అన్వేషించండి

Hydrogen Stove : LPG కొరతలో కొత్త సొల్యూషన్.. నీటితోనే పనిచేసే హైడ్రోజన్ స్టౌవ్ ధర, పూర్తి వివరాలివే

Water Based Stove : LPG గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కొత్త ఆవిష్కరణ తెరపైకి వచ్చింది. ఏకంగా నీటితోనే పని చేసే స్టౌవ్​ని తయారు చేశారు. దీని ధర ఎంత? ఫీచర్స్ వంటి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతీయ సంస్థ హైడ్రోజన్ స్టవ్ అభివృద్ధి చేసింది, నీరు, కరెంటుతో పనిచేస్తుంది.
  • PEM ఎలక్ట్రోలైజర్ నీటితో హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది, 6 గంటలు వంట చేస్తుంది.
  • ఇండక్షన్ స్టవ్ కంటే తక్కువ విద్యుత్తు వాడి, ఏ పాత్రలోనైనా వంట చేయవచ్చు.
  • కార్బన్ ఉద్గారాలు లేవు, కేవలం నీటి ఆవిరి విడుదల, పర్యావరణానికి మంచిది.

Hydrogen Cooking Stove : అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. కేంద్రం ఇబ్బంది లేదని చెప్తోన్నా.. చాలామంది గ్యాస్ అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండక్షన్, ఒవెన్ అంటూ కొన్ని పరికరాలకు డిమాండ్ పెరిగింది. అలాగే కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒక భారతీయ సంస్థ.. విప్లవాత్మకంగా హైడ్రోజన్ కుకింగ్ స్టౌవ్‌ను డెవెలప్ చేసింది. ఈ స్టౌవ్ గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండానే.. నీరు, కరెంట్​తో పని చేస్తుంది. 

హైడ్రోజన్ స్టౌవ్ ప్రత్యేకత?

ఈ హైడ్రోజన్ కుకింగ్ స్టౌవ్‌ను ప్లగ్ అండ్ ప్లే మోడల్‌గా రూపొందించారు. అంటే సాధారణంగా మనం స్టౌవ్ ఉపయోగించే విధంగానే దీనిని కూడా సులభంగా వాడుకోవచ్చు. ఇది 100% గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో టేబుల్‌టాప్ యూనిట్ తయారు చేయగా.. రెండు బర్నర్లతో వస్తుంది. మాన్యువల్ ఇగ్నిషన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ క్రేజీ, యునిక్ స్టౌవ్‌ను భారతీయ సంస్థ Greenvize అభివృద్ధి చేసింది.

హైడ్రోజన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుందంటే..

ఈ స్టౌవ్‌లో ప్రత్యేకంగా PEM (Proton Exchange Membrane) ఎలక్ట్రోలైజర్ అమర్చారు. ఇది నీటిని అక్కడికక్కడే విడగొట్టి హైడ్రోజన్‌ను తయారు చేస్తుంది. అలాగే ఒక్క యూనిట్‌కు కేవలం 100 ml డిస్టిల్ లేదా RO నీరు, సుమారు 1 kWh విద్యుత్ అవసరం అవుతుంది. ఇవి ఉపయోగించి దాదాపు 6 గంటల పాటు వంట చేసుకోవచ్చు.

ఇండక్షన్ స్టౌవ్‌తో పోలిస్తే..

ఇండక్షన్ స్టౌవ్ ఒక్క బర్నర్‌కు 1.5–2 kW విద్యుత్ ఉపయోగిస్తుంది. హైడ్రోజన్ స్టౌవ్ మాత్రం తక్కువ విద్యుత్తుతో ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఇండక్షన్‌కు ప్రత్యేక పాత్రలు అవసరం. హైడ్రోజన్ స్టౌవ్‌ ఉపయోగిస్తే.. ఏ పాత్రలైనా పర్లేదు. 

పర్యావరణానికి మంచిదేనా?

ఈ స్టౌవ్ ప్రధాన USP ఏంటంటే.. దీనినుంచి ఎలాంటి కార్బన్ ఉద్గారాలు ఉండవు. కార్బన్ మోనాక్సైడ్, పొగ ఉండదు. కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. అంటే ఇది పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీ కుకింగ్ సొల్యూషన్ అనమాట. 
ప్రస్తుతం ఈ స్టౌవ్‌ను కమ్యూనిటీ కిచెన్స్, క్యాంటీన్లు, గవర్నమెంట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కిచెన్స్​లో టెస్ట్ చేస్తున్నారు. ఇంటి వాడకానికి కూడా అనుకూలమే కానీ ఇంకా అది ప్రారంభ దశలోనే ఉంది.

హైడ్రోజన్ కుకింగ్ స్టౌవ్ ధర

ఈ హైడ్రోజన్ స్టౌవ్ సుమారు 1,50,000. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, కొత్త ఎనర్జీ సిస్టమ్ ఉపయోగించడం వల్ల ప్రొడక్షన్ ఇంకా పెద్ద స్థాయిలో ప్రారంభం కాలేదు. అందుకే ప్రస్తుతం ఇది సాధారణ కుటుంబాలకు కాకుండా కమర్షియల్ యూజ్‌కే ఎక్కువగా ప్రాధన్యత ఇస్తున్నారు. టెస్ట్​ల్లో సక్సెస్ అయితే.. ఇది వంట ప్రపంచంలో ఒక పెద్ద మార్పుకు నాంది అవుతుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget