News
News
వీడియోలు ఆటలు
X

Mutton Haleem: మటన్ హలీం ఇలా ఇంట్లోనే వండుకోండి, చేయడం పెద్ద కష్టమేమీ కాదు

హలీం కొనుక్కుని తినే వారే అందరూ. ఇంట్లో చేయడానికి ఇష్టపడరు.

FOLLOW US: 
Share:

రంజాన్ మాసం వచ్చిందంటే హలీం షాపులు కిటకిటలాడిపోతాయి. దీన్ని ఇంట్లో చేయడం చాలా కష్టం అనుకొని, అందరూ కొనుక్కొని తినడానికే ఇష్టపడతారు. హలీం వండడానికి సమయం ఎక్కువ పడుతుంది. కానీ వండడం పెద్ద కష్టమేమీ కాదు. తక్కువ మొత్తంలో ఇంట్లో వండుకోవచ్చు. ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. 

కావాల్సిన పదార్థాలు
మటన్ ఖీమా - అరకిలో 
మినప్పప్పు - అరకప్పు 
పెరుగు - ఒక కప్పు 
జీడిపప్పు - పావు కప్పు 
నెయ్యి - పావు కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు 
కారం - అర స్పూను 
పుదీనా ఆకులు - పావు కప్పు 
గోధుమలు - ఒకటిన్నర కప్పు 
పసుపు - పావు టీ స్పూన్ 
ఉల్లిపాయ - ఒకటి 
శనగపప్పు - అర కప్పు 
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
కొత్తిమీర తరుగు - అరకప్పు 
పచ్చిమిర్చి - మూడు 
ఉప్పు - రుచికి సరిపడా 
నిమ్మకాయ - ఒకటి 
గరం మసాలా - అర స్పూను

తయారీ ఇలా
1. హలీం ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవాలంటే తక్కువ మొత్తంలోనే వండుకోవాలి. 
2.  గోధుమల్ని ఒకసారి మిక్సీలో వస్తే బరకగా అవుతాయి. వాటిని కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 
3. మటన్ ఖీమాను కడిగి శుభ్రం చేసుకోవాలి. మటన్ ఖీమాకు అల్లం వెల్లుల్లి పేస్టు కారం, ఉప్పు, గరం మసాలా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. 
4. దీన్ని కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
5. స్టవ్ పై పెద్ద గిన్నె పెట్టి బరకగా చేసుకున్న గోధుమ నూకలను వేయాలి. అందులో మినప్పప్ప,  శెనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పసుపు, కొన్ని మిరియాలు వేసి పది కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి.
6. అవన్నీ మెత్తగా అయ్యి ఉడుకుతూ ఉన్నంతవరకు చిన్న మంట మీద ఉడికిస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదంతా పేస్టులా అయ్యేవరకు చేయాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.
7. ఇప్పుడు స్టవ్ పై మరొక గిన్నె పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో మెత్తగా ఉడికించిన మటన్ ఖీమా, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, పుదీనా వేసి ఉడికించాలి. 
8. ఐదు నిమిషాల పాటు ఉడికించి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పెరుగు వేసి కలపాలి. పెరుగు వేసాక మూత పెట్టి పావుగంట పాటు ఉడికించాలి. 
9. అందులో మరో మూడు కప్పులు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. 
10. ఇదంతా కాసేపు ఉడికాక ముందుగా బాగా ఉడికించి పెట్టుకున్న గోధుమ మిశ్రమాన్ని వేసి కలపాలి.
11. నెయ్యి కూడా వేయాలి. స్టవ్ సిమ్ లో పెట్టి అరగంట పాటు ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది. 12. బాగా ఉడికాక స్టవ్ కట్టేయాలి. ముందుగా ఉల్లిపాయ తరుగును వేయించి పెట్టుకోవాలి.
13.  హలీం పై వేయించిన ఉల్లిపాయలను చల్లుకోవాలి. తినాలనిపిస్తే నిమ్మ రసాన్ని కూడా పిండుకొని, కొత్తిమీర, పుదీనా తరుగును వేసి గార్నిష్ చేసుకోవాలి. దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. 

హలీమ్ వండడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. అందుకే దీన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడరు. కేవలం ముస్లిం సోదరుల ఇంట్లోనే వీటిని వండుతారు. 

Also read: రంజాన్ నెలలోనే హలీమ్‌ను తింటారు, ఎందుకు?

Published at : 22 Apr 2023 08:59 AM (IST) Tags: mutton haleem Mutton Haleem Recipe Mutton Haleem making Haleem Recipe in Telugu

సంబంధిత కథనాలు

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

Diabetes Diet Plan: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు

Diabetes Diet Plan: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు

Sleeping: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!

Sleeping: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా