అన్వేషించండి

PM Narendra Modi Diet : ప్రధాని నరేంద్ర మోదీ ​ఫిట్​నెస్ సీక్రెట్స్, డైట్ రోటీన్.. 74 ఏళల్లో కూడా ఫిట్​గా ఉండడానికి ఇవే రీజన్స్

Modi Diet : 30 ఏళ్లకే వయసైపోయినట్లు వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు కొందరు. కానీ 74 ఏళ్ల వయసులో కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. చురుకుగా ఎలా ఉన్నారో తెలుసా?

PM Narendra Modi Fitness Routine : వయసు పెరిగే కొద్ది హెల్తీగా ఉండాలంటే ప్రోపర్​ డైట్​తో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. అప్పుడే 70ల్లో కూడా హెల్తీగా, ఫిట్​గా ఉంటారు. అలా తన జీవనశైలితో ఇన్స్​పైర్ చేస్తున్నవారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. 74 ఏళ్ల వయసులో కూడా హెల్తీగా, ఫిట్​గా ఉండడానికి ఆయన ఫాలో అయ్యే లైఫ్​స్టైల్​నే కారణం. పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు మోదీ. మరి ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతారో.. లైఫ్​స్టైల్​లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూసేద్దాం. 

మోదీ యోగాను చాలా ప్రమోట్ చేస్తారు. అలాగే తన ఫిట్​నెస్ రోటీన్​లో కూడా యోగా ఉంటుంది. ప్రతిరోజూ 40 నిమిషాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగ నిద్ర చేస్తారట మోదీ. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చేసే పనులపై ఫోకస్​గా ఉంటారు. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు యోగా నిద్ర చేస్తారు. అలాగే మోదీ ఎక్కువ నడవడానికి ప్రిఫర్ చేస్తారు. గడ్డిపై చెప్పులు లేకుండా కూడా నడుస్తారట. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేద మెడిసిన్స్ ఉపయోగిస్తారు.

టైమ్ పడుతోంది..

మార్పు అనేది ఒక్కరోజులో జరిగిపోదు. కచ్చితంగా దానికి టైమ్​ కావాలి. అలా అని 30, 40ల్లో ఫాలో అయ్యి ఏమి లాభమనుకోకూడదు. హెల్తీగా ఉండాలనే ఆలోచన ఎప్పుడూ వచ్చినా దానిని ఆచరణలో పెడితే కచ్చితంగా హెల్తీగా, ఫిట్​గా ఉంటారు. అంతేకాకుండా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని విస్మరించకూడదనే విషయం ప్రధాని మోదీని చూసి తెలుసుకోవాలి. తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంతకీ ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటారంటే.. 

మునగాకుతో..

మునగాకు ఆరోగ్యానికి ఎంతమంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దీనిని ప్రధాని తన డైట్​లో ఉండేలా చూసుకుంటారు. సాధారణంగా మునగాకును ఎలా అయినా తీసుకోవచ్చు.. మోదీ పరాఠాల రూపంలో తీసుకుంటారు. కనీసం వారంలో రెండుసార్లు దీనిని తీసుకుంటారట. దీనిద్వారా ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. బీటా కెరోటిన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం కూడా అందుతాయి. కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బీపీ, షుగర్ కూడా కంట్రోల్ అవుతాయి. 

కిచిడీ..

కిచిడీ మంచి రుచితో పాటు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. మోదీకి కూడా ఈ డిష్​ అంటే అమితమైన ఇష్టం. ఎన్నో ఇంటర్వ్యూలలో ఆయన కిచిడి ఇష్టమంటూ తెలిపారు. అందుకే ఆయన మెనూలో ఇది కూడా ఉంటుంది. 

నచ్చినదే..

వీటితోపాటు సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, మిల్లెట్స్​ మోదీ డైట్​లో ఉంటాయట. స్పైస్​లేని.. తేలికగా జీర్ణమయ్యే బ్యాలెన్స్డ్ ఫుడ్స్​నే మోదీ ఎక్కువగా తీసుకుంటారట. సమతుల్యమైన ఆహారం ఎప్పుడూ మిమ్మల్ని ఫిట్​గా ఉండేలా చేస్తుంది. నచ్చిన ఫుడ్​ని మెచ్చిన కొలతల్లో తీసుకుని.. హెల్తీగా, ఫిట్​గా ఉండేలా చూసుకుంటున్నారు మోదీ. కాబట్టి ఈ ఫుడ్​నే తీసుకోవాలని రూల్ లేదు. మీకు నచ్చిన ఫుడ్​ని హెల్తీగా ఎలా తీసుకోవాలో తెలుసుకుంటే మంచిది. మరి మీ 70ల్లో మోదీలా ఉండాలంటే.. కాస్త త్వరగా మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. 

Also Read : 60 ఏళ్లు దాటినా జగపతి బాబు ఇంత ఫిట్​గా ఉండడానికి రీజన్స్ ఇవే.. బెండకాయ జ్యూస్​లట, కాకరకాయ రసాలట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Embed widget