అన్వేషించండి

Weight Loss Tips: ప్రోటీన్స్ vs కార్బ్స్ - బరువు తగ్గేందుకు వీటిలో ఏది ఉత్తమం?

బరువు తగ్గడం కోసం ఏవేవో డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యే బదులు సింపుల్ గా ఇలా చెయ్యండి. ఖచ్చితంగా సన్నగా అయిపోతారు.

రువు తగ్గడం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన డైట్ ప్లాన్ ఫాలో అవుతూ ఉంటారు. తిండి తగ్గించి బరువు తగ్గే ప్లాన్ చేస్తున్నామని మరి కొందరు చెప్తారు. నిజానికి ఆహారం తీసుకుని ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ కార్బ్ ఆహారాలు తీసుకుని బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ దానికి బదులుగా ప్రోటీన్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువుని తగ్గించడంలో మరింత సమర్థవంతంగా సహాయపడుతుంది.

ప్రోటీన్లు, పిండి పదార్థాలు ఎలా పని చేస్తాయి?

చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు, నట్స్, తృణధాన్యాల్లో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అవి కండరాలు, ఎముకలని బలోపేతం చేయడానికి, హార్మోన్లు నియంత్రించడానికి సహాయపడతాయి. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక బ్రెడ్, బీన్స్, మొక్క జొన్న వంటి కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. మెదడు చురుకుగా ఉండేందుకు, శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

హెల్త్ లైన్ ప్రకారం మెదడు, ఏకాగ్రతని కాపాడేందుకు పిండి పదార్థాలు చాలా అవసరం. ఆటలు ఆడుతూ అధిక శారీరక శ్రమ చేసే వారికి శక్తి తిరిగి పుంజుకోవడానికి కార్బోహైడ్రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే బరువు తగ్గే విషయంలో మాత్రం కార్బోహైడ్రేట్లు కంటే ప్రోటీన్లు మంచివని సూచిస్తున్నారు.

ప్రోటీన్లు తీసుకోవడం వల్ల లాభాలు

⦿ పిండి పదార్థాల కంటే ప్రోటీన్లు ఎక్కువ కేలరీలని బర్న్ చేస్తాయి. ఇవి పొట్టని ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తాయి. జంక్ ఫుడ్ కోరికలు తగ్గిస్తాయి.

⦿ ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి.

⦿ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు ప్రోటీన్లు సహకరిస్తాయి

⦿ అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించేందుకు దోహదపడుతుందని బీబీసీ హెల్త్ సూచిస్తుంది.

ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల నష్టాలు

అనేక ఫ్యాడ్ డైట్ మాదిరిగానే ఆహారంలో ప్రోటీన్లు పెంచి పిండి పదార్థాలని పరిమితం చేయడం వల్ల ప్రతికూలతలు ఉన్నాయి. రోజువారీ ఆహారంలో అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలకి దారితీయవచ్చు. ఇది సుదీర్ఘకాలంలో ప్రాణాంతకం కావొచ్చు.

పిండి పదార్థాలు ఫైబర్ ని అందిస్తాయి. కాబట్టి ఎక్కువ కాలం పాటు తక్కువ ఫైబర్ ఆహారాలు తీసుకుంటే పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద పేగు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

కొవ్వు, ఫైబర్, ప్రోటీన్లు మిశ్రమంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. అలాగే కొవ్వు ఎప్పుడు తినడం మానేయాలి అని మీకు చెప్పడానికి హార్మోన్లతో కలిసి పని చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకి దూరంగా ఉండాలి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. ప్రోటీన్స్ కోసం చేపలు, గుడ్లు, బీన్స్, మాంసం, చిక్కుళ్ళు, నట్స్, టోఫు, కొవ్వు లేని పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: బాగా అలసటగా ఉంటోందా? ఇందుకు కారణాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget