IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

ఆమె కలలను కాజేసిన కరోనా పిశాచి, కాళ్లు కోల్పోయి నరకం అనుభవిస్తున్న మోడల్, కారణం ఏమిటీ?

కరోనా కేవలం ఊపిరి మాత్రమే నిలిపేయదు. తేడా వస్తే.. శరీర అవయవాలను కూడా చచ్చుబడేలా చేస్తుంది. ఇందుకు ఈ మోడల్‌కు ఎదురైన పరిస్థితే నిదర్శనం.

FOLLOW US: 

కోవిడ్-19 ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్థం చేసింది. ఎందరినో అనాథలను చేసింది. సరిగ్గా ఇదే సమయానికి గతేడాది ఎందరో ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు కాస్త తగ్గుముఖం పెట్టినా.. అది మిగిల్చిన చేదు గుర్తులు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే, కోవిడ్ పూర్తిగా మనుషులను విడిచిపెట్టలేదు. చైనా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాల్లో ఇంకా తన ఉనికి చాటుతోంది. మరికొద్ది రోజుల్లో తిరిగి ఇండియాలోకి ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

కోవిడ్-19 ఎంత ప్రాణాంతకమనేది గతేడాది ‘డెల్టా’ వేరియెంట్ ద్వారా తెలిసింది. కొత్తగా ‘డెల్టాక్రాన్’ వేరియెంట్ కూడా ప్రాణాలను తీసుకెళ్లేందుకు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేరియెంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కాబట్టి, మనం జాగ్రత్తగా పాటించడమే ఉత్తమ మార్గం లేకపోతే.. ఈ యువతి తరహాలోనే భయానక అనుభవాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మోడలింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్న ఆమె.. ఇప్పుడు నడవలేక శాస్వతంగా వీల్ చైర్‌కు పరిమితమైంది. వైద్యులు ఆమె రెండు కాళ్లను పూర్తిగా తొలగించడంతో భవిష్యత్తులో కూడా ఆమె ర్యాంప్‌పై నడవలేదు. ఈ చేదు విషయాన్ని దిగమింగుతూ ఆమె ఆత్మవిశ్వాసంతో జీవిస్తోంది. మరి ఆమె కాళ్లను కోల్పోడానికి కారణం ఏమిటీ? కోవిడ్ అంత ప్రమాదకరమా? 

Also read: షాకింగ్, రక్తంలోనూ చేరిపోయిన ప్లాస్టిక్ , నిరూపించిన కొత్త పరిశోధన

ఫ్లొరిడాలోని టాంపాకు చెందిన క్లారీ బ్రిడ్జెస్ అనే యువతి ఈ ఏడాది జనవరి 16న కోవిడ్-19 లక్షణాలతో హాస్పిటల్‌లో చేరింది. కరోనా మయోకార్డిటిస్, సైనోటిక్, అసిడోసిస్, రాబ్డోమియోలిసిస్, న్యుమోనియా తదితర లక్షణాలకు చికిత్స పొందింది. అయితే, కోవిడ్ వల్ల ఆమె కాళ్లకు రక్త సరఫరా నిలిచిపోయింది. కాళ్లు కుళ్లిపోయి, ఆ ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు సోకుతుందనే కారణంతో వైద్యులు ఆమె రెండు కాళ్లను తొలగించారు. దీంతో క్లారీ తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందే ఆమె కాళ్లను కోల్పోవడం ఆమె కుటుంబ సభ్యులను మరింత బాధించింది. ఇప్పుడు శరీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉందని ఆమె తండ్రి  వాపోయాడు. కానీ, ఆమె చాలా ధైర్యం గలదని, కాళ్లు కోల్పోయినా ఆత్మ విశ్వాసంతో.. పూర్తి ఆరోగ్యంతో కోలుకుందని తెలిపాడు.  

Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే

Published at : 25 Mar 2022 08:01 PM (IST) Tags: Model Loses legs Model loses legs due to Covid 19 covid 19 legs losses Florida model loses legs

సంబంధిత కథనాలు

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

టాప్ స్టోరీస్

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Elon Musk: ఎలన్‌ మస్క్‌ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?

Elon Musk: ఎలన్‌ మస్క్‌ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?

TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం

TTD Darshan Tickets For July, August  : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం

Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు