By: Haritha | Updated at : 10 Jan 2023 06:12 PM (IST)
(Image credit: Youtube)
సంక్రాంతికి పిండి వంటలే స్పెషల్. అందులో తీపి వంటకాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఈసారి నేతి బొబ్బట్లు ప్రయత్నించి చూడండి. వాటిని చేయడం పెద్ద కష్టమేం కాదు, మేం చెప్పిన పద్ధతిలో సింపుల్ గా చేసుకుంటే సరిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - ఒక కప్పు
శెనగ పప్పు - ముప్పావు కప్పు
నెయ్యి - అర కప్పు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
యాలకుల పొడి - పావు టీ స్పూను
ఉప్పు - పావు టీస్పూను
నీళ్లు - సరిపడినన్ని
తయారీ ఇలా
1. ఒక గిన్నెలో శెనగపప్పును నీళ్లుపోసి నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టాలి.
2. ఇప్పుడు గోధుమపిండిని తీసుకుని ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చాలా మంది మైదా పిండిని వాడతారు. కానీ మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే మేం ఇక్కడ గోధుమ పిండిని వాడమని చెబుతున్నాం. దీనివల్ల రుచిలో ఏమీ తేడా రాదు.
3. చపాతీ పిండిలా కలిపేటప్పుడు అందులోనే నాలుగు స్పూన్ల నెయ్యి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శెనగపప్పును కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి.
5. నీళ్లు వడకట్టేసి శెనగపప్పును మిక్సీజార్లో వేసి, బెల్లం తురుము కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి.
7. అందులో మిక్సీలో రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి.
8. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. యాలకుల పొడి కూడా కలపాలి.
9. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
10. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చపాతీ ముద్దని తీసుకుని పూరీలా ఒత్తాలి.
11. మధ్యలో కాస్త శెనగపప్పు ముద్ద పెట్టి అన్ని వైపుల నుంచి మూసివేసి మళ్లీ ముద్దగా చుట్టుకోవాలి.
12. ఇప్పుడు పాలిథీన్ కవర్ పై కాస్త నెయ్యి రాసి ఆ ముద్దను పూరీలా ఒత్తుకోవాలి.
13. మరో వైపు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాయాలి.
14. నెయ్యి వేడెక్కాక బొబ్బట్టును వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
15. కాలుతుంటేనే మంచి సువాసన వచ్చేస్తుంది. నోరూరి పోవడం ఖాయం.
Also read: చలికాలంలోనే ఎక్కువమంది గుండెపోటుకు గురవుతారు, ఎందుకు?
Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి
Air Fryer: ఎయిర్ ఫ్రైయర్లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?
Paneer: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?