ఇంట్లో LPG గ్యాస్ వాడేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి

Published by: Geddam Vijaya Madhuri

ఇంట్లో LPG (గ్యాస్ సిలిండర్) వాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.

ఇంట్లో గ్యాస్ సిలిండర్ను ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ నిటారుగా ఉంచండి.

గ్యాస్ సిలిండర్ను మూసివున్న క్యాబినెట్లో ఉంచడం మానుకోండి.

సిలిండర్ మార్చిన తర్వాత లేదా వాడేటప్పుడు గ్యాస్ వాసన వస్తే వెంటనే చెక్ చేయాలి. లీకేజ్ అనిపిస్తే వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.

స్టవ్ పక్కన పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు లేదా త్వరగా మంట పట్టే వస్తువులు పెట్టడం ప్రమాదకరం.

LPG సిలిండర్‌ను పడుకోబెట్టి లేదా వంగించి ఉంచకూడదు. ఎప్పుడూ సరిగా నిలువుగా ఉంచాలి.

చాలా మంది వంట అయ్యాక స్టవ్ మాత్రమే ఆఫ్ చేస్తారు. కానీ సేఫ్టీ కోసం రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేయాలి.

రాత్రి పడుకునే ముందు రెగ్యులేటర్ ఆఫ్ చేసే అలవాటు చేసుకోండి.

పైప్ పాతబడితే లేదా చీలికలు ఉంటే వెంటనే మార్చాలి. ఇది ప్రమాదాలను తగ్గిస్తుంది.

గ్యాస్ వాడే చోట కిటికీలు లేదా వెంటిలేషన్ ఉండాలి. ఇది లీకేజ్ జరిగితే ప్రమాదం తగ్గిస్తుంది.