అన్వేషించండి

Women: కొందరి ఆడవాళ్లకు గడ్డాలు, మీసాలు మొలుస్తాయి, ఎందుకు?

సమాజంలో కొంత మంది ఆడవాళ్లు గడ్డాలు, మీసాల కారణం వివక్షకు గురవుతున్నారు.

గడ్డాలు, మీసాలు మగవారి పురుషత్వానికి నిదర్శనాలు. కానీ కొందరి ఆడవాళ్లలో గడ్డాలు, మీసాలు మొలుస్తూ వారికి  సమస్యగా మారాయి. నలుగురిలో వెళితే అసభ్యకరమైన కామెంట్లు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టీనేజీ వయసుకు వచ్చాకే కొంతమంది అమ్మాయిల్లో లేతగా మీసాలు, గడ్డాలు వస్తున్నాయి. దీని కోసం షేవింగ్లు, లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. మహిళల్లో ఇలా గడ్డాలు, మీసాలు రావడానికి కారణాలు ఏమిటి? 

అసలెందుకు ఇలా?
ముఖంపై వెంట్రుకలు రావడానికి రెండు కారణాలు కావచ్చు. అవి ఒకటి జన్యుపరమైనవి, అంటే వారసత్వంగా వచ్చేవన్న మాట. పూర్వీకుల్లో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది హార్మోన్ల అసమతుల్యత కూడా అవ్వచ్చు. హార్మోన్ల సంతులనం తప్పినప్పుడు కూడా మహిళల్లో గడ్డాలు, మీసాలు రావడం మొదలవుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల గడ్డాలు వస్తే దానని ‘జెనెటిక్ హైపర్ ట్రయికోసిస్’ అంటారు. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల కలిగే ఈ సమస్యను ‘హర్ స్యూటిజం’ అంటారు. అలాగే పీసీఓడీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్) ఉన్న వారిలో కూడా ఇలా ముఖంపై వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శక్తివంతమైన స్టెరాయిడ్లు వాడడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. దీని వల్ల టెస్టోస్టెరాన్, ఎండ్రోజెన్ హార్మోన్లు విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి పురుష హార్మోన్లు. వీటి వల్ల కూడా సమస్య పెరుగుతుంది. చికిత్స ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. 

ఆమె గడ్డమే హైలైట్
పదహారేళ్ల అమ్మాయి హర్మాన్ కౌర్. బ్రిటన్ లో నివసించే ఈ టీనేజి అమ్మాయికి పురుషుల్లాగే దట్టమైన గడ్డాలు వచ్చాయి. ఆమెకు పాలిసిస్టిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది. దీనివల్లే ముఖం, శరీరంపై వెంట్రులకు అధికంగా పెరుగుతున్నాయి. గడ్డాలు మరీ అధికంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఆమెను చాలా కుంగదీసింది. చివరికి ఆత్మ హత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించింది. కానీ మధ్యలో మంచి వాళ్ల స్పూర్తి వాక్యాలు ఆమెలో ఆశలు చిగురించేలా చేశాయి. తాను ఎలా ఉన్నానో ఆ రూపాన్ని స్వీకరించింది. అంతేకాదు గడ్డం షేవింగ్ చేసుకోవడం కూడా మానేసింది. ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా నిలిచింది. ఇప్పుడామె ఎక్కడికి వెళ్లినా గడ్డాలతోనే వెళుతుంది. అదే నా ఐడెంటిటీ అని చెబుతుంది. అయినా శారీరకంగా వచ్చే మార్పును స్వీకరించాల్సిన అవసరం ఉంది. దానికి చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా అవసరం అని చెబుతోంది హర్మాన్.

Also read: శాకాహారంతో మగవారు ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు

Also read: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఇవిగో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget