By: Haritha | Updated at : 10 May 2023 10:44 AM (IST)
(Image credit: Pixabay)
Retinoblastoma: రెటినోబ్లాస్టోమా... ఇది కంటికి వచ్చే క్యాన్సర్. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలను చాలా ప్రభావితం చేస్తుంది. అందుకే రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ఆరంభిస్తే కంటిచూపు పోకముందే నయమవుతుంది. ఈ క్యాన్సర్లో భాగంగా కంటిలోని రెటీనా భాగంలో ఉన్న కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. ఆ కణాలే కాంతిని గుర్తించేవి. వాటినే ప్రభావితం చేస్తుంది ఈ క్యాన్సర్. ఇది వచ్చిన పిల్లల్లో కంటిలోని నల్ల గుడ్డుపై తెల్లటి మచ్చ కనపడుతుంది. ఇలాంటివి అధికంగా ఫోటోల్లో మీరు గుర్తించవచ్చు. ఫ్లాష్ ని ఉపయోగించి తీసే ఫోటోల్లో ఇలా ఎక్కువమందికి కళ్ళల్లో తెల్లటి మచ్చ పడడం జరుగుతుంది. అది ఫోటోలో కాకుండా, నిజ జీవితంలో జరిరగితే అది కంటి క్యాన్సర్ ఏమోనని అనుమానించాలి.
ఇతర లక్షణాలు
కేవలం కంటి మధ్యలో తెల్లటి మచ్చ ఉండడం మాత్రమే ఈ క్యాన్సర్ లక్షణం కాదు. ఇంకా అనేక లక్షణాలను ఇది బయటపడుతుంది. మెల్లకన్ను వచ్చినా, కనుపాప రంగులో మార్పులు కనబడినా, కళ్ళు ఎరుపెక్కినా లేదా వాపు వచ్చినా, కళ్ళు ఎలాంటి కారణం లేకుండా నొప్పి పెడుతున్నా, అసౌకర్యంగా అనిపిస్తున్నా వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి. ఇవన్నీ కూడా రెటినోబ్లాస్టోమా లక్షణాలే. చూపులో మార్పులు వచ్చినా కూడా అది ఈ క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఎప్పటికప్పుడు పిల్లల్ని కంటి చూపు ఎలా ఉందో ప్రశ్నించడం మంచిది. మసకబారినట్టు, ఎదురుగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం వంటివి ప్రమాదకరమైన లక్షణాలు.
ఎందుకు వస్తుంది?
ఈ క్యాన్సర్ పిల్లల్లో ఎప్పుడైనా రావచ్చు. ముఖ్యంగా ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలవల్ల పిల్లల్లో ఎప్పుడైనా ఇది దాడి చేయవచ్చు. అలాగే నెలలు నిండకుండా పుట్టే శిశువులు, రేడియేషన్ బారిన పడిన పిల్లల్లో ఇది అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువ.
నేత్ర వైద్యులు కంటికి కాన్సర్ నిర్ధారించేందుకు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా అల్ట్రాసౌండ్, MRI వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ ఏ దశలో ఉందో ముందుగా గుర్తించి ఆ తర్వాత చికిత్సను ఆరంభిస్తారు. ముఖ్యంగా కీమోథెరిపీ, రేడియేషన్ థెరపీ వంటివి అవలంబిస్తారు. ఈ క్యాన్సర్ కంటి భాగంతోనే ఆగిందా లేక శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా అనే అంశాలపై కూడా చికిత్స ఆధారపడి ఉంటుంది. ముందుగానే దీన్ని గుర్తిస్తే చూపును కాపాడుకోవచ్చు. చికిత్స వల్ల ఇది తగ్గినా కూడా కొన్నేళ్ల తరువాత ఎప్పుడైనా తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
Also read: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే మూడు హాట్ డ్రింక్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే
Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు
White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే
Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి
Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!