అన్వేషించండి

Monsoon Health Tips : వర్షాకాలంలో గోరువెచ్చని నీటిని తాగితే కలిగే లాభాలివే.. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దూరం

Hot Water in Rainy Season : వర్షాకాలంలో చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటారు. కానీ నీటిని తాగడమే కాదు.. గోరువెచ్చని నీటిని తాగితే మాన్సూన్​లో ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు. అవేంటంటే..

Monsoon Health Tips with Luke Warm Water : వర్షాకాలంలో చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే.. నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నీటిని తక్కువగా తీసుకుంటారు. పైగా చల్లని వాతావరణంలో నీటిని ఎక్కువగా తాగడంవల్ల వాష్​రూమ్​కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. అందుకే చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. మాన్​సూన్​లో నీటిని తీసుకోవడమే కాదు.. గోరువెచ్చని నీటిని తీసుకుంటూ హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారో.. దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

వర్షాకాలంలో వాతావరణం తేమతో నిండి ఉంటుంది. అంతేకాకుండా హ్యూమిడిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ సీజన్​లో వైరస్​లు, బ్యాక్టీరియాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్​లో ఎక్కువగా వ్యాధులు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా నీటి ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే నీటిని కాస్త వేడి చేసి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నీటిని వేడి చేసి వడకట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు. మరి వర్షాకాలంలో నీటిని వేడి చేసి తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలివే..

వర్షాకాలంలో చాలామంది జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. దీనివల్ల తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. ఆ సమయంలో శరీరంలో టాక్సిన్లు పేరుకుంటాయి. అప్పుడు గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లు మూత్రం రూపంలో బయటకు వస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పలురకాల జీర్ణ సమస్యలను దూరం చేయడంలో గోరువెచ్చని నీరు హెల్ప్ చేస్తుంది.

రోజూ వేడి చేసిన నీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు వచ్చే సమస్య తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటివి దరిచేరవు. వచ్చినా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఇన్​ఫెక్షన్లను తగ్గించడంలో, శరీరాన్ని తేమగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. చల్లని వాతావరణలో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోవడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. స్కిన్ మెరుస్తూ, హెల్తీగా ఉంటుంది. 

నీటిని ఎప్పుడు తాగితే మంచిదంటే.. 

ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు నీటిని సిప్ చేస్తూ తాగాలి. అలాగే ప్రతి భోజనానికి అరగంట ముందు తాగితే మంచిది. రాత్రి నిద్రకు ఓ గంట ముందు తాగితే మంచిది. ఇలా నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఉదయాన్నే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. మంచి నిద్ర మీ సొంతమవుతుంది. కాబట్టి వర్షాకాలంలో నీటిని తీసుకోవడం అస్సలు స్కిప్ చేయవద్దు. గోరువెచ్చని తీసుకోవడం అస్సలు మానొద్దు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Tour Cases: జగన్ గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమణ; ఐదుగురు వైసీపీ కీలక నేతలపై కేసులు
జగన్ గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమణ; ఐదుగురు వైసీపీ కీలక నేతలపై కేసులు
RBI Repo Rate: రెపో రేటును మార్చని RBI; 5.25% వద్ద కొనసాగింపు! మీ EMIలో ఎలాంటి మార్పు లేదు!
రెపో రేటును మార్చని RBI; 5.25% వద్ద కొనసాగింపు! మీ EMIలో ఎలాంటి మార్పు లేదు!
Rajamouli Remuneration : రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత? - 'వారణాసి' కోసం మహేష్, జక్కన్న న్యూ స్ట్రాటజీ!
రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత? - 'వారణాసి' కోసం మహేష్, జక్కన్న న్యూ స్ట్రాటజీ!
Attitude Star Chandrahass : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?

వీడియోలు

Jemimah Rodrigues about Final Match RCB vs DC | కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్ జెమీమా
Suryakumar Yadav on Ind vs Pak T20 World Cup | పాక్ పై సూర్య కామెంట్స్
WPL 2026 Champion Royal Challengers Bengaluru | రెండోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీ
Dhoni's sensational comments on Kohli-Rohit | కోహ్లీ–రోహిత్ పై ధోని సంచలన వ్యాఖ్యలు
Congress MPs Attack on PM Modi | ప్రధానిని గాయపర్చాలని కాంగ్రెస్ మహిళా ఎంపీల కుట్ర | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Tour Cases: జగన్ గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమణ; ఐదుగురు వైసీపీ కీలక నేతలపై కేసులు
జగన్ గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమణ; ఐదుగురు వైసీపీ కీలక నేతలపై కేసులు
RBI Repo Rate: రెపో రేటును మార్చని RBI; 5.25% వద్ద కొనసాగింపు! మీ EMIలో ఎలాంటి మార్పు లేదు!
రెపో రేటును మార్చని RBI; 5.25% వద్ద కొనసాగింపు! మీ EMIలో ఎలాంటి మార్పు లేదు!
Rajamouli Remuneration : రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత? - 'వారణాసి' కోసం మహేష్, జక్కన్న న్యూ స్ట్రాటజీ!
రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత? - 'వారణాసి' కోసం మహేష్, జక్కన్న న్యూ స్ట్రాటజీ!
Attitude Star Chandrahass : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?
Revanth Reddy vs Amit Shah:
"మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి గెలవండి" అమిత్‌ షాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!
Parasakthi OTT : ఓటీటీలోకి శివకార్తికేయన్ 'పరాశక్తి' - తెలుగులో డైరెక్ట్‌ స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
ఓటీటీలోకి శివకార్తికేయన్ 'పరాశక్తి' - తెలుగులో డైరెక్ట్‌ స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
YSRCP :
"తిరుమల లడ్డూ వివాదంపై అబద్దాలతో దైవ ద్రోహం" కూటమి సర్కార్‌పై వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఎదురుదాడి
Health Drinks : మధుమేహం, కొలెస్ట్రాల్ తగ్గించే 5 హెల్తీ డ్రింక్స్ ఇవే.. వేటితో ఏ లాభాలున్నాయంటే
మధుమేహం, కొలెస్ట్రాల్ తగ్గించే 5 హెల్తీ డ్రింక్స్ ఇవే.. వేటితో ఏ లాభాలున్నాయంటే
Embed widget