Jagapathi Babu Fitness Routine : 60 ఏళ్లు దాటినా జగపతి బాబు ఇంత ఫిట్‌గా ఉండడానికి రీజన్స్ ఇవే.. బెండకాయ జ్యూస్లట, కాకరకాయ రసాలట
Jagapathi Babu Fitness : జగపతిబాబు తన ఫిట్నెస్కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ముఖ్యంగా తన బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉంటుందనే దానిపై వీడియో చేశారు.

Jagapathi Babu Breakfast Routine : జగపతిబాబు ఒకప్పుడు హీరోగా అలరించిన ఈ నటుడు.. ఇప్పుడు జగ్గుభాయ్గా విలనీజం చూపిస్తూ స్టైలిష్ విలన్‌గా మారిపోయాడు. 62 ఏళ్లలో కూడా ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ.. అంతేగ్లామర్గా తన లుక్స్‌ని మెయింటైన్ చేస్తూ.. ఎందరో యంగ్ నటీనటులకు ఆదర్శంగా మారాడు జగపతిబాబు. మరి ఈ ఏజ్‌లో కూడా ఆయన అంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు.. అతను తీసుకునే ఫుడ్ ఎలాంటిది? ఉదయాన్నే అతను తీసుకునే ఆహారమేంటి? వంటి విషయాలు ఇప్పుడు తీసుకుందాం.
సాధారణంగా హీరోలు.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండేవారు ఎక్కువగా ప్రోటీన్ షేక్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లలో బ్రెడ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకుంటారనే భ్రమలో కొందరుంటారు. నిజానికి వీటితో పాటు వారు అందంగా, ఫిట్‌గా ఉండేందుకు ఎన్నో కఠినమైన డైట్లు ఫాలో అవుతూ ఉంటారు. అయితే జగపతిబాబు కూడా డైట్ ఫాలో అవుతారు కానీ.. పాతకాలం నాటి టిప్స్‌తోనే ఆరోగ్యంగా ఉండొచ్చని నిరూపించారు. అతను బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమి తీసుకుంటారో వివరిస్తూ.. ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.
రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు 7000 స్టెప్స్ చేస్తానని వీడియో తెలిపారు. అనంతరం కాకరజ్యూస్ తాగుతారట. దాని తర్వాత బెండకాయ జ్యూస్ తాగుతారట. శరీరానికి కావాల్సిన జిగురు దీనిద్వారా వస్తుందని తెలిపారు. తర్వాత బొప్పాయి, తొక్కతీసేసిన యాపిల్ ముక్కలు, కీర రెగ్యూలర్‌గా తీసుకుంటారట. ఉదయాన్నే స్వీట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్.. అది ఫ్రూట్ అయినా తీసుకోను అంటూ సీతాఫలాన్ని పక్కన పెట్టేశారు. ఇది కేవలం మార్నింగ్ ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పారు.
బొప్పాయి బెనిఫిట్స్..
బొప్పాయి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. విటిమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. దీనిలో విటమిన్ ఏ, సి వయసుపరంగా పెరిగే కంటి సమస్యలను దూరం చేస్తుంది. స్కిన్‌కి కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. యాంటీ ఏజింగ్‌గా పని చేసి ముడతలను, వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి. జుట్టుకు కూడా చాలా మంచిది. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తుంది.
బెండకాయ జ్యూస్‌తో..
జగపతిబాబు బెండకాయ జ్యూస్కూడా రెగ్యూలర్‌గా తీసుకుంటారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఈ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వయసు పెరిగే కొద్ది కండరాల బలం తగ్గుతుంది. బెండకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల కండరాలకు బలం అందుతుంది. చర్మం, జుట్టుకి కూడా ప్రయోజనాలు అందిస్తుంది. డయాబెటిస్‌ను కూడా దూరం చేస్తుంది.
కాకరకాయ జ్యూస్..
కాకరకాయ జ్యూస్‌ని వివిధ ఆరోగ్యప్రయోజనాలకోసం కొందరు తీసుకుంటారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఆర్థ్రైటిస్ను కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ కారకాలు దూరమవుతాయి. జీర్ణాశయ ప్రయోజనాలు అందుతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. వయసు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ముడతలను, స్పాట్స్‌ను దూరం చేస్తుంది.
సెకండ్ బ్రేక్‌ఫాస్ట్
అయితే బ్రేక్‌ఫాస్ట్‌ని రెండు భాగాలుగా విభజించి.. ముందు పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకున్నారు. సెకండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్మీల్ లేదా చద్దన్నం తింటానని తెలిపారు. మట్టికుండలో రాత్రే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కలిపి పెట్టిన చద్దన్నాన్ని తింటారని తెలిపారు. ప్రోయోబయోటిక్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. పూర్వం పెద్దలు కూడా వీటినే ఎక్కువగా తీసుకునేవారు. సెకండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత జిమ్‌కి వెళ్తానని తెలిపారు. వీడియో చివర్లో బ్రేక్‌ఫాస్ట్ చేసినా.. చేయకున్నా జిమ్ చేయండి అంటూ సూచనలిచ్చారు జగపతిబాబు.
Also Read : వానల్లో, వరదల్లో తిరుగుతున్నారా? అయితే జాగ్రత్త.. మాంసాన్ని తినేసే బాక్టీరియా సోకొచ్చు.. విజయవాడలో ఏమైందంటే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

