Viral news: యజమానిని నమిలి తినేసిన పెంపుడు పిల్లులు, రెండు వారాల తర్వాత బయటపడ్డ దుర్ఘటన
ఒళ్లు జలదరించే ఘటనలు (Viral news) జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి.
Viral news: అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లులు, చివరికి తమ యజమానినే తినేశాయి. అయితే యజమాని బతికుండగా కాదు, మరణించాకే. ఆకలికి తాళలేకే ఇలా చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. రష్యాలోని రోస్తోవ్ రీజియన్ ప్రాంతంలో నివసిస్తోంది ఓ మహిళ. ఆమె 20 పిల్లులను పెంచుకుంటోంది. ఆ ఇంట్లో ఆమె, ఆ పిల్లులు మాత్రమే నివసిస్తున్నాయి. హఠాత్తుగా ఇంట్లోనే ఆ మహిళ మరణించింది. మరణానికి కారణాలు తెలియవు. ఆమె ఉద్యోగానికి రాకపోవడంతో సహోద్యోగిని ఎన్ని సార్లు ఫోన్ చేసిన కాల్ ఎత్తలేదు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చేసరికి చాలా షాకింగ్ ఘటన బయటపడింది. ఆమె శరీరం సగం తినగా మిగిలిన భాగం నేలపై పడి ఉంది. చుట్టూ పిల్లులు తిరుగుతున్నాయి.
పిల్లులు మనిషిని తింటాయా?
ఆమె పెంచుకుంటున్న పిల్లుల జాతి ‘జెయింట్ మైన్ కూన్’. ఇవి పరిమాణంలో కాస్త పెద్దవిగా ఉంటాయి. ఇంట్లో ఆహారమేదీ దొరక్కపోవడంతో ఎదురుగా ఉన్న శవాన్నే పీక్కుతిన్నాయి. రెండు వారాల్లో దాదాపు సగం తినేశాయి. వీటిలో ఆరోగ్యంగా ఉన్న వాటిని 30 పౌండ్లకు కొత్త యజమానులకు అమ్మేశారు. అయితే వాటికి మనిషి మాంసం రుచి తెలుసన్న సంగతి చెప్పారో లేదో తెలియదు. ఈ జాతి పిల్లులు గతంలో కూడా మనిషి మాంసాన్ని తిన్న దాఖలాలు బయటపడ్డాయి. ల్యాబ్ లో పరిశోధనలు చేస్తున్నప్పుడు మైన్ కూన్ జాతి పిల్లులు రెండు ప్రవేశించి, అక్కడ ఉంచిన శవాన్ని తినడం పరిశోధకులు చూశారు.
వీటికి విపరీతమైన ఆకలి వేస్తే కోపం కూడా అధికంగా వచ్చేస్తుంది. ఆ సమయంలో ఎదుటి మనిషిని కొరుక్కుని తినేసే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మనిషి ఛాతీ, కండల్లోని మాంసం వాటికి బాగా నచ్చుతుందని చెబుతున్నారు. వాటికి ఏదైనా ఆహారం నచ్చితే ఇక ఆహారం కోసమే వెతుకుతాయని అన్నారు. 2013లో ఒక ఇంటిలో ఒంటరి మహిళ మరణిస్తే ఆమె పెంచుకుంటున్న మూడు పిల్లులు మొత్తం శరీర భాగాలను తినేశాయి. కాబట్టి పిల్లలును తక్కువ అంచనా వేయద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Also read: ఇలా శ్వాస తీసుకుంటున్నవారు మేధావులట, మరి మీరు ఎవరో తెలుసుకోండి
Also read: రైల్వే మటన్ కర్రీ, స్వాతంత్య్రానికి పూర్వం రైళ్లలో ఇదే ఫేమస్