News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Six Inch Skeleton: ఈ అస్థిపంజరం సైజు 6 ఇంచులే.. మనిషా? ఏలియనా?.. DNA రిపోర్ట్ చూసి షాక్!

దక్షిణ అమెరికాలోని ఓ ఎడారిలో ఉన్న పాడుబడిన చర్చిలో లభించిన ఓ బుల్లి అస్థిపంజరం శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతోంది.

FOLLOW US: 
Share:

నిషి అస్థిపంజరం ఏ సైజులో ఉంటుందో తెలిసిందే. అయితే, ఈ అస్థిపంజరం మాత్రం సాధారణమైనది కాదు. దీని పొడవు కేవలం 6 ఇంచులు మాత్రమే. అంటే.. మన అరచేతిలో పట్టేంత చిన్న సైజు బొమ్మంత ఉంటుంది. దీని తల కూడా చాలా చిత్రంగా ఉంది. హాలీవుడ్ సినిమాల్లో చూపించే గ్రహాంతరవాసుల తలలా పొడవుగా ఉంది. దీంతో.. ఆ అస్థిపంజరం మనిషిదా? గ్రహాంతరవాసిదా (ఏలియన్) తెలియక పరిశోధకులు జుట్టు పట్టుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం దొరికి దాదాపు 18 ఏళ్లు కావస్తోంది. కానీ, అది ఏమిటనేది పూర్తిగా తెలుసుకోలేకపోయారు. తాజాగా కొంతమంది పరిశోధకులు మరోసారి దాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కొన్ని కీలక విషయాలు చెప్పారు. వాటి గురించి తెలుసుకొనే ముందు ఈ అస్థిపంజరం ఎక్కడ లభ్యమైందో తెలుసుకుందాం. 

పాడుబడిన చర్చిలో లభ్యం: 2003 సంవత్సరంలో దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారిలో ట్రెజర్ హంట్ (నిధులు కోసం అన్వేషణ) చేస్తున్న ఆస్కార్ మునో అనే వ్యక్తికి లా నోరియాలోని పాడుబడిన చర్చిలో ఈ అస్థిపంజరం లభించింది. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది. ఆ అస్థిపంజరానికి పరిశోధకులు అటా (Ata) అని పేరు పెట్టారు. 

మనిషా? ఏలియనా?: వాస్తవానికి మనుషుల అస్థిపంజరానికి 10 పక్కటెముకలు (Ribs) ఉంటాయి. అయితే, ఈ బుల్లి అస్థిపంజరానికి మాత్రం 12 పక్కటెములు ఉన్నాయి. పైగా దాని తల కూడా పైకి పెరిగినట్లుగా ఉంది. అస్కార్‌కు అది ఓ లెదర్ పౌచ్‌లో లభించింది. దాని చుట్టూ తెల్లని వస్త్రం, రిబ్బన్ చుట్టి ఉంది. అయితే, దాన్ని ఎందుకు అక్కడ వదిలి వెళ్లిపోయారనేది మాత్రం తెలియరాలేదు. దాని అస్థిపంజర నిర్మాణం కూడా చాలా చిత్రంగా ఉంది. దానికి మనిషికి ఉన్నన్ని ఎముకలు కూడా లేవు. దాని కళ్లు కూడా ఏలియన్ తరహాలోనే ఉన్నాయి.

డీఎన్ఏ రిపోర్ట్‌లో ఏముంది?: ఈ అస్థిపంజరాన్ని పరిశీలించిన పరిశోధకులు అది 1970 సంవత్సరానికి చెందినదిగా గుర్తించారు. పైగా ఆ అస్థిపంజరం నుంచి సేకరించిన డీఎన్‌ఏను పరిశీలిస్తే.. అది మనుషులది కాదని తేలింది. 2018లో శాన్ ఫ్రాన్సిస్కోలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మరోసారి దీన్ని పరీక్షించారు. అది తప్పకుండా మనిషి అస్థిపంజరమే కావచ్చని తెలిపారు. దాదాపు 40 ఏళ్ల కిందట చనిపోయిన శిశువు అస్థిపంజరం కావచ్చని పేర్కొన్నారు. జన్యు లోపం వల్ల ఆ శిశువులో ఎముకలు అసాధారణంగా పెరిగి ఉండవచ్చని తెలిపారు.

View this post on Instagram
 
A post shared by Emery Smith (@emerysmith33)

ఎముకల సమస్యే కారణమా?: ఎముకల సమస్య వల్ల ఆ శిశువు ఆ రూపంలోకి మారి ఉండవచ్చన్నారు. ఆ శిశువు పుట్టిన వెంటనే చనిపోయి ఉండవచ్చని, లేదా నెలలు నిండకుండానే పుట్టి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఆ శిశువుకు చాలా గౌరవంతో అంత్యక్రియలు జరిపి ఉండవచ్చని, కానీ.. దాన్ని పరిశోధనల కోసం ఉపయోగించడమంటే అగౌరవ పరిచడం కిందే లెక్కని అన్నారు. అయితే, ఆ అస్థిపంజరం డీఎన్ఏ.. మనుషుల డీఎన్ఏతో ఎందుకు మ్యాచ్ కావడంలేదనే సందేహం మాత్రం అలాగే ఉంది. 

Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్

Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!

Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)

Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Dec 2021 10:05 PM (IST) Tags: Six Inch Skeleton 6 inch Skeleton Six inch Skeleton Mystery Conical Head Aliens Atacama Desert ఆరు ఇంచుల అస్థిపంజరం

ఇవి కూడా చూడండి

Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

Sleep Deprivation : సరిగ్గా నిద్రపోవట్లేదా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధులు తప్పవు

Sleep Deprivation : సరిగ్గా నిద్రపోవట్లేదా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధులు తప్పవు

Kanchipuram Idly Recipe : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ

Kanchipuram Idly Recipe : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ

Indonesia Mosquitoes : దోమలను పెంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయం - ప్రజా వ్యతిరేకతతో ఆగిన ప్లాన్

Indonesia Mosquitoes : దోమలను పెంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయం - ప్రజా వ్యతిరేకతతో ఆగిన ప్లాన్

Alpha Male Qualities : మీలో ఆల్ఫా మేల్ లక్షణాలు ఉన్నాయా? యానిమల్ సినిమాలో చెప్పింది దీని గురించేనా?

Alpha Male Qualities : మీలో ఆల్ఫా మేల్ లక్షణాలు ఉన్నాయా? యానిమల్ సినిమాలో చెప్పింది దీని గురించేనా?

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?