అన్వేషించండి

Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే

Nivati Beach : సమ్మర్​లో బీచ్​కి వెళ్లాలనుకుంటున్నారా? ఇండియాలో.. బడ్జెట్​లోనే బాలి వంటి ఎక్స్​పీరియన్స్ కావాలంటే నివటి బీచ్​కి వెళ్లిపోండి. పూర్తి వివరాలు ఇవే..  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొంకణ్ తీరాన్ని 'మినీ బాలి'గా సందర్శించండి.
  • నివాటి బీచ్ వద్ద 2-3 గంటల బోట్ రైడ్ ఆనందించండి.
  • హైదరాబాద్ నుంచి గోవా, కుడాల్ లేదా రోడ్ మార్గాల్లో చేరుకోండి.
  • మాల్వని వంటకాలను రుచి చూస్తూ, బడ్జెట్​లో బస చేయండి.

Hyderabad to Nivati Beach : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాగా పెరిగిపోయాయి. 9 దాటితే ఇంటి నుంచి బయటకు వెళ్లడమంటే ఓ మినీ సాహసయాత్ర అయిపోతుంది. ఇలాంటి హాట్ సమ్మర్లో చాలామంది సేదతీరేందుకు బీచ్ వెకేషన్స్​కి వెళ్తారు. అలా వెళ్లే బీచ్ డెస్టినేషన్స్​లో బాలి చాలా ఫేమస్. అయితే అక్కడి వెళ్లేందుకు కాస్త బడ్జెట్ ఎక్కువే అవుతుంది. కానీ తక్కువ ఖర్చుతో ఇండియాలోనే బాలి లాంటి ఎక్స్​పీరియన్స్ చేయాలంటే 'మినీ బాలి'కి వెళ్లిపోండి.

మినీ బాలి?

మీరు తక్కువ బడ్జెట్​లో బాలిలాంటి ప్లేస్ చూడాలనుకుంటే.. మహారాష్ట్రలోని కొంకణ్​కి వెళ్లిపోండి. అక్కడ మీరు నివటి బీచ్​కో పాటు.. ఎన్నో ఎక్స్​పీరియన్స్ చేయవచ్చు. ఈ ప్రదేశాన్ని 'మినీ బాలి' అని కూడా అంటారు. ఎక్కువమందికి తెలియని ఈ ప్రదేశం.. మీకు సమ్మర్​లో బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 

మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో వివిధ బీచ్​లు ఉన్నాయి. ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఇది బెస్ట్, ప్రశాంతమైన అనుభవాన్ని అందిస్తుంది. మరి అక్కడికి వెళ్తే చూడాల్సిన ప్రదేశాలు ఏంటి? ఎంత బడ్జెట్ అవుతుంది? స్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హైదరాబాద్​ నుంచి వెళ్తే బడ్జెట్​లో ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసేద్దాం. 

బోట్ రైడ్ ఎలా ఉంటుందంటే.. 

కొంకణ్ మీకు పూర్తిగా భిన్నమైన మరో ప్రపంచాన్ని మీకు చూపిస్తుంది. ఇక్కడికి వెళ్లాక కచ్చితంగా నివటి ట్రిప్ ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ డీప్ సీ సఫారీ 2–3 గంటలు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎన్నో అద్భుతాలు, మానవ సంచారం లేని ప్రదేశాలు, డాల్ఫిన్లు చూడగలుగుతారు. ఈ బోట్ రైడ్ పూర్తి డిటైల్స్ చూసేద్దాం. 

డీప్ సీ సఫారీ 

ఇలా బోట్ రైడ్ చేయాలంటే దేవ్‌బాగ్ లేదా నివాటి బీచ్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. దీనికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో మీరు 10 నుంచి 12 అద్భుతమైన ప్రదేశాలను కవర్ చేస్తారు. ఓల్డ్ లైట్‌హౌస్, న్యూ లైట్‌హౌస్, డాల్ఫిన్ పాయింట్, మహాత్రిచి చుల్, సీక్రెట్ టన్నెల్, నివాటి రాక్స్, నివాటి కిల్ల, మినీ కేరళ, సీగల్ ఐలాండ్, నివాటి గోల్డెన్ రాక్స్, సునామీ ఐలాండ్ చూడగలుగుతారు. 
ఈ రైడ్ కేవలం విహారయాత్ర మాత్రమే కాదు.. ఇది మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడి వాతావరణం మీకు నిజంగానే మినీ బాలి ఫీల్ ఇస్తుంది. ఇవేకాకుండా దేవ్‌బాగ్ సంగమం (నది, సముద్రం కలిసే చోటు), నివటి ఫోర్ట్, రెడ్డి గణపతి ఆలయం చూడవచ్చు. 

హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలంటే..

హైదరాబాద్ నుంచి నివటి చేరుకోవాలంటే ఓ చిన్న ట్రావెల్ అడ్వెంచర్‌ చేయాల్సిందే. ముందుగా హైదరాబాద్ నుంచి గోవా ఫ్లైట్​లో వెళ్లాల్సి ఉంటుంది. మోపా నుంచి 50 కి.మీ డ్రైవ్ ఉంటుంది. ట్రైన్​లో వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి కుడాల్ వెళ్లవచ్చు. అక్కడి నుంచి 25 కి.మీ డ్రైవ్ ఉంటుంది. రోడ్ ట్రిప్ వెళ్లాలనుకుంటే ముందుగా సొలాపూర్ వెళ్లి కొల్హాపూర్ మీదుగా అంబోలి ఘాట్ రూట్​లో 640 కి.మీ డ్రైవ్ చేయాలి. ఈ రూట్ చాలా సీనిక్‌గా ఉంటుంది.

ఫుడ్ & స్టే 

ఇక్కడి మాల్వని ఫుడ్ తప్పక ట్రై చేయండి. ఫిష్ థాలి, సోల్కడీ, కాజు ఆమ్టీ మంచి రుచిని అందిస్తాయి. 1500 నుంచి 3000లల్లో మీకు స్టేలు దొరుకుతాయి. మిడ్ రేంజ్లో కావాలంటే 3000 నుంచి 6000.. లగ్జరీ కావాలంటే 6000 నుంచి 12,000 వేలల్లో అందుబాటులో ఉంటాయి. 

గుర్తించుకోవాల్సిన విషయాలు 

మీరు ఇక్కడికి వెళ్లాలనుకుంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో వెళ్లాలి. డీప్ సీ సఫారీకి మార్నింగ్ టైమ్ వెళ్లండి. కొబ్బరి నీళ్లు తప్పక తాగండి. ఇది మంచి టేస్ట్ ఇవ్వడంతో పాటు హైడ్రేషన్ అందిస్తుంది. మొత్తానికి కొంకణ్ ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా గడపాలని అనుకునేవారికి పర్ఫెక్ట్ ప్లేస్ అవుతుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Embed widget