Viral Photo: ముప్పై అయిదేళ్ల క్రితం ఆ తల్లీకూతుళ్లు అలా, ఇప్పుడు ఇలా, వైరల్ అవుతున్న ఫోటో
ఓ ఫోటోగ్రాఫర్ 1987 నాటి ఫోటోను అదే తల్లీ కూతుళ్ల తిరిగి రిక్రియేట్ చేశారు.
కొన్ని ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతాయి.ఎన్నేళ్లు అయినా వాటిని అంత త్వరగా మర్చిపోలేం. అలా ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించిన ఫోటో ఓ తల్లీ కూతుళ్లది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 ఏళ్ల క్రితం ఫోటో ఇది. ఇప్పుడు అదే తల్లీ కూతుళ్లను తిరిగి ఫోటో తీశారు. ఇప్పుడు మళ్లీ వారి ఫోటో వైరల్ అయ్యింది. చిన్నప్పుడు ఆ కూతురిని తల్లి ఎలా పట్టుకుందో తిరిగి అలాగే ఫోటో తీయాలని ప్రయత్నించాడు ఫోటోగ్రాఫర్ అలా కుదరక. పక్కపక్కన నిల్చోబెట్టి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవిప్పుడు తెగ షేర్ అవుతోంది.
ఎప్పటి ఫోటో?
1987వ సంవత్సరం
హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ నగరం.
ఏడాది వయసుండే తన కూతురును మార్కెట్ కు తీసుకెళ్లింది తల్లి. కూరగాయలు కొనే బ్యాగులోనే ఆ పాపను కూర్చోబెట్టి చేతికి ఒక యాపిల్ ఇచ్చింది. ఆ ఫోటోను అటిలా మనెక్ అనే ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. వార్తాపత్రికల్లో ప్రచురించగానే అది వైరల్‌గా మారింది. చాలా దేశాల్లోని ప్రజలు ఆ ఫోటోలను ఇష్టపడ్డారు. కొంతమంది కత్తిరించి దాచుకున్నారు కూడా. ఆ ఫోటోలోని తల్లి ఎంతో అందంగా ఉంది. బ్రిటన్ ప్రిన్సెస్ డయానా పోలికలు, హెయిర్ స్టైల్ ను కలిగి ఉంది. తరువాత మళ్లీ ఆ ఫోటోగ్రాఫర్ కు ఆ తల్లీ కూతుళ్లను చూడాలనిపించింది. కష్టపడి వారి చిరునామాను కనిపెట్టాడు. వారిద్దరినీ ఒప్పించి మళ్లీ కెమెరాకు పని చెప్పాడు. తల్లి చాలా ముసలిదైంది. ఆమె ఆ ఫోటోలో ఉన్నట్టే పండ్లు కొంటుంటే పక్కనే కూతురు ఆపిల్ తింటూ నిలుచుంది. 2020లో వారిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఫోటోగ్రాఫర్. అవి ఇప్పటికీ అక్కడ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
View this post on Instagram
Also read: మీరు తినే ఆహారంలో ప్లాస్టిక్ కలుస్తోంది గమనించారా? ఎలా అంటే ఇదిగో ఇలా
Also read: వారానికోసారి బోన్ సూప్, తాగితే అందం ఆరోగ్యం కూడా, ఇదిగో సింపుల్ రెసిపీ