Mango Cake: రెండు నిమిషాల్లో చేసుకునే మ్యాంగ్ మగ్ కేక్
వేసవిలో మామిడి పండు తినేందుకు ఎంతో మంది ఎదురు చూస్తారు.
మామిడి పండ్లను చూస్తే చాలు నోరూరిపోవడం ఖాయం. నాలుగు వేల సంవత్సరాలుగా మనం ఆహారంలో ఈ పండు భాగమైపోయింది. మనదేశంలో వంద రకాలకు పైగా మామిడి రకాలు పండుతాయి. దీనితో వండే వంటకాలు కూడా మామూలుగా ఉండవు. టేస్టీలో అదిరిపోతాయి. మామిడిపండ్లు ఊబకాయుల్లో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఈ సీజనల్ పండ్లను తినడం చాలా ముఖ్యం. తియ్యని మామిడి పండ్లతో ఐస్ క్రీములు, డిజర్ట్‌లు అనేక చేస్తారు. కేకుల్లో కూడా దీనికి ప్రాధాన్యత ఉంది. మ్యాంగో కేక్ చాలా టేస్టీగా నోరూరిస్తుంది. పెద్దలకు కూడా నచ్చుతుంది. ఇంట్లోనే మ్యాంగ్ మగ్ కేక్‌ను సులువుగా చేసుకోవచ్చు.కేవలం రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పిల్లల ఫేవరేట్ కేక్ ఇది.
కావాల్సిన పదార్థాలు
మ్యాంగో ప్యూరీ - పావు కప్పు
మిల్క్ - మూడు స్పూనులు
వెనిల్లా ఎసెన్స్ - పావు స్పూనులు
పంచదార పొడి-పావు కప్పు
బిస్కెట్ల పొడి - పావు కప్పు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూను
బేకింగ్ సోడా - పావు టీస్పూను
వెజిటబుల్ నూనె - అర స్పూను
తయారీ
1. మైక్రోవోవెన్లో పెట్టే మగ్ ను ముందుగా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి.
2. ఆ మగ్ లో మ్యాంగో ప్యూరీ, పాలు, నూనె, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.
3. అందులో పంచదార పొడి, బిస్కెట్ల పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పొడి కూడా వేసి బాగా గిలక్కొట్టాలి.
4. ఎలాంటి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి.
5. ఆ మగ్‌ను మైక్రోవోవెన్‌లో రెండు నిమిషాలు ఉంచాలి. ఆ రెండు నిమిషాల్లో కేకు రెడీ అయిపోతుంది.
మామిడి పండులో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే బీటాకెరాటిన్ అనే పదార్థం మన శరీరానికి ఎంతో అత్యవసరం. మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, ప్రొటీన్, ఫోలిక్ ఆమ్లం, పొటాషియం వంటివి లభిస్తాయి. ఈ పండు తినడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అందానికీ మామిడి పండు మేలు చేస్తుంది. దీనిని తింటే చర్మంపై ముడతలు, నల్ల మచ్చలు పోతాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను తట్టుకునే సామర్థ్యాన్ని ఇది చర్మానికి అందిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మహిళలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గిస్తుంది.
Also read: నెలసరి వచ్చిందా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం
Also read: కొందరి ఆడవాళ్లకు గడ్డాలు, మీసాలు మొలుస్తాయి, ఎందుకు?