అన్వేషించండి

Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే

India’s Next Kitchen Revolution : LPG ధరలు రోజురోజుకి పెరుగుతన్నాయి. అందుకే వంట కోసం మరిన్ని చౌక అయినా ప్రత్యామ్నాయాలు తీసుకొస్తున్నారు. అలాంటి వాటిలోనితిన్ గడ్కారీ ఆవిష్కరించిన ఇథనాల్ స్టౌవ్ ఒకటి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నితిన్ గడ్కరీ ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఎథనాల్ స్టవ్ ఆవిష్కరించారు.
  • 7 శాతం ఎథనాల్, నీటి మిశ్రమంతో వంట చేయవచ్చు, ఖర్చు తక్కువ.
  • ఎథనాల్ వాడకం పెరిగితే రైతులకు కొత్త మార్కెట్ లభిస్తుంది.
  • కాలుష్యం తగ్గుతుంది, కానీ సాంకేతిక వివరాలపై సందేహాలున్నాయి.

Nitin Gadkari Launches Ethanol-Based Cooking Stove : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. LPG కంటే చౌకగా మరో కొత్త ఆవిష్కరణను పరిచయం చేశారు. LPG గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ఇథనాల్ బేస్డ్ కుకింగ్ స్టవ్‌ను నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ స్టవ్‌లో కేవలం 7 శాతం ఇథనాల్, నీటి మిశ్రమం ఉంటుందని.. దీనితో హ్యాపీగా వంట చేసుకోవచ్చని తెలిపారు. అలాగే గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని అన్నారు.

ఇథనాల్ స్టవ్ ప్రత్యేకత ఏమిటి?

ఇథనాల్ స్టవ్‌లో సుమారు 7 శాతం ఇథనాల్, మిగిలిన భాగం నీటితో కూడిన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ మిశ్రమంతో ఉత్పత్తి అయ్యే మంట ఇంటి అవసరాలకు సరిపోయే విధంగా డిజైన్ చేశారు. అంతేకాకుండా LPGతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండనుంది. 

రైతులకు కూడా లాభమా?

ఈ కొత్త స్టౌవ్​తో రైతులకు కూడా లాభం చేకూరుతుందట. ఎందుకంటే.. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు వంటి పంటలు ప్రధాన ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. దీంతో ఇథనాల్ వినియోగం పెరిగితే రైతులకు కూడా కొత్త మార్కెట్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని ఎక్కువగా వినియోగించడం వల్ల విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.

కాలుష్య సమస్యలు?

ఇథనాల్ ఇంధనం LPGతో పోలిస్తే మరింత శుభ్రంగా మండుతుందని నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల హానికర వాయువుల విడుదల తక్కువగా ఉంటుందని.. పొగ, మసి కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇంట్లో వంట సమయంలో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

అయితే ఈ స్టవ్‌పై కొందరు శాస్త్రవేత్తలు, ఇంధన నిపుణులు కొన్ని అంశాలు తెరపైకి తెచ్చారు. కేవలం 7 శాతం ఇథనాల్ మిశ్రమంతో ఇంటి అవసరాలకు సరిపడే స్థాయిలో వేడి ఉత్పత్తి చేయడం ఎలా సాధ్యమవుతుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ స్టవ్ పనితీరు, సామర్థ్యం, భద్రత, ఉద్గారాలపై ఎలాంటి సాంకేతిక వివరాలు బయటకు రాలేదు.

LPGకి ప్రత్యామ్నాయమా?

భారత్‌లో ఇప్పటికే LPG పంపిణీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించింది. కోట్లాది కుటుంబాలు గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ స్టవ్ పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందాలంటే ఎథనాల్ సరఫరా వ్యవస్థ, ధరలు, భద్రత, వినియోగదారుల నమ్మకం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.

ఇథనాల్ వినియోగం..

గత కొన్నేళ్లుగా భారత్‌లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. 2014లో 1.5 శాతం స్థాయిలో ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ ప్రస్తుతం 20 శాతానికి చేరుకుంది. ఇప్పుడు వాహనాల నుంచి వంటింటి వరకు ఇథనాల్ వినియోగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడు?

ప్రస్తుతం ఈ స్టవ్‌ను ఎప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తారనే విషయంపై క్లారిటీ ఇంకా లేదు. ధర, సబ్సిడీ, పంపిణీ విధానం వంటి వివరాలను కూడా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. మరి ఈ కొత్త టెక్నాలజీ భారత వంటింట్లో విప్లవం సృష్టిస్తుందా? లేక పరిమిత స్థాయిలోనే మిగిలిపోతుందా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
Embed widget