Snake In Toilet: కుయ్యో.. మూత్రం పోస్తుంటే ‘అక్కడ’ కాటేసిన పాము.. ‘అది’ కుళ్లిపోయి నరకయాతన, చివరికి.
టాయిలెట్‌కు వెళ్లిన 47 ఏళ్ల వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం ఇది. అతడిని కాటేసింది సాధారణ పాము కాదు.. నాగుపాము. దానివల్ల అతడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడో చూడండి.
టాయిలెట్‌కు వెళ్తున్నారా? అయితే.. జాగ్రత్త, పాములు మీ కోసం పొంచి ఉండవచ్చు. మీరు కూర్చొనే వరకు వేచి చూసి.. చటుక్కున కాటేయవచ్చు. అదే జరిగితే.. అంత కంటే నరకం మరొకటి ఉండదు. నెదర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
47 ఏళ్ల వ్యక్తి హాలీడేస్ ఎంజాయ్ చేయడం కోసం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అనంతరం అక్కడి అడవుల్లో సఫారీకి వెళ్లాడు. అప్పటి వరకు అంతా సాఫీగా ఉంది. అయితే, అర్జంట్‌గా మూత్రం రావడంతో మార్గ మధ్యలో ఓ టాయిలెట్‌లోకి వెళ్లాడు. విసర్జన కోసం కమోడ్ మీద కూర్చున్నాడు. దీంతో అప్పటికే అందులో రిలాక్స్ అవుతున్న నాగు పాముకు కోపం వచ్చింది. అంతే.. ఒక్కసారే అతడి మార్మాంగం మీద కాటేసింది. అంతే.. ఆ నొప్పిగా అతడు కేకలు పెట్టాడు. ఏం జరిగిందా అని చూస్తే.. టాయిలెట్‌లో పాము ఉంది.
మెడికల్ జర్నల్ యూరాలజీ కేస్ రిపోర్ట్స్‌లో పేర్కొన్న వివరాలు ప్రకారం.. సఫారీకి దగ్గర్లో హాస్పిటళ్లు లేవు. సుమారు 220 కిమీల దూరంలో ట్రామా సెంటర్ ఉంది. దీంతో అధికారులు హెలికాప్టర్ ద్వారా అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు అతడు సుమారు 3 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. పాము కాటు వల్ల అతడి జననేంద్రియాలు (అంగం, వృషణాలు) వాచిపోయాయి. వంకాయ రంగులోకి మారిపోయాయి. బాధితుడు నొప్పితో విలవిల్లాడాడు. పాము విషం శరీరంలోకి పాకకుండా వైద్యులు యాంటీసెరం, బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్‌ను ఇచ్చారు.
పాము కాటు వల్ల బాధితుడికి స్క్రోటల్ నెక్రోసిస్ ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. నెక్రోసిస్ అంటే వైద్య పరిభాషలో చర్మ కణజాలం దెబ్బతినడమని అర్థం. పాము కాటు వల్ల బాధితుడి వృషణాలకు రక్షణగా ఉండే చర్మం కుళ్లిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. నాగుపాము విషం వల్ల అతడి జననాంగాలపై ఉండే చర్మంలోని అంతర్లీన కణజాలం నాశనమైంది. దీనివల్ల ప్రాణాహాని లేకుండా వైద్యులు యాంటీ-వెనమ్, టెటానస్, బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్‌ను ఇవ్వడం వల్లఅతడు ప్రాణాలతో బయటపడ్డాడు. పాము విషంలో ఎర్ర రక్త కణాలను నాశనం చేసే మెటాలోప్రొటీనేస్ అనే టాక్సిన్ ఉంటుంది. అందువల్లే అతడి పరిస్థితి అంత దయనీయంగా మారింది.
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
పాము కాటేసిన కొద్ది నిమిషాల తర్వాత అతడి వాంతులయ్యాయి. వృషణాల నుంచి పొత్తికడుపు, ఛాతీ పైభాగం వరకు నొప్పితో విలవిల్లాడాడు. వారం రోజుల తర్వాత అతడి మర్మాంగం వద్ద కుళ్లిన చర్మాన్ని తొలగించారు. ఫలితంగా అక్కడ రంథ్రం ఏర్పడింది. దీంతో వైద్యులు తాత్కాలికంగా అక్కడ వాక్యూమ్ పరికారాన్ని ఉంచి.. ఇన్ఫెక్షన్ ఏర్పడకుండా చికిత్స అందించారు. 9 రోజుల తర్వాత తిరిగి నెదర్లాండ్‌కు వెళ్లిన బాధితుడు ఓ క్లినిక్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అయితే, ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని తెలుసుకున్న వైద్యులు అతడికి యాంటిబయాటిక్స్ ఇచ్చారు. ఆరు రోజుల తర్వాత అతడు ప్లాస్టిక్ సర్జన్‌ను కలిశాడు. వైద్యుడు అతడి మొల భాగం నుంచి కాస్త చర్మాన్ని తీసుకుని వృషణాల వద్ద రంథ్రాన్ని పూడ్చారు. ఎట్టకేలకు అతడు ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి.. మీరు ఇకపై టాయిలెట్‌లోకి వెళ్లే ముందు ఒకసారి చెక్ చేసుకుని.. వాటర్ ఫ్లష్ చేయండి. లేకపోతే.. ఇతడిలాగ హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి