అన్వేషించండి

Covid New Variant: మొన్న ఎరిస్, తాజాగా పిరోలా- ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్

కరోనా మరొక కొత్త వేరియంట్ తో ముందుకు వచ్చి ప్రపంచ దేశాలని గడగడలాడిస్తోంది.

మొదట కరోనా..తర్వాత ఒమిక్రాన్.. నిన్న ఎరిస్.. నేడు పిరోలా. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తు ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా BA.2.86 అని పిలిచే అత్యంత పరివర్తన చెందిన వెర్షన్ కేసులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. యూఎస్ఏ, యూకే, చైనాలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య మరోసారి పెరుగుతుంది. ఇది పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులకు కూడా సోకుతుంది. అయితే తాజా మ్యూటేషన్ కి సంబంధించిన సమాచారం పరిమితంగానే అందుబాటులో ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.

పిరోలా వేరియంట్

పిరోలా BA.2.86 అనేది ఒమిక్రాన్ నుంచి వచ్చిన కొత్త ఉప వేరియంట్. ఇది 2023 మార్చిల్లో ఇజ్రాయెల్ లో మొదటి సారి కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికా, బ్రిటన్, చైనా అంతటా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు కొత్త సవాళ్ళని ఇస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా ఇది తప్పించుకోగలదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగానే ఉంది.

యూకేలో ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. అందువల్ల  కొత్త వేరియంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం దాని వ్యాప్తి గురించి అంచనాకి రావడం కాస్త కష్టంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి యూఎస్ సెంటర్స్ ఆర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరిస్తుంది.

పిరోలా లక్షణాలు

కొత్త వేరియంట్ పిరోలా లక్షణాలు ఇతర కోవిడ్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

⦿జ్వరం

⦿దగ్గు

⦿నిరంతర తలనొప్పి

⦿కండరాల తిమ్మిరి

⦿ముక్కు దిబ్బడ

⦿గొంతు నొప్పి

⦿చికాకు

⦿నీరసం

ఈ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదరకమైనది అని చెప్పడానికి శాస్త్రవేత్తలు ఇంకా పిరోలా మీద అధ్యయనం చేస్తున్నారు. అందుకు కారణం దీనికి సంబంధించి తక్కువ డేటా అందుబాటులో ఉండటమే. అయితే మరికొంతమంది నిపుణులు మాత్రం ప్రస్తుతానికి పిరోలా గురించి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా ఉండటం కోసం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, బయటకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం ముఖ్యం. అవసరం లేకపోతే రద్దీగా ఉండే ప్రదేశాలకి వెళ్లకపోవడమే మంచిది. ఇంటి లోపల వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి.

ఎరిస్ తర్వాత పిరోలా..

మొన్నటి వరకు యూకేలో కొత్త వేరియంట్ EG.5.1 మారుపేరు ఎరిస్ భయపెట్టింది. మునుపటి నివేదికలతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. యూకేలో Eris కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని అక్కడి హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జులై రెండో వారంలో 11.8 శాతం Eris కేసులు బయట పడ్డాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: కలబందతో బట్టతల సమస్యకు చెక్ పెట్టొచ్చా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Dies Irae OTT : ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget