By: Haritha | Updated at : 10 May 2023 02:39 PM (IST)
(Image credit: Khan Kitchen/Youtube)
పిల్లలకు బంగాళాదుంపల చిప్స్ అంటే ఎంతో ఇష్టం. చిప్స్ కన్నా అప్పడాలు చేసి పెడితే బెటర్. వీటిని చేయడం చాలా సులువు. బంగాళాదుంపలతో చేసే స్నాక్స్ అంటే పిల్లలు, పెద్దలూ కూడా ఇష్టపడతారు. వీటిని మితంగా తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు పెద్దవి - మూడు
ఆయిల్ - ఒక స్పూను
ఎండు మిర్చి - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
1. బంగాళా దుంపలను మెత్తగా ఉడకబెట్టాలి. తరువాత చల్లారనివ్వాలి.
2. ఆ దుంపలను మెత్తగా చేత్తో మెదిపి ఒక గిన్నెలో వేయాలి.
3.ఆ దుంపల్లో ఉప్పు, ఎండుమిర్చి తురుమును వేసి బాగా కలపాలి. అరస్పూను నూనె కూడా వేసి బాగా కలపాలి.
4. చిన్న ముద్దను తీసి ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టండి. ఆ షీట్ కు ముందే కాస్త ఆయిల్ రాయండి.
5. ఆ పిండి ముద్దను చేత్తోనే గుండ్రంగా ఒత్తుకోవాలి. అప్పడం పరిమాణానికి ఒత్తుకోవాలి.
6. దాన్ని ఒక పెద్ద ప్లేటులో లేదా, పొడి చీరపై ఆరబెట్టాలి.
7. అన్ని అప్పడాలను అలా ఒత్తుకుని చీరపై పెట్టాలి.
8. ఆ చీరను ఎర్రటి ఎండలో ఆరబెడితే అవి పెళుసుల్లా ఆరుతాయి.
9. పూర్తిగా ఎండాక వాటిని గాలి చొరబడని కంటైనర్లలో వేసి దాచుకోవాలి.
10. నూనెలో వీటిని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి.
బంగాళాదుంపలను తినడం బరువు తగ్గే అవకాశం ఉంది. వీటిని ఉడకబెట్టి తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పొటాషియం, బి కాంప్లెక్సు, విటమిన్లు, విటమిన్ సి, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల తక్కువ కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందించడంలో ఇది ముందుంటుంది. చర్మాన్ని రక్షించే శక్తి బంగాళాదుంపలకు ఉంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో 25 శాతం మెగ్నీషియం ఉంటుంది. ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల పోషకాహార లోపం రాదు. మధుమేహం బారిన పడిన వారు మాత్రం బంగాళాదుంపలు తినకూడదు. దీనిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ అధికం. వీటిని తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ఉడికించిన బంగాళాదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ 50 ఉంటే, ఉడికించకుండా నేరుగా వండే బంగాళాదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ 95 ఉంటుంది. కాబట్టి బంగాళాదుంపలను ఉడికించాకే వండాలి. అలా వండడం వల్ల అప్పుడప్పుడు మధుమేహ రోగులు కూడా తినవచ్చు. దీన్ని తినడం వల్ల బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మితంగా తినాలి.
Also read: షాపింగ్ చేసే సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీకు డిమెన్షియా వచ్చినట్టే లెక్క
Also read: రెటినోబ్లాస్టోమా, కంటికి వచ్చే క్యాన్సర్ ఇది - జాగ్రత్త పడకపోతే చూపు పోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది
Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ
kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా
Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం
మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం
Telangana Poltics : తెలంగాణ చీఫ్ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్మెంట్