అన్వేషించండి

Chewing Gum Side Effects: నమిలింది చాలు, ఊసేయండి - చూయింగ్ గమ్‌తో ఈ సమస్యల్లో పడతారు జాగ్రత్త!

ఏదైనా అతి ఎప్పుడూ పనిచేయదు. చూయింగ్ గమ్ విషయంలో కూడా అంతే. దాన్ని అతిగా నమిలితే కొత్త సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి.

దంతాల ఆరోగ్యం కోసం చూయింగ్ గమ్ నమలడం మంచిదే అని అంటుంటారు. అయితే ఎక్కువ సమయం పాటు నోట్లో చూయింగ్ గమ్ నమలడం వల్ల దంతక్షయం, దవడ ఆరోగ్యానికి కూడా నష్టం జరగవచ్చని వైద్య  నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూయింగ్ గమ్ ఉండడం వల్ల నోరు ఎప్పుడూ లాలాజలంతో నిండి ఉంటుంది. అది కావిటీల నుంచి రక్షిస్తుంది. అయితే ఆ చూయింగ్ గమ్ షుగర్ ఫ్రీ అయ్యి ఉండాలి. ఎక్కువ లాలా జలంతో నోరు తడిగా ఉంటే దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలు తొలగిపోతాయి.  అందువల్ల దంతక్షయం ప్రమాదం తగ్గుతుంది. చూయింగ్ నమలడం వల్ల కలిగ నష్టం కంటే లాభమే ఎక్కువ అనే వాదన ఉంది. అయితే, ఇప్పటివరకు మనకు కూడా ఇదే తెలుసు. తాజా వాదనల ప్రకారం.. చూయింగ్ గమ్ వల్ల సమస్యలు కూడా వస్తాయట. అవేంటో చూడండి.

మీకు చూయింగ్ గమ్ నమిలిలే అలవాటు ఉంటే.. ఒక పరిమిత సమయాన్ని పాటించాలని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా 15 నిమిషాలకు మించి నమలాడాన్ని సిఫారసు చేయకూడదని అంటున్నారు. అదే పనిగా గంటల పాటు నములుతుంటే దంతాల చుట్టూ ఉంటే ఎనామిల్ డీమినలలైజేషన్ కి గురవుతుందని, ఫలితంగా దంతాలు చాలా సులభంగా దంతక్షయానికి గురికావచ్చేనేది నిపుణుల వాదన.

ఎక్కువ సమయం పాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల టెంపోరోమ్యాండిబ్యులర్ కీళ్ల మీద మరింత భారం పడి పుర్రెకు దవడను కలిపే కీలు దెబ్బతినవచ్చు. నమలడానికి, మాట్లాడటం, ఆవలించడం, మింగడం వంటి రకరకాల పనులను చేసే ఈ కీలే. చూయింగ్ గమ్ వల్ల వెంటనే ఈ సమస్య రాకపోవచ్చు. కానీ ఇప్పటికే కీలులో గాయం ఉన్నవారికి సమస్య తీవ్రం కావచ్చు.

ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఇతర ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధ పడేవారిలో కూడా చూయింగ్ గమ్ ఎక్కువ సమయం పాటు నమలడం వల్ల సమస్యలు రావచ్చు. గమ్ నమలాలని అనుకుంటే షుగర్ ఫ్రీ రకాలు మాత్రమే వాడాలి. జిలిటాల్ లేదా సార్బిటాల్ వంటి స్వీటనర్లు కలిగి ఉన్నవి మంచివని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక నుంచి చూయింగ్ గమ్ తినాలనుకుంటే కొన్ని నిబంధనలు గుర్తుపెట్టుకోవడం ఎందుకైనా మంచిది. అది షుగర్ ఫ్రీ అయ్యి ఉండాలి. అంతే కాదు 15 నిమిషాలకు మించి నమలకూడదని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ గమ్ నమిలే అలవాటును కొనసాగించవచ్చు.

Also read : Brushing at Night: రాత్రి బ్రష్ చేయడం లేదా? జాగ్రత్త, మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

lso Read : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget