News
News
వీడియోలు ఆటలు
X

Bad cholesterol: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే మూడు హాట్ డ్రింక్స్ ఇవే

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలా? అయితే ఈ మూడు పానీయాలను తాగండి.

FOLLOW US: 
Share:

అధిక కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యపరంగా ఎంతో హాని జరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ అంటే రక్తంలో కొవ్వులు అధికంగా పేరుకుపోవడం. ఇలా రక్తంలో కొవ్వులు పేరుకుపోవడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. కొవ్వులు రక్తనాళాల్లో చేరి అడ్డంకులు ఏర్పరచి, గుండెపోటు వచ్చేలా చేస్తాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాల్సిన అవసరం ఉంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యను సైలెంట్ కిల్లర్ అని చెబుతారు. ఎందుకంటే ఇవి మరణ ప్రమాదాన్ని పెంచుతాయి. 

మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ LDL, మంచి కొలెస్ట్రాల్ HDL. ఈ రెండూ పరిమితికి మించి పేరుకుపోతే దాన్ని అధిక కొలెస్ట్రాల్ సమస్య అంటారు. వీటిలో ప్రమాదకరమైనది LDL. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అంటే వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, జంక్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు వంటివి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు రక్తంలో అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించుకోకపోతే గుండెపోటు బారిన ఎప్పుడైనా పడవచ్చు. కాబట్టి అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మూడు రకాల టీలు తాగడం ద్వారా కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేయవచ్చు. ఇవి మీకు తెలియకుండానే నిశ్శబ్దంగా చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బయటికి పంపించేస్తాయి.

గ్రీన్ టీ 
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ముందుంటుంది. గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌తో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అధిక బరువు బారిన పడినవారు గ్రీన్ టీని తాగడం వల్ల మేలు జరుగుతుంది. రోజూ పరగడుపున గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. ఖాళీ పొట్టతో దీన్ని తాగడం వల్ల ఇది ప్రభావితంగా పనిచేస్తుంది. 

మందార టీ 
మందార పూలతో తయారు చేసే టీ ఇది. దీన్ని ఆంగ్లంలో హిబిస్కస్ టీ అని పిలుస్తారు. 2009లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం ఇది మధుమేహ రోగుల్లో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ పరగడుపున మందార పూలతో టీ కాచుకొని తాగితే ఎంతో మంచిది.

యెర్బామేట్
యెర్బామేట్ అనేది ఒక మొక్క. ఔషధా గుణాలతో నిండిన ఈ మొక్క ఆకులతో టీ మరిగించి తయారుచేసుకోవాలి. అది అద్భుతంగా పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులు రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించుకోవడం కోసం ఈ టీ ని తాగవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ని కరిగించడంతోపాటు, గుండెకు హాని చేసే ట్రై గ్లిజరైడ్స్ ను కూడా కరిగిస్తుంది. 

Also read: హైబీపీతో బాధపడుతున్న వారు అధిక సోడియం ఉండే ఈ కూరగాయలను తినకూడదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Published at : 10 May 2023 10:25 AM (IST) Tags: Bad cholesterol Bad cholesterol foods Bad cholesterol melting Bad cholesterol Hot drinks

సంబంధిత కథనాలు

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా