అన్వేషించండి

Rice Water Benefits for Hair : రైస్ వాటర్​తో జుట్టు రాలడం నిజంగానే తగ్గుతుందా? దానిని ఎలా ఉపయోగిస్తే మంచిది?

Rice water hair treatment : ఈ మధ్యకాలంలో ఎవరిని కదిపినా.. జుట్టు రాలిపోతుందనే కంప్లైయింట్ మేజర్​గా వినిపిస్తోంది. అయితే ఈ సమయంలో రైస్ వాటర్ ఉపయోగిస్తే నిజంగానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా?

Benefits of Rice Water for Hair Fall Control : సీజన్ మారుతున్నప్పుడు జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు, జీవనశైలిలో మార్పులు వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఒత్తిడి, ఆందోళన బోనస్​ అనే చెప్పాలి. ఎందుకంటే వీటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. జుట్టురాలడానికి రీజన్ ఏదైనా కావొచ్చు. కానీ వెంటనే వాటిని గుర్తించి.. కంట్రోల్ చేస్తే కచ్చితంగా హెయిర్ ఫాలో కంట్రోల్ అవుతుంది. అయితే ఇదే కాకుండా కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయినా కూడా జుట్టు రాలదంటున్నా జపనీస్. వాటిలో ఒకటి రైస్ వాటర్. 

ఎన్నో ఏళ్లుగా బ్యూటీ, హెయిర్ బెనిఫిట్స్ కోసం రైస్​ వాటర్​ను ఉపయోగిస్తున్నారు. దీని జపాన్ వారి చూసి మిగిలిన వారు రైస్ వాటర్​ను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిగురించి విస్తృత ప్రచారం జరుగుతుంది. రైస్ వాటర్ జుట్టుకుని చాలా మంచిదంటూ.. హెయిర్ ఫాలో కంట్రోల్ అయిందంటూ చాలామంది పోస్టులు పెట్టేస్తున్నారు. నిజంగానే రైస్​ వాటర్​తో అన్ని ప్రయోజనాలున్నాయా? అసలు దీనిని ఎలా వాడాలి. జుట్టుకు అప్లై చేయాలంటే రైస్ వాటర్​ని ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

రైస్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు

రైస్ వాటర్​లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మాత్రమే కాకుండా పలు రకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది జుట్టుకు మంచి ప్రయోజనాలు ఇస్తుందట. దీనిలో ఇనోసిటాల్ ఉంటుంది. దీనినే విటమిన్ బి7 అని కూడా అంటారు. ఇది జుట్టుకు చాలా మంచిది. అంతేకాకుండా రైస్​ వాటర్​లోని ఫైబర్ స్కాల్ప్​లోకి చొచ్చుకుపోయే సామార్థ్యాన్ని కలిగి ఉన్నాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. దీనివల్ల జుట్టుకు బలం అందుతుందట. అంతేకాకుండా మంచి మెరుపు, ప్రకాశవంతంగా మారుతుందట. 

ఆ సమస్యలు కూడా దూరం

చుండ్రు సమస్యలను దూరం చేసుకోవడంలో కూడా రైస్ వాటర్ మంచి ప్రయోజనాలు చూపిస్తుంది. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. పొడవాటి జుట్టు కోరుకునేవారు దీనిని రెగ్యూలర్​గా ఉపయోగిస్తే మంచిదట. రైస్ వాటర్​ మాత్రమే కాకుండా గంజి కూడా జుట్టుకు మంచి ప్రయోజనాలు ఇస్తుందంట. జుట్టుకు హైడ్రేషన్​ను అందించి పొడిబారడాన్ని, ఫ్రిజ్​ను తొలగిస్తుంది. 

ఎలా తయారు చేసుకోవాలంటే.. 

అయితే ఈ రైస్ వాటర్​ని బయటకొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక డబ్బాలో ముడిబియ్యాన్ని, పాలిష్ చేయని రైస్​ను ఉంచి.. దానిలో నీళ్లు వేయాలి. బియ్యాన్ని బాగా కలిపి.. కంటైనర్​ను మూసి 12 నుంచి 24 గంటలు అలాగే పులియబెట్టాలి. తర్వాత నీటిని వడకడితే అదే రైస్ వాటర్. ఆ బియ్యాన్ని మీరు వండుకోవచ్చు కూడా.

లేదంట్ రైస్ వండి.. వార్చిన గంజిని కూడా హెయిర్​కి అప్లై చేయవచ్చు. గంజిని కూడా ఓ రోజంత పక్కన పెట్టేయాలి. అనంతరం జుట్టుకి అప్లై చేసి.. గంట తర్వాత వాష్ చేసేయాలి. వారానికి ఇలా రెండుసార్లు చేస్తే చాలు. జుట్టు విషయంలో మీరే మార్పులు చూస్తారు. 

ఇలా స్టోర్ చేయండి

రైస్ వాటర్ లేదా గంజిని వినియోగించకపోతే మీరు వాటిని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకోవచ్చు. వారం పాటు వీటిని ఉపయోగించుకోవచ్చు. స్ప్రే బాటిల్​లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతి రోజు రాత్రి తలపై దీనిని స్ప్రే చేసుకోవచ్చు. తలస్నానం చేయకపోయినా పర్లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం పైసా ఖర్చులేని ఈ ప్రాసెస్​ను మీరు కూడా ట్రై చేసి మంచి ఫలితాలు పొందేయొచ్చు. 

Also Read : చర్మం డల్​గా మారి.. జుట్టు ఊడిపోతుందా? శరీరంలో అది తక్కువైతేనే ఈ వృద్ధాప్యఛాయలు వస్తాయట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన
కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన
కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Embed widget