అన్వేషించండి

10K Steps Daily : రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు

Walking 10,000 Steps in a Day : రోజుకు 10 వేల అడుగులు నడవాలి అనుకుంటున్నారా? కానీ కుదరట్లేదా? అయితే మీరు ఇలా ట్రై చేయండి ఈజీగా టాస్క్ కంప్లీట్ చేయొచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజుకు 10,000 అడుగులు నడవడానికి చిన్న చిన్న మార్పులు సూచించబడ్డాయి.
  • ఉదయం నడక, మెట్లు వాడకం, ఫోన్ మాట్లాడుతూ నడవడం ఉపయోగకరం.
  • ప్రతి గంటకు, భోజనం తర్వాత నడవడం అడుగుల సంఖ్యను పెంచుతుంది.
  • మొబైల్ యాప్/స్మార్ట్ వాచ్ తో లక్ష్యాన్ని ట్రాక్ చేయడం సులభం.

10K Steps a Day Without Extra Effort : ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు.. జిమ్​కి వెళ్లలేనివారు.. రోజుకు 10,000 అడుగులు అయినా నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. చాలామంది దీనిని ఫాలో అవ్వాలని చూస్తారు. కానీ ఉద్యోగం, ఇంటి పనులు, ట్రాఫిక్, బిజీ షెడ్యూల్ కారణంగా ఈ టాస్క్ కంప్లీట్ చేయడం కష్టంగా మారుతుంది. అయితే కొన్ని చిన్న మార్పులు చేస్తే.. ప్రత్యేకంగా సమయం కేటాయించకుండానే 10 వేల అడుగుల లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు.

చాలామంది 10,000 అడుగులు అంటే గంటల తరబడి నడవాలని అనుకుంటారు. పైగా అలా నడవడం వల్ల కాళ్ల నొప్పులు రావడం, అలసిపోవడం జరుగుతుంది. ఇదే కంటిన్యూ అయితే కొద్ది రోజుల్లోనే ఈ టాస్క్​ని పక్కన పడేస్తారు. కాబట్టి రోజులో ఒకేసారి కాకుండా.. రోజంతా చిన్న చిన్న భాగాలుగా నడిచినా అదే ఫలితం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. మరి దానిని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

మార్నింగ్ వాక్..

రోజు ప్రారంభంలోనే 2,000 నుంచి 3,000 అడుగుల లక్ష్యం పూర్తి చేస్తే మిగతా లక్ష్యం చాలా సులభమవుతుంది. అలాగే ఉదయం నడక శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

లిఫ్ట్‌కు బదులుగా మెట్లు 

ఆఫీస్, అపార్ట్‌మెంట్ లేదా మాల్‌కి వెళ్లినప్పుడు వీలైనంత వరకు మెట్లు ఉపయోగించండి. ఇది అడుగుల సంఖ్యను పెంచడమే కాకుండా కాళ్ల కండరాలకు మంచి వ్యాయామం కూడా అవుతుంది.

ఫోన్‌లో మాట్లాడేటప్పుడు

మీ వర్క్ పరంగా.. లేదా పర్సనల్​గా ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడతారా? అయితే ఆ సమయంలో మీరు కూర్చోని మాట్లాడే బదులుగా నడుస్తూ మాట్లాడండి. రోజులో కొన్ని కాల్స్ వందల అడుగులు పెంచగలుగుతాయి. 

గంటకోసారి

ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు లేచి కాస్త నడవండి. ఇలా నడిస్తే రోజంతా కలిపి మంచి సంఖ్యలో స్టెప్ కౌంట్ పెరుగుతుంది. 

భోజనం తర్వాత 

అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వాక్ చేయండి. ఇలా నడిస్తే జీర్ణక్రియకు మేలు జరగడంతో పాటు అడుగుల సంఖ్య కూడా పెరుగుతుంది.

ఇవేకాకుండా ఇల్లు శుభ్రం చేయడం, ఊడ్చడం, మొక్కలకు నీళ్లు పోయడం, వంటగదిలో పనులు చేయడం వంటి కార్యకలాపాలు కూడా అడుగుల సంఖ్యను పెంచుతాయి. సాయంత్రం 20-30 నిమిషాలు కాసేపు నడవండి. ఇలా మీరు కంటిన్యూ చేస్తే.. మీ రోజువారీ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారు.

ఇలా ట్రాక్ చేయండి..

మొబైల్ యాప్ లేదా స్మార్ట్‌వాచ్ ద్వారా రోజులో ఎన్ని అడుగులు నడిచారో చూసుకుంటూ ఉంటే లక్ష్యంపై దృష్టి ఉంటుంది. ఇంకా ఎన్ని అడుగులు మిగిలి ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అలాగే రోజులో ఒకేసారి పదివేల అడుగులు వేయడం కంటే.. ఇలా డివైడ్ చేసుకుంటూ నడిస్తే ఈజీగా టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

నిపుణుల ప్రకారం రోజుకు 10 వేల అడుగులు అవసరం లేదు. 7 వేల లక్ష్యం కూడా మంచి ఫలితాలే ఇస్తుందని చెప్తున్నారు. అలాగే నడక మధ్యలో గ్యాప్స్ తీసుకోవడం, హైడ్రేటెడ్​గా ఉండడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయని.. వేగంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని సూచిస్తున్నారు. 

ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
Raw Banana Fry : క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది
క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget