swathi Surgery: రూట్ కెనాల్ సర్జరీ ప్రమాదకరమా? ఆ నటి ముఖం ఎందుకలా మారిపోయింది?
రూట్ కెనాల్ సర్జరీ అనేది చాలా చిన్న సర్జరీతో సమానంగానే భావిస్తారు. కానీ ఒక్కోసారి అది ఇలా పెద్ద సమస్యగా మారుతుంది.
కన్నడ నటి స్వాతి సతీష్ చేసుకున్న రూట్ కెనాల్ సర్జరీ వైరల్ గా మారింది. దానికి కారణం ఆ సర్జరీ తరువాత ఆమె ముఖం వాచిపోయి, రూపు రేఖలే మారిపోయాయి. రూట్ కెనాల్ సర్జరీ ని సీరియస్ గా తీసుకోరు చాలా మంది. కానీ ఒక్కోసారి సర్జరీ వికటించి ముఖం ఇలా తయారయ్యే అవకాశం ఉందని ఈ సంఘటన నిరూపిస్తోంది. సర్జరీ అయ్యాక ఈమె ముఖంపై ఎడమవైపు వాచిపోయి పోల్చుకోలేనట్టుగా మారిపోయింది. కొన్ని నెలల క్రితం కూడా చేతనారాజ్ అనే కన్నడ నటి ఒంట్లో కొవ్వును తొలగించే లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంటుంటే వికటించి మరణించిన సంగతి తెలిసిందే.
ఏంటి రూట్ కెనాల్ సర్జరీ?
ఈ సర్జరీని రూట్ కెనాల్ లేదా ఎండోడోంటిక్ చికిత్స అంటారు. దంతం మధ్యలో రక్తనాళాలు, నరాలు,కణాలు కలిసి ఉండే చోటును పల్ప్ అంటారు. ఆ పల్ప్ కు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల విపరీతంగా నొప్పి వస్తుంది. ఈ చికిత్సలో దెబ్బతిన్న దంతాన్ని తీసివేయడానికి బదులు రూట్ కెనాల్ చికిత్సను చేస్తారు. అమెరికాన్ అసోసియేషన్ ఆఫ్ ఎండోడాంటిస్ట్స్ ప్రకారం రూట్ కెనాల్ సర్జరీ తరువాత మొదటి కొన్ని రోజులు కొంతమంది రోగులు చాలా నొప్పిని, వాపును అనుభవిస్తారు. లేదా వైద్యులు సూచించిన మందులు కారణంగా సైడ్ ఎఫెక్టులను ఎదుర్కొంటారు. రూట్ కెనాల్ సర్జరీ తరువాత వైద్యులను ఫాలో అప్ చేయడం చాలా అవసరం.
ఈ సర్జరీ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది?
ఈ సర్జరీ చిన్నదే కావచ్చు, కానీ కొన్ని సార్లు ఇది కూడా ఫెయిలై స్వాతి సతీష్ కి జరిగినట్టు తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు చూపించవచ్చు. కెనాల్స్ ని శుభ్రం చేయకపోవడం, లోపలి సీలెంట్ లేదా క్రౌన్ బాగం విరగడం, లేదా ఇన్ఫెక్షన్ పక్కన దంతాలకు సోకడం ఇలా చాలా కారణాల వల్ల ఈ సర్జరీ ఫెయిలయ్యే అవకాశం ఉంది.
నిజానికి రూట్ కెనాల్ సర్జరీ చేయించుకున్న తరువాత చిగుళ్లు కాస్త ఇబ్బంది పెట్టడం సాధారణం. దానికి కారణం అక్కడ ఇచ్చే అనస్తీషియ ఇంజెక్షన్. కానీ దవడ, చిగుళ్లు, ముఖం ఓవైపు వాచిపోయిందంటే సర్జరీలో ఏదో తప్పు జరిగిందని అర్థం. చిగుళ్లు వాచాయంటే దానికర్థం వాటికింద ఉన్న ఎముకకు ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం. రూట్ కెనాల్ అనుభవం ఉన్న మంచి వైద్యుల చేత చేయించుకోవాలి. లేకుంటే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సర్జరీ అయ్యాక కూడా వైద్యులను కలుస్తూ ఉండాలి.
View this post on Instagram