Winter Tips: చర్మం పొడిగా మారి దురద వేస్తోందా... స్నానం చేసిన వెంటనే ఇలా చేయండి
చలికాలంలో చర్మాన్ని కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్య నిపుణులు.
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడం, పగిలిపోవడం, దురద... ఇలా చాలా సమస్యలు మొదలవుతాయి. కొందరిలో ఇది జిరోసిస్ అనే ఆరోగ్యసమస్యగా కూడా పరిణమించవచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లకి కేవలం చలికాలంలోనే కాదు, వానాకాలంలో, ఎండాకాలంలో కూడా ఇలా చర్మం పొడిబారడం, దురదవేయడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేకుంటే చర్మం రఫ్‌గా, ఎరుపుగా, ముసలిగా కనిపిస్తుంది. అంతేకాదు సమస్య ముదిరిపోతే ఎగ్జిమా, డెర్మటైటిస్, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే చర్మాన్ని పొడిగా మారకుండా పరిరక్షించుకోవాలి.
కరోనా వచ్చాక...
కరోనా వైరస్ శానిటైజర్లు, ఆల్కహాల్ వైప్స్, కెమికల్ క్లీనర్లు వాడుక ఎక్కువైంది. వాటివల్ల కూడా చర్మం తీవ్రంగా పొడిబారడానికి కారణమవుతుంది. చేతులు, ముఖం, వీపు ప్రాంతాలల్లో ఈ రసాయానలు ప్రభావాన్నిచూపిస్తాయి. దురదతో కూడిన పొడిచర్మం వల్ల రాత్రి నిద్ర పట్టక పోవడం, మానసిక ఆందోలన, నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పరిష్కారమేంటి?
1. ట్యూబులలో అమ్మే మాయిశ్చరైజర్లకు బదులు చిన్న సీసాలలో అమ్మే మాయిశ్చరైజర్లను వాడితే మంచిది. అవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీరు కొనే మాయిశ్చరైజర్లో సెరామిడ్స్, గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆమ్లం, సిలికాన్, మినరల్ ఆయిల్, సోర్బిటాల్ ఉండేలా చూసుకోండి. ఇవి తేమని లాక్ చేసి, చర్మం పొడిబారకుండా కాపాడతాయి.
2. ఎక్కువ సేపు స్నానం చేయవద్దు. అయిదు నిమిషాలలోపే స్నానాన్ని ముగించండి.
3. చర్మం మరింత పొడిగా మారుతుంటే మంచి ఫలితాల కోసం లినోలెయిక్, లారిక్ ఆమ్లం వాడడం మొదలుపెట్టండి.
4. పెట్రోలియం జెల్లీ ఎల్లప్పుడు మీతో ఉంచుకోండి. చర్మం పొడిగా మారిన వెంటనే ఆయా ప్రాంతాల్లో పూసేయండి. అలాగని మరీ ఎక్కువగా రాయకండి, జిడ్డుగా మారిపోతుంది.
5. స్నానం చేసిన వెంటనే తడిని టవల్ తో త్వరగా తుడిచేయండి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లయ్ చేయండి. ఇది తేమను లాక్ చేసి పెడుతుంి.
6. పొడిచర్మం ఉన్న వాళ్లు సబ్బు వాడకూడదు. సబ్బుతో రుద్దితే మరింతగా సమస్య పెరిగిపోతుంది. సబ్బు వల్ల చర్మం pH స్థాయికి భంగం కలుగుతుంది. దీంతో పొడితనం, దురద చాలా పెరుగుతుంది.
7. చర్మానికి తగ్గ దుస్తులను వేసుకోండి. మెత్తగా ఉండే పత్తి, పట్టు దారాలతో తయారైన వస్త్రాలు ఉత్తమం. ఉన్నితో చేసినవి చికాకుపెడతాయి.
8. పచ్చి పాలలో దూది ముందు చర్మానికి మర్ధనా చేయండి.
9. ఓట్స్ ను వేడినీళ్లలో నానబెట్టి, మెత్తని పేస్టులా చేసి చర్మానికి పూసుకుంటే మంచిది.
Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Read Also: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి