అన్వేషించండి

Office Affairs : ఆఫీస్​లో పెరుగుతోన్న రొమాన్స్ కల్చర్.. పెళ్లైన వారు కూడా సహోద్యోగులతో ఎఫైర్స్, షాకింగ్ రిజల్ట్స్

Office Romance Trends : గతంలో స్కూల్, కాలేజ్ వరకు పరిమితమైన ఈ ప్రేమ ఇప్పుడు ఆఫీస్ వరకు వచ్చేసింది. పెళ్లైనవారు కూడా దీనిలో భాగస్వాములే అవుతున్నారంటూ తాజా అధ్యయనం తేల్చింది. అదేంటో చూసేద్దాం. 

Office Affairs Are Rapidly Increasing in India : ప్రేమ ఎప్పుడు, ఎక్కడ మొదలవుతుందో ఎవరు చెప్పలేరు కరెక్టే. కానీ పెళ్లి తర్వాత కూడా ప్రేమలు పుడుతున్నాయంటూ రీసెంట్ స్టడీ తెలిపింది. అదీ కూడా ఎక్కడో కాదు.. ఆఫీస్​లే అడ్డాగా మారుతున్నాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. తాజాగా జరిగిన సర్వే ప్రకారం.. ఆఫీసులో పనితో పాటు.. ఉద్యోగులు ప్రేమలో కూడా పడుతున్నారని.. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇంతకీ ఆ సర్వే ఏంటి? దానిలోని షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

రిలేషన్​ షిప్స్​ అనేవి రోజు రోజుకి కొత్త రంగు పులుముకుంటున్నాయి. ఈ రంగుల ప్రపంచం కోసం స్కూల్, కాలేజీ రోజులకే వెళ్లక్కర్లేదు. ఆఫీసులకు కూడా వెళ్లొచ్చు. ఇది మేము చెప్పేది కాదు.. ఈ అంశంపై నిర్వహించిన అనేక పరిశోధనలు చెప్తున్నాయి. పెళ్లికానీ వారితో పాటు.. వివాహితులు కూడా ఆఫీసుల్లోని తమ సహోద్యోగులతో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారని తేలింది. ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఏమిటంటే.. గతంలో ఇతర దేశాల్లో ఈ కల్చర్ ఉండేదని.. ఇప్పుడు ఇండియాలో కూడా ఇది సాధారణంగా మారిపోయిందని తేల్చింది. 

100లో 60 మంది.. 

ఈ సెన్సిటివ్ అంశంపై ఫోర్బ్స్ అడ్వైజర్ 2023-24కు గానూ ఓ సర్వే నిర్వహించింది. దీనిలో భాగంగా వారు 100 మంది ఉద్యోగులలో 60 మంది ఉద్యోగులు ఆఫీసు ప్రేమలో భాగమవుతున్నారంటూ షాకింగ్ విషయాలు తెలిపింది. హైలెట్ ఏంటి అంటే వీరిలో 40 శాతం మంది తమ పార్టనర్​తో కలిసి జీవించలేకపోతున్నామనే రీజన్ చూపించి.. ఆఫీస్ రిలేషన్​లోకి వెళ్తున్నారట. అటు తమ పార్టనర్​తో పాటు.. ఇటు లవ్​లో ఉన్నవారిని మోసం చేస్తూ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. 

ఫోర్బ్స్ అడ్వైజర్స్ చేసిన ఈ సర్వేలో 2000 మంది ఉద్యోగులు పాల్గొనగా.. వారిలో 61 శాతం మంది ఈ తరహా రిలేషన్​లోకి వెళ్లినట్లు తెలిపారు. 50 శాతం మంది ఉద్యోగులు తమ సహోద్యోగులను ఫ్లర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇండియాలోని పలు నగరాల్లో ఈ ఆఫీస్ ప్రేమలు పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాల్లో పని చేసే ఉద్యోగుల్లో 20 నుంచి 25 శాతం మంది తమ సహోద్యోగితో రిలేషన్ పెంచుకున్నట్లు తెలిపారు. 

ఆఫీస్ రొమాన్స్​కి రీజన్స్ ఇవే

ఆఫీస్​లో ఈ తరహా రిలేషన్స్ పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. దానిలో మొదటిది ఏంటి అంటే.. ఆఫీస్ తర్వాత బయటకు వెళ్లి లవ్​ లైఫ్​ని వెతుక్కోవడం కష్టమవుతుందట. అంత సమయం ఉండట్లేదు కాబట్టి.. పైగా ఆఫీస్​లోనే ఎక్కువ సమయం ఉంటారు కాబట్టి.. బయటకు వెళ్లే అవసరం లేకుండా అదే ప్రదేశంలో లవ్ లైఫ్​ని ఎంచుకుంటున్నారట. ఈ తరహా ప్రేమను కొనసాగించడం చాలా ఈజీ అని 65 శాతంమంది ఒప్పుకున్నారు.

ఆఫీస్ కోసం తర్వగా ఇంటి నుంచి బయల్దేరడం, ఆఫీస్​ నుంచి లేట్​గా రావడం వల్ల వారికి ఆఫీస్​ అన్ని రకాలుగా సేఫ్ అనిపిస్తుందని తెలిపారు. ఎక్కువ సమయం ఆఫీస్​లోనే గడపడం వల్ల బంధం పెరుగుతుందట. ఆఫీస్​ ఒత్తిడిలో వారికి ఈ రిలేషన్ రిలీఫ్​ని ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే టెక్నాలజీ కూడా వీరి బాండింగ్ పెంచడంలో హెల్ప్ అవుతుందని.. ఇంట్లో ఉన్నా సరే ఆఫీస్ మీటింగ్ అంటూ.. వర్క్ కాల్స్ అంటూ రిలేషన్​ని కంటిన్యూ చేయడం ఈజీ అవుతుందని గుర్తించారు. 

ఇంట్లో ఉండే సమయం తగ్గిపోవడం వల్ల లవ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఆఫీస్ అఫైర్స్ పెరుగుతున్నాయట. అలాగే ఈఎంఐలు, పిల్లల టెన్షన్, ఇతర ఖర్చులు ఇంటికి వెళ్లాక పూర్తి రిలేషన్​పై ప్రభావం చూపిస్తున్నాయట. అందుకే రిలీఫ్​కోసం ఇంటి బయట రిలేషన్​ని కొనసాగిస్తున్నారట. సమస్యలను ఒకరికొకరు పంచుకోవడం ప్రారంభించినప్పుడు ఈ స్నేహం మొదలవుతుందన్నారు. 

పని మీద ప్రభావం ఉందా?

ఈ తరహా రిలేషన్ కొనసాగించేవారు వర్క్​ని పక్కన పెడుతున్నారా అంటే లేదట. ఇంకా త్వరగా తమ టార్గెట్స్​ని కంప్లీట్ చేస్తున్నారట. అప్పుడు తాము ప్రేమించిన వారితో ఎక్కువ సమయం గడపవచ్చని భావిస్తున్నారట. 

కుటుంబంపై ఎఫెక్ట్.. 

ఈ ఆఫీస్ రిలేషన్ వల్ల కుటుంబంపై కచ్చితంగా ప్రభావం ఉంటుందట. ఎందుకంటే బయట కావాల్సిన రిలీఫ్ దొరికేస్తుంటే ఇంక ఇంట్లో దాని గురించి ఆలోచించట్లేదట. పైగా ఇంటికెళ్తే ఖర్చులు, బాధలు, వంటివే ఎక్కువగా కనిపిస్తాయట. కేవలం తిని, పడుకోవడానికి ఇంటికి వెళ్లేవారు కూడా ఉన్నారు. మరి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే వీలు ఎక్కడ ఉంటుంది. ఈ ఆఫీస్ రిలేషన్స్ వల్ల సొంత ఫ్యామిలీకి దూరమవుతున్నారని గుర్తిస్తే ఈ ట్రెండ్ కాస్త కనుమరుగయ్యే అవకాశముంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget