Chocolate: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్ ముక్కను నోట్లో వేసుకోండి
పాకెట్లో కచ్చితంగా ఓ చాక్లెట్ ను రెడీగా ఉంచుకోండి. మూడ్ బాగోనప్పుడు అదే మీకు చాలా మేలు చేస్తుంది.
చాక్లెట్లను చాలా మంది జంక్ ఫుడ్‌లోకి కలిపేస్తారు. కేకులు, ఐస్ క్రీములు, నూడుల్స్, చాక్లెట్లు... ఇలా చెప్పుకుంటూ పోతారు. నిజానికి డార్క్ చాక్లెట్‌ను జంక్ ఫుడ్‌లో కానీ, హానికర ఆహారాల్లో కూడా కలపకూడదు. అతిగా తింటే ఏ పదార్థమైనా హాని చేస్తుంది.చాక్లెట్ కూడా అంతే. కానీ మితంగా తింటే చాక్లెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాక్లెట్ ఏదో చిన్న పిల్లల ఆహారంగా చూడకండి. దాని వల్ల పెద్దవాళ్లకి ఎంతో మేలు జరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ముందుంటుంది. చిన్న చాక్లెట్ ముక్క చాలు మీ మూడ్ ని ఇట్టే మార్చేస్తుంది. డల్‌గా అనిపించినప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు, మూడీగా అనిపించినప్పుడు వెంటనే డార్క్ చాక్లెట్ తీసి నోట్లో వేసుకోండి. మీ మూడ్ అయిదు నిమిషాల్లో మారిపోతుంది.
సంతోషాన్ని పెంచే డోపమైన్
డోపమైన్‌ను ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. ఇది మెదడులో విడుదలైతేనే ఉల్లాసంగా, సంతోషంగా అనిపిస్తుంది. డోపమైన్ విడుదలను ప్రేరేపించే ఫెనిలేతైలమైన్ లేదా లవ్ డ్రగ్ చాక్లెట్లలో ఉంటుంది. ఇది మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపించి డోపమైన్ విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే మూడ్ మారుతుంది. ఫెనిలేతైలమైన్ మన పల్స్ రేటు కూడా పెంచుతుంది, అందుకు ఎవరైనా ప్రేమలో పడినప్పుడు గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఫెనిలేతైలమైన్ కు లవ్ డ్రగ్ అనే పేరు వచ్చింది.
ఒత్తిడి తగ్గించే ఎండార్ఫిన్లు
ఒత్తిడిని తగ్గించే హర్మోన్ ఎండార్ఫిన్. ఇది నాడీ వ్యవస్థ ద్వారా విడుదలయ్యే హార్మోన్ ఇది. చాక్లెట్లు తినడం వల్ల మెదడులో ఎండార్ఫిన్ల స్థాయిని పెంచవచ్చు. డార్క్ చాక్లెట్లలో ఉండే కోకో పొడి ఎండార్ఫిన్లను అధికంగా విడుదలయ్యేలా చేస్తుంది. కాబట్టి అలసటగా లేదా మూడీగా ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్లను తింటే మంచిది. అధికంగా ఈ హార్మోన్ విడుదలై మూడ్ ను మార్చేస్తుంది.
రక్తపోటును తగ్గించి...
థియోబ్రోమిన్ అనే కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును ప్రేరేపిస్తుంది. చాక్లెట్లలో వాడే కోకో పొడిలో ఇది ఉంటుంది. థియోబ్రొమిన్ రక్తపటును తగ్గిస్తుంది, అలాగే గుండెల్లో సంతోషం పొంగేలా చేస్తుంది. అందుకే తెల్ల చాక్లెట్ కన్నా డార్క్ చాక్లెట్ తినడం ఉత్తమం. ఇందులోనే థియోబ్రోమిన్ అధికంగా లభిస్తుంది.
యాంటీ డిప్రెసెంట్‌గా..
డార్క్ చాక్లెట్లోల అధికంగా కోకో పొడి ఉంటుంది. ఈ పొడిలో సెరోటోనిన్ ఉంటుంది. మన మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సెరోటోనిన్ చాలా అవసరం. ఇది యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మనసులో ఉన్న కంగారును తగ్గించడంలో సెరోటోనిన్ ముఖ్యంగా. అందుకే కంగారుగా అనిపించినప్పుడు చిన్న ముక్క చాక్లెట్ నోట్లో పెట్టుకుని చప్పరించండి.
Also read: ఈ ఉప్పును స్నానం చేసే నీళ్లలో కలుపుకుంటే ఆ సమస్యలన్నీ దూరం
Also read: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి