సమంతకున్న వింత వ్యాధి. అందంగా కనిపించే సమంత ఇంత విచిత్ర వ్యాధి బారిన పడిందని చెబితే నమ్మడం కష్టమే. తాజాగా ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేసింది సమంత. ఆ ఫోటోకు ‘మీ అందరి ప్రేమ,అనుబంధం ... జీవితం నాపై విసిరే అంతు లేని సవాళ్లను ఎదుర్కునే శక్తిని ఇస్తున్నాయి’ అని రాసుకొచ్చింది. మొన్నటి వరకు విడాకుల ఇష్యూతో నలిగిపోయిన సమంత... ఈ మధ్య ప్రశాతంంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉందనుకుంటే ఇప్పుడు ఆరోగ్య సమస్య ద్వారా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇన్ స్టాలో తన ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించింది సామ్ ‘కొన్ని నెలలుగా మైయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. దీని నుంచి కోలుకోవడానికి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సమయమే పట్టేలా ఉంది’ అంటూ రాసుకొచ్చింది. ఆమెకొచ్చిన వ్యాధి ఏంటో దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్ తల్లిపై ఆధారపడ్డారు.
మైయోసిటిస్ అంటే ఏమిటి?
మైయోసిటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే శరీరంలోని రోగనిరోధక శక్తి స్వయంగా తమ శరీరంపైనే ప్రభావం చూపిస్తుందన్నమాట. ఈ వ్యాధి వచ్చిన వారిలో కండరాలు చాలా బలహీనంగా మారిపోతాయి. త్వరగా అలిసిపోతాయి. నొప్పులు పుడతాయి. కండరాలు ఎర్రగా మారి వాచిపోతాయి. దీనికి చికిత్స తీసుకోవడం అత్యవసరం.
ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
1. ఈ వ్యాధి రాగానే మొదటగా కండరాలపైనే ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా భుజాలు, తొడలు, తుంటి భాగాల్లో ఉన్న కండారాలు బాగా బాధిస్తాయి.
2. కండరాల దగ్గర మొదలైన నొప్పి చర్మం, ఊపిరితిత్తులు, గుండె వంటి ఇతర శరీరభాగాలకు చేరుతుంది.
3. ఈ వ్యాధి వల్ల కండరాలు సరిగా పనిచేయక శ్వాస తీసుకోవడం, మింగడం వంటివి కూడా కష్టమైపోతాయి.
4. కండరాలు బలహీనంగా మారడం వల్ల నిల్చుని ఉండలేరు కూడా. కిందపడిపోతారు.
5. కళ్ల చుట్టు ఉబ్బడం లేదా రంగు మారడం కూడా మైయోసిటిస్ లక్షణాలలో ఒకటి.
6. రోజువారీ పనులు కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి. కనీసం జుట్టు దువ్వుకోవడం కూడా చేయలేరు.
ప్రమాదకరమా?
ఒకరకంగా ప్రమాదకరమనే చెప్పాలి. అసలే బయటి నుంచి దాడి చేసే వైరస్, బ్యాక్టిరియాలు అధికంగా ఉన్నప్పుడు శరీరంలోపలి రోగనిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. కానీ అదే మైయోసిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడితే, ఏ వైరస్‌లతో పోరాడాలో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పాడుతుంది. పొరపాటున శరీరంలోని సొంత కణజాలంపైనే దాడిచేస్తుంది. దీంతో మంట, నొప్పి, వాపులు వంటివి సంభవిస్తాయి.
చికిత్స ఎలా
కొన్ని సార్లు స్టెరాయిడ్లు ఇచ్చి ఈ వ్యాధి నుంచి బయటపడేలా చేస్తారు. అవి సరిగా ఫలితం చూపించకపోతే ఫిజియో థెరపీ, ఆక్యూపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ వంటివి ఇస్తారు. వ్యాయామం కూడా చేయిస్తారు. ఎవరికైతే మాట్లాడడంలో, ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది ఉంటుందో వారికి స్పీచ్ థెరపీ అందింస్తారు.
సమంత విదేశాల్లో ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోందని సమాచారం.
Also read: ‘బౌద్ధ డైట్’ను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం, ఇప్పుడిదే కొత్త ట్రెండ్