Online Summer Classes: మీ పిల్లల కోసం బెస్ట్ ఆన్లైన్ సమ్మర్ క్యాంప్స్ ఇలా సెలక్ట్ చేసుకోండి- ఫన్‌తోపాటు ఎంతో నేర్చుకోగలుగుతారు
Hyderabad News: ఆన్‌లైన్ సమ్మర్ క్యాంప్స్ ఈ మధ్య చాలా జనాదరణ పొందుతున్నాయి. పిల్లల ఆసక్తి, అభిరుచులను బట్టి ఇందులో చేరితే ఆటవిడుపుతో పాటు నచ్చిన ఆర్ట్ లో ప్రావీణ్యం సంపాదిస్తారు.
డిజిటల్ యుగంలో, సమ్మర్ క్యాంప్ కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఔట్ డోర్ లో అడ్వెంచర్స్, క్యాంప్‌ఫైర్ వేసి కబుర్లు చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు, వర్చువల్ ప్రపంచంలో పిల్లలు, యుక్తవయస్కుల వారి కోసం ఎన్నో విద్యలు నేర్చుకోవటానికి అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ సమ్మర్ క్యాంప్స్ ఈ మధ్య చాలా జనాదరణ పొందుతున్నాయి. పిల్లల ఆసక్తి, అభిరుచులను బట్టి ఇందులో చేరితే ఆటవిడుపుతో పాటు నచ్చిన ఆర్ట్ లో ప్రావీణ్యం సంపాదిస్తారు.
ఆన్లైన్ సమ్మర్ క్యాంప్స్ వల్ల పిల్లలకు ట్రావెల్ చేసి, ఎక్కడో ఉండవలసిన ఇబ్బంది లేకుండా ఇంట్లోనే అనుకూలంగా ఉండే సమయాన్ని ఎంచుకొని పార్టిసిపేట్ చేసే సౌకర్యం ఉంటుంది.పైగా ఆన్లైన్ అయితే వివిధ దేశాల వారు, వివిధ కల్చర్స్ వారితో పిల్లలు కలిసి ఎన్నో నేర్చుకునే అవకాశం కలుగుతుంది. అంతేగాక, పిల్లలకు డిజిటల్ స్కిల్స్ కూడా అలవడుతాయి.
సరైన సమ్మర్ క్యాంప్ ఎంచుకోవటం ఎలా?
మీ పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ ఎంచుకునేటపుడు కొన్ని ముఖ్యమైన విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. స్టూడెంట్ కు ఏ విషయాల మీద ఆసక్తి ఉంది? ఎలాంటి గోల్స్ ఉన్నాయి? క్యాంప్ షెడ్యూల్ కి అనుకూలంగా సమయం కేటాయించటం వీలవుతుందా? అనే విషయాలను సరిగ్గా చూసుకొని జాయిన్ చేయటం మంచిది. క్యాంప్ కు ఉన్న రిప్యూటేషన్, రివ్యూలు చూసి మంచి క్యాంపును ఎన్నుకోవటం కూడా ముఖ్యమే. మీరు ఎన్నుకున్న ఎడ్యుకేషన్ క్యాంపులలో నేర్పటానికి అనుభవం గల టీచర్స్ ఉన్నారో లేదో కూడా కనుక్కోవాలి. చివరగా, క్యాంపుకు ఎంత ఖర్చు అవుతుంతుంది. అడిషనల్ ఫీజు ఏమైనా ఉందా? రీఫండ్ ఆప్షన్ ఉందా లాంటివి కూడా ముందే కనుక్కోవాలి. కొన్ని మంచి సమ్మర్ క్యాంప్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. Create& Learn, outschool, HiSawyer, Varsity Tutors వంటి వెబ్సైట్లు ఎన్నో ఆప్షన్లతో సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాయి. దీనిబట్టి చూస్తే మీ పిల్లలను ఎలాంటి క్యాంప్ లో చేర్చాలి అనే విషయం మీద క్లారిటీ వస్తుంది.
టెక్నాలజీ సమ్మర్ క్యాంప్స్
కోడింగ్, గేం డెవలప్మెంట్ వంటి వాటి మీద ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆసక్తి చూపుతున్నాతున్నారు. ఈ టెక్నాలజీ ఎరాలో ఇవి ఎంతో భవిష్యత్తు ఉన్న ఆప్షన్లు కూడా. మీ పిల్లలకు కంప్యూటర్ సైన్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటే ఇలా టెక్నాలజీకి సంబంధించిన సమ్మర్ క్యాంపులో చేరిస్తే బాగుంటుంది.
ఆర్ట్ క్యాంప్
సిలికాన్ వ్యాలీలో ఉన్న CalColor ఆర్ట్ అకాడమీ అతి పెద్ద ఆర్ట్ స్కూల్. టాప్ రేటెడ్ ఆర్ట్ స్కూల్స్ లో ఇది ఒకటి. అంతేగాక CalColor నిర్వహించే సమ్మర్ క్యాంప్ లో 80% రీఫండ్ పాలసీ ఉంది. వీరు ఆఫ్లైన్ తో పాటూ, ఆన్లైన్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఆర్ట్ మీద ఆసక్తి ఉన్న పిల్లలకు సమ్మర్ టైం ని క్రియేటివ్ గా వినియోగించుకోవటానికి ఆర్ట్ క్యాంపులు బెస్ట్ ఆప్షన్.
సైన్స్ క్యాంప్
కొన్ని సంస్థలు పిల్లలకు అధునాతన సైన్స్ మీద అవగాహన కల్పించేందుకు క్వాంటం ఫిజిక్స్ ఫౌండేషన్ టాపిక్స్ ని నేర్పుతున్నాయి. దీని వల్ల పిల్లల్లో సైన్స్ పట్ల క్యూరియాసిటీ పెరగుతుంది. ఈ క్యాంప్స్ లో సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, వైఫై వంటి రకరకాల అంశాల మీద పిల్లలకు నాలెడ్జ్ వస్తుంది. దీని వల్ల పిల్లలు భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్, ఆస్ట్రో ఫిజిక్స్, బయో టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ వంటి రంగాలను ఎంచుకునే అవకాశం కలుగుతుంది.
వీటితో పాటు పిల్లలో క్రిటికల్ థింకింగ్ అభివృద్ధి చెందటానికి రైటింగ్ క్యాంప్స్ కూడా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటల్లిజెన్స్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పిల్లలను టెక్నాలజీలో స్పీడ్ గా ఉంచటానికి పేరెంట్స్ ChatGPT, Cloud computing క్యాంప్స్ కు పంపుతున్నారు. అథ్లెటిక్ స్కిల్స్ పెంచటానికి స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా క్యాంపులు కూడా ఉన్నాయి. కళల మీద ఆసక్తి ఉన్న పిల్లలకైతే డాన్స్, సింగింగ్, ఆక్టింగ్ క్యాంపులకు పంపవచ్చు.