అన్వేషించండి

Watermelon Storage Tips : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?

Cut Watermelon in the Fridge : ఫ్రిడ్జ్​లో కట్ చేసిన పుచ్చకాయను పెట్టవచ్చా? ఇలా తింటే ఇబ్బందులు ఉంటాయా? మరి పుచ్చకాయను ఎలా స్టోర్ చేయాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్‌లో సరిగ్గా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది.
  • పుచ్చకాయ ముక్కలను ఎయిర్ టైట్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ ర్యాప్‌తో కవర్ చేయండి.
  • కట్ చేసిన పుచ్చకాయను 24 గంటల్లోపు తినడం ఉత్తమం, 4°C వద్ద నిల్వ చేయాలి.
  • పిల్లలు, సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు ఎక్కువసేపు నిల్వ ఉన్న పుచ్చకాయను తినకూడదు.

Watermelon Store in the Fridge : వేసవికాలంలో ఎక్కువగా తినే వాటిలో పుచ్చకాయ కచ్చితంగా ఉంటుంది. చల్లగా, తియ్యగా ఉండే వాటర్​మిలాన్​ని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. సమ్మర్​లో దీనిని రెగ్యులర్​గా తింటే డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయి. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే చాలామంది ఏమి చేస్తారంటే.. పుచ్చకాయను ఒకేసారి తినలేరు కాబట్టి.. దాన్ని కట్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తుంటారు. మరి పుచ్చకాయను ఫ్రిడ్జ్​లో పెట్టి తినొచ్చా? లేదా? ఎలా తీసుకుంటే మంచిదో చూసేద్దాం. 

కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదా?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య చిట్కాలు అంటూ కొన్ని విషయాలపై రాంగ్ ఇన్​ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాంటిదే ఇది కూడా. పుచ్చకాయ ఫ్రిడ్జ్​లో పెట్టకూడదంటూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. కానీ నిజానికి పుచ్చకాయను ఫ్రిడ్జ్​లో పెట్టొచ్చు. కానీ దానిని ఎలా పెడుతున్నామనేది ముఖ్యమైన విషయం. పుచ్చకాయను ఫ్రిడ్జ్​లో ఎలా పెట్టాలి.. ఎలా తింటే మంచిదంటే.. 

పుచ్చకాయ కట్ చేసి.. ఫ్రిడ్జ్​లో పెట్టాలనుకుంటే..

పుచ్చకాయను కట్ చేసిన తర్వాత అది గాలికి ఎక్స్‌పోజ్ అవుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. పోషకాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన విధంగా స్టోర్ చేయకపోతే మాత్రమే సమస్యలు వస్తాయి.

ఎలా పెట్టకూడదంటే.. 

పుచ్చకాయను కోసేసి.. ఓపెన్‌గా ప్లేట్‌లో పెట్టడం మంచిది కాదు. కవర్ లేకుండా ఫ్రిడ్జ్‌లో ఉంచినా.. చాలా రోజులు కట్ చేసి అలాగే ఉంచడం మంచిది కాదని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల పుచ్చకాయ రుచి మారడంతో పాటు.. బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల తిన్నప్పుడు కడుపు సమస్యలు రావచ్చు.

ఫ్రిడ్జ్​లో స్టోర్ చేసుకోవాలనుకుంటే.. 

పుచ్చకాయను ముక్కలుగా కోస్తే.. వాటిని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టండి. కట్ చేసిన ముక్కలను ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టడం వల్ల గాలికి ఎక్స్​పోజ్ అవ్వదు. లేదా ప్లాస్టిక్ ర్యాప్ లేదా ఫుడ్ గ్రేడ్ కవర్ ఉపయోగించండి. కట్ చేసిన 24 గంటల్లో పుచ్చకాయ తినేస్తే మరీ మంచిది. పుచ్చకాయను ఎక్కువ కాలం స్టోర్ చేయకపోవడమే మంచిది. 1 రోజు లోపు తింటే మంచిది. ఫ్రిడ్జ్‌లో 4°C దగ్గర ఉంచితే ఫ్రెష్‌గా ఉంటుంది. 

ఈ తప్పులు చేయకండి.. 

చిన్నపిల్లలు, సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు ఎక్కువ సేపు స్టోర్ చేసిన పుచ్చకాయ తినకపోవడం మంచిది. ఫ్రెష్​గా తింటే మంచిది. పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం తప్పు కాదు. కానీ సరైన విధంగా స్టోర్ చేయకపోతేనే ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించుకోండి. కాబట్టి ఎప్పుడూ శుభ్రంగా, కవర్ చేసి, తక్కువ సమయంలో తినడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
Embed widget