Rakhi Gifts 2025 : రాఖీ పండక్కి 5 వేలలోపు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. సిస్టర్స్కే కాదు, బ్రదర్స్కి కూడా
Rakhi Gifts Ideas : ఈ రక్షాబంధన్ రోజూ 5000 లోపు విలువైన.. ఉపయోగకరమైన బహుమతులు ఇవ్వాలనుకుంటే ఇది మీ కోసమే. మీ సిస్టర్స్కే కాదు బ్రదర్స్కి కూడా ఇవి ఇవ్వొచ్చు.

Rakhi Gifts Best Gift Ideas 2025 : రాఖీ పండుగ అంటే కేవలం ఆచారాలను పాటించడం, రాఖీలు కట్టడం, రీల్స్ పోస్ట్ చేయడమే కాదు.. ఈ పండుగ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. మీ సోదరుడు లేదా సోదరి రాఖీ రోజు ఎలా ఉన్నారో యోగక్షేమాలు తెలుసుకోవడం. బ్రదర్స్, సిస్టర్స్ బాండ్‌ని పెంచే ఈ స్పెషల్ పండుగ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ సమయంలో మీ సిస్టర్స్ అలవాట్లు, అవసరాలు గుర్తించి.. “నీ మనసు నాకు తెలుసు” అనేలా వారికి రాఖీ బహుమతి ఇచ్చేయండి.
అన్నా, తమ్ముళ్లకు రాఖీలు కడితే.. వారు అక్కా చెల్లెల్లకు గిఫ్ట్స్ ఇస్తారు. అయితే ఈ గిఫ్ట్స్ మరీ ఖరీదైనవిగా ఉండాల్సిన అవసరం లేదు. మీ సిస్టర్స్‌కి ఉపయోగపడేలా.. మోడ్రన్‌గా, ఆమెకు నచ్చిలా ఉండే వస్తువులను గిఫ్ట్స్‌గా ఇవ్వొచ్చు. అలాగే కేవలం బ్రదర్సే గిఫ్ట్స్ ఇవ్వడం కాదు.. సిస్టర్స్ కూడా బ్రదర్స్కి ఇవ్వగలిగే బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఏంటో చూసేద్దాం. 5వేల లోపు ఎలాంటి గిఫ్ట్స్ ఏవి బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
సిస్ట్రర్స్కు ఇవ్వగలిగే గిఫ్ట్స్
కాఫీ టేబుల్ : మీ సిస్టర్ కాఫీ పర్సన్ అయితే ఆమె రూమ్‌లో పెట్టుకునే విధంగా.. స్టైలిష్ లైన్లు, తేలికపాటి కలపతో తయారు చేసిన కాఫీ టేబుల్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఉదయాన్నే కాఫీ తాగేందుకు, బుక్స్ చదివే సమయంలో, వారాంతంలో జర్నలింగ్ చేసుకునేందుకు ఇది బెస్ట్.
సువాసనగల కొవ్వొత్తులు : చందనం లేదా లావెండర్ వంటి ప్రశాంతమైన సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. బుక్‌షెల్ఫ్‌లో, బెడ్‌సైడ్ టేబుల్‌పై కూడా వినియోగించగలిగే కొవ్వొత్తులు ఎన్నో అందుబాటులో ఉంటాయి. ఇవి మీ సిస్టర్ ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
బెడ్‌సైడ్ ఆర్గనైజర్ : బెడ్‌కి అందుబాటులో నవలలు, స్కిన్ కేర్, ఇయర్‌బడ్స్, వాటర్ బాటిల్స్ పెట్టుకునేందుకు వీలుగా ఓ చిన్న షెల్ప్ తీసుకోండి. ఇది స్థలాన్ని ఆదా చేసేదిలా ఉండాలి. అలాగే ఉపయోగపడేలా ఉండేది సెలక్ట్ చేసుకోవాలి.
సిరామిక్ డిఫ్యూజర్ : ఎర్త్ ఎసెన్షియల్ ఆయిల్స్‌తో మ్యాట్ ఫినిష్‌తో వచ్చిన సిరామిక్ డిఫ్యూజర్స్ ఎంచుకోవచ్చు. ఇవి రూమ్‌లో మంచి వాతావరణం ఉండేలా హెల్ప్ చేస్తాయి.
సీరం : స్కిన్ కేర్‌కు హెల్ప్ చేసి.. చర్మపు టోన్‌ను మెరుగుపరిచే, అలసిపోయిన చర్మాన్ని పునరుద్ధరింపజేసే.. సీరమ్స్ ఎంచుకుంటే మంచిది. గ్లైకోలిక్, కోజిక్ లేదా నియాసినమైడ్ సీరమ్స్ బెట్స్ ఆప్షన్.
సోదరుల కోసం ఇవి బెస్ట్
ఫోల్డ్-అప్ డెస్క్ : చదువుకోవడానికి, లేట్ నైట్ గేమింగ్, అప్పుడప్పుడు వర్క్ కాల్స్ లేదా అల్పాహారం తినడానికి వీలుగా ఉండే ఫోల్డ్ అప్ డెస్క్‌లు మీ సోదరుడికి గిఫ్ట్‌గా ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్స్.
వాల్-మౌంటెడ్ బుక్‌కేస్ : బుక్స్‌ని అందంగా, ఈజీగా తీసుకోగలిగే సౌలభ్యం కలిగి ఉండే వాల్‌మౌంటెడ్ బుక్ కేస్‌ని తీసుకోవచ్చు. ఇవి స్థలాన్ని పెద్దగా ఆక్రమించకుండా.. బుక్స్‌ని సరిగ్గా ప్లేస్ చేసుకునేందుకు హెల్ప్ చేస్తాయి.
ఫ్రెష్ లినెన్ స్ప్రే : సిట్రస్- లేదా వెనిగర్-సువాసనగల స్ప్రేలు గదిని తక్షణమే రిఫ్రెష్ చేస్తాయి. ఎలాంటి కొవ్వొత్తులు, ఇతర ఇబ్బందులు లేకుండా కేవలం కాస్త స్ప్రేతో రూమ్‌ని ఫ్రెష్‌గా మార్చుకోవచ్చు.
సన్‌స్క్రీన్ : మగవారి చర్మాన్ని కాపాడే, తేలికైన, సువాసన లేని సన్‌స్క్రీన్‌ని మీ బ్రదర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. 10 సెకన్లలో అప్లై చేసుకునేలా ఉండే సన్‌స్క్రీన్స్ గిఫ్ట్‌గా ఇస్తే మంచిది.
హెయిర్‌కేర్ : మీ బ్రదర్‌కి జుట్టు ఎక్కువగా రాలుతుంటే దానిని కాపాడుకోవడానికి మంచి షాంపూ, సీరం కాంబినేషన్ ఇవ్వండి. ఇవి వారికి హెల్ప్ అయ్యేలా మంచి రొటీన్ కిట్ ఇవ్వొచ్చు.
రాఖీ అంటే కేవలం అన్నలు, తమ్ముళ్లే గిఫ్ట్స్ ఇవ్వడం కాదు.. జాబ్ చేసే అక్కలు, చెల్లెల్లు కూడా వారికి మంచి గిఫ్ట్స్ ఇవ్వొచ్చు. మీరు ఎలాంటి బహుమతి ఇచ్చినా.. అవి వారికి ఉపయోగపడేలా చూసుకోండి. లేదు అనుకుంటే వారికి ఎలాంటి గిఫ్ట్‌లు కావాలో అడిగి తెలుసుకుని అవసరాన్ని తీర్చినా పర్లేదు. లేదా రాఖీ స్పెషల్‌గా మీ బ్రదర్ లేదా సిస్టర్‌తో మంచి టూర్‌కి ప్లాన్ వేసుకోవచ్చు. ఇద్దరూ కలిసి షేర్ చేసుకుంటే సరి.






















