కేరళను గాడ్ ఓన్స్ కంట్రీ అంటారు. ఎందుకంటే అక్కడున్న ప్రకృతి సౌందర్యం, సంస్కృతి, సంప్రదాయాలు కేరళను భారతదేశంలో అత్యంత ప్రియమైన ప్రయాణ గమ్యస్థానంగా చేశాయి.
పచ్చని ప్రకృతి, పొగమంచుతో కూడిన పర్వతాలు, బ్యాక్ వాటర్స్, విశాలమైన అరేబియా సముద్రం కేరళను ప్రతి మలుపులోనూ అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్దాయి.
కేరళ ట్రిప్‌కి వెళ్లాలనుకునేవారు అక్కడ ప్రకృతి సౌందర్యంతో పాటు.. సంస్కృతి, ఆధ్యాత్మిక శాంతిని కూడా చూడగలుగుతారు.
మరి మీరు కేరళకు వెళ్లాలనుకుంటే అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఏంటో చూసేద్దాం.
మున్నార్ కేరళలోని అత్యంత ప్రసిద్ధమైన హిల్ స్టేషన్. ఇక్కడ తేయాకు తోటలు, జలపాతాలు, చల్లని బ్రీజ్ చాలా ఆకట్టుకుంటుంది.
ఆలెప్పీ (అలప్పుళ) దగ్గర ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ చూడొచ్చు. సాంప్రదాయమైన హౌస్ బోట్లు, పచ్చని వరి పొలాలు చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
కోవలం కేరళలోని ప్రసిద్ధమైన బీచ్ ప్లేస్. ఇక్కడ బంగారు ఇసుక, అద్భుతమైన సూర్యాస్తమయాలు ఉంటాయి. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తారు.
తిరువనంతపురం లేదా త్రివేండ్రం సంప్రదాయం, ఆధునికతల సంగమంగా చెప్పొచ్చు. ఇక్కడ దేవాలయాలు, మ్యూజియంలు బాగా ఆకట్టుకుంటాయి.
కోచి చరిత్ర, సంస్కృతికి కేంద్రంగా ఉంది. ఇక్కడ పురాతనమైన చర్చ్‌లు, చైనీస్ ఫిషింగ్ వలలు, దేవాలయాలు ఉంటాయి.