By: ABP Desam | Updated at : 10 Feb 2023 02:38 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్ మెథోట్రెక్సేట్ (MTX) అతిగా తీసుకోవడం వల్ల మూడు రకాల చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదముందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ మందుని రుమటాయిడ్ ఆర్థరైటిస్, కొన్ని రకాల చర్మ సంబంధ వ్యాధులకు ఈ మందుని సూచిస్తారు. కానీ ఈ మెడిసన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయని గోథేన్ బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిరూపించారు. 2004 నుంచి 2018 మధ్య నార్డిక్ దేశాల్లోని రోగుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఔషధం తీసుకోవడం వల్ల బేసల్ సెల్ కార్సినోమా(BCC), పొలుసుల కణ క్యాన్సర్(SCC), చర్మ సంబంధమైన ప్రాణాంతక మెలనోమా( CMM) వస్తునాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మూడు రకాల చర్మ క్యాన్సర్ వచ్చిన రోగులు గతంలో MTX తో చికిత్స పొందినట్టు అధ్యయనం వెల్లడించింది. MTX అధిక మోతాదు తీసుకున్న రోగుల్లో ఎక్కువగా SCC, BCC వచ్చినట్టు పరిశోధకులు నిరూపించారు. సోరియాసిస్ ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ఈ ఔషధం ఇస్తారు. ఈ మందుతో పాటు సోరియాసిస్ తో బాధపడుతున్న రోగులకు లైట్ థెరపీ ఒక సాధారణ చికిత్స గా ఉపయోగిస్తారు.
1950 నుంచి MTX ఔషధాన్ని డెర్మటాలజీ, రుమటాలజీ ట్రీట్మెంట్ లో ముఖ్యమైన ఔషధంగా ఉపయోగిస్తారు. ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ రోగులకు సూచిస్తారు. అయితే ఈ మందు సూచించే ముందు రోగికి అంతర్లీనంగా కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి ఉందా లేదా అని సాధారణ పరీక్షలు చేస్తారు. రోగి వైద్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైద్యులు ఈ మందు సిఫార్సు చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎపిడేమియాలజీ పరిశోధకులు MTX కి చర్మ క్యాన్సర్ తో సంబంధం ఉందో లేదో అనేదాని మీద విస్తృతంగా పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరిశోధన ఫలితాలు వేరే వాటికి విరుద్ధంగా ఉన్నాయని మరికొంతమంది నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలో అతి భయంకరమైన రోగాలలో క్యాన్సర్ ఒకటి. చర్మ క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేసుకోవచ్చు. కానీ చర్మ క్యాన్సర్ పై అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలకు అధిక కాలం తరచూ గురవుతూ ఉంటే ఆ భాగంలో చర్మక్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పుట్టుమచ్చల్లాగే కనిపిస్తుంది చర్మక్యాన్సర్. గోళ్ళలో మార్పులు, శరీరం మీద పుట్టుమచ్చల్లో మార్పులు, చర్మం దురదగా అనిపించడం, పొలుసుల మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. చర్మ సంబంధ నిపుణులని కలుసుకుని పరీక్షలు చేయించుకోవాలి. శరీరంపై ఏర్పడే మచ్చల వల్ల తరచూ దురదగా అనిపిస్తే మాత్రం ఆలస్యం చేయొద్దు. మాయిశ్చరైజర్ క్రీములు ఉపయోగించినా కూడా కొన్ని పొడి మచ్చలు మాయం కాకపోతే అవి తప్పకుండా చర్మ క్యాన్సర్ గా అనుమానించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!
Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?
Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్లో ఎప్పుడు చేరాలి?
Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే
Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>