ఋతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య. ఈ సమయంలో నెలసరి నొప్పులు కొందరికి అసౌకర్యం కలిగిస్తాయి. అలసటకు కారణమవుతాయి.
ఋతుస్రావం సమయంలో గర్భాశయం సంకోచించడం వల్ల ఈ తిమ్మెర్లు వస్తాయి. వైద్యపరంగా వీటిని డిస్మెనోరియా అంటారు.
హీట్ థెరపీని తరతరాలుగా సహజమైన ఇంటి చిట్కాగా చెప్తారు. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజంగా ఉపశమనాన్ని అందిస్తుంది.
నడుము, వెనుక భాగంలో బిగుసుకున్న కండరాలను వేడి సడలిస్తుంది. దీని వలన నెలసరి నొప్పుల తీవ్రత తగ్గుతుంది.
వెచ్చదనం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో బిగుసుకుపోవడం, వాపు, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
హీట్ ప్రోస్టాగ్లాండిన్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. నొప్పి కలిగించే కండరాల సంకోచాలకు కారణమయ్యే రసాయనాలు.
వేగవంతమైన ఉపశమనం కోసం మీరు వేడి నీళ్లతో కాపడం పెట్టుకోవడం, హీటింగ్ ప్యాడ్ ఉపయోగించవచ్చు.
హీట్ ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. అధిక వేడి వల్ల చర్మం కాలిన గాయాలకు కారణం కావచ్చు.
హీట్ ప్యాడ్ ట్రీట్మెంట్ సురక్షితమైనది. చవకైనది. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కోసం అత్యంత ప్రభావవంతమైన సహజ నివారణలలో ఒకటిగా చెప్పారు.