అన్వేషించండి

Mpox: మంకీ పాక్స్ గాలి, తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందా?

చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వంటి అంటువ్యాధుల్లో కొత్త పాక్స్ వ్యాధి Mpox. ఆఫ్రీకాలో మొదలై నెమ్మదిగా ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తోంది. దీని గురించిన అవగాహన కలిగి ఉండాలి. ఆ సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మంకీ పాక్స్ (Mpox) ఇన్ఫెక్షన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. దీని వ్యాప్తి, లక్షణాలు, నివారణ గురించిన అవగాహన అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వైరస్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఆప్ ఇంటర్నేషనల్ కన్సెర్న్ గా ప్రకటించింది. ఆఫ్రికాలో మొదలైన ఈ పాక్స్ వ్యాధి తర్వాత కాలంలో ప్రపంచ దేశాల్లోనూ కనిపించడం మొదలైంది. ఇప్పుడు స్వీడన్, పాకీస్తాన్ లలో కూడా కేసులు నమోదయ్యాయి. భారత సరిహద్దు దేశాల్లో వ్యాధి వ్యాప్తి కనిపించడంతో మన దేశం కూడా హై అలెర్ట్ లో ఉంది. మరి mpox ఎలా వ్యాపిస్తుంది? భారతదేశానికి నిజంగా ముప్పు ఉందా? Mpox వ్యాప్తిని పరిష్కరించడానికి ప్రపంచం సన్నద్ధమవుతున్నందున ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎలా వ్యాపిస్తుంది?

వ్యాధిని అరికట్టాలన్నా, అదుపు చెయ్యాలన్నా వ్యాధి వ్యాపించే కారణాలు, వ్యాపించే విధానాలపై అవగాహన చాలా అవసరం. మనం మాట్లాడేప్పుడు లేదా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కూడా mpox వ్యాపిస్తుంది. కానీ కోవిడ్ – 19 మాదిరిగా ఇందులో సంక్రమణకు కారణమయ్యే కణాలు అంత బలంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. యూస్ లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన వారు చెప్పినదాన్ని బట్టి దగ్గరగా మసలడం సుదీర్ఘ సంభాషణల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. షార్ట్ రేంజ్ ఏరోసోల్స్ వల్ల mpox వ్యాపిస్తుందని WHO ప్రకటించింది.

ఏరోసోల్ డ్రాప్లెట్స్ వ్యాధి వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. సన్నిహితంగా ఉండడం, లైంగిక చర్య ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. "ఇన్‌ఫ్లుఎంజా SARS-CoV-2 వంటి త్వరగా గాలిలోవ్యాపించే వైరస్‌ల మాదిరిగా కాకుండా అంత త్వరగా వ్యాప్తి చెందే అవకాశం లేదు" అని కూడా నిపుణులు అంటున్నారు. అయినా సరే కుటుంబ సభ్యుల మధ్యలో వ్యాపించడం, వ్యాధి సోకిన వ్యక్తి తో సన్నిహిత సంబంధాలతో వ్యాధి వ్యాపించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

లక్షణాలు

ఏ వ్యాధి అయినా మనకు సోకిందేమో అనే అనుమానం రావాలంటే కచ్చితంగా ఆ వ్యాధి లక్షణాల గురించిన అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చర్మం మీద నొప్పితో కూడిన పొక్కులు కూడా ఉంటాయి. ఈ పొక్కుల వల్ల ఇతరులకు స్పర్శతో కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. స్మాల్ పాక్స్, ఎమ్ పాక్స్ నిజానికి శ్వాసకోస వైరస్ గా చెప్పవచ్చనేది డాక్టర్ల అభిప్రాయం. పిల్లల్లో శ్వాసకోశ లక్షణాలు కూడా కనిపిస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించడం సాధ్యమే. వ్యక్తిగత శుభ్రత పాటించడం, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. Mpoxకి వ్యాక్సిన్ ను తయారు చెయ్యడానికి సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఏడాది వ్యవధిలో ఇది అందుబాటులోకి రావచ్చన్న ఆశాభావంలో ఉన్నామని కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు చెప్పారు. ఇలా చిన్నచిన్న జాగ్రత్తలతో ఈ ఇన్ఫెక్షన్ ను అధిగమించడం కష్టమేమీ కాదు.

Also Read : షుగర్ ఉన్నవాళ్లు బెండకాయలు అలా తీసుకుంటే చాలా మంచిదట.. మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget