Malaika Arora Fitness Tips : మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్స్.. 51 ఏళ్లలోనూ యంగ్‌గా ఉండేందుకు ఫాలో అయ్యే 7 చైనీస్ మూమెంట్స్ ఇవే, ట్రై చేయండి
Chinese Movements for Flexibility : మలైకా అరోరా చైనీస్ వ్యాయామాలను కచ్చితంగా తన రొటీన్లో ఫాలో అవుతున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆ సింపుల్ వ్యాయామాలు ఏంటి? వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Malaika Arora Fitness Routine : బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె తన నటన, లైఫ్‌స్టైల్‌తోనే కాకుండా.. ఫిట్‌నెస్ అలవాట్లతో కూడా అభిమానులను మోటీవేట్ చేస్తూనే ఉంటుంది. 51 ఏళ్ల వయసులోనూ.. ఎంతో డెడికేటెడ్‌గా క్రమశిక్షణతో వ్యాయామాలు చేస్తూ.. టోన్డ్ బాడీతో అలరిస్తుంది. యాభై ఏళ్లు దాటినా వృద్ధాప్యఛాయలు రాకుండా యవ్వనంగా కనిపించవచ్చని ప్రూవ్ చేసింది మలైకా. అయితే మీకు తెలుసా.. ఈమె తన రొటీన్లో "7 చైనీస్ మూమెంట్స్(7 Chinese movements)" కూడా ఫాలో అవుతుందట. ఈ చిన్నపాటి మూమెంట్స్.. తన లైఫ్స్టైల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాయని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి తెలిపింది.
చైనీస్ మూమెంట్స్ రెగ్యులర్‌గా చేస్తూ ఒత్తిడిని తగ్గించుకున్నట్లు తెలిపింది మలైకా. వీటికోసం ఎక్కువ కష్టపడనవసరంలేదని.. చాలా సున్నితంగా, తేలికగా ఉండే ఈ మూమెంట్స్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయని సోషల్ మీడియాలో తెలిపింది. రోజులో కేవలం రెండు నిమిషాల్లో చేయగలిగే ఈ వ్యాయామాలు ఆమెను పదేళ్ల వయస్సు తగ్గించినట్లుగా.. ఐదు కిలోలు బరువు తగ్గినట్లుగా చేశాయని చెప్తుంది. ఇంతకీ ఆ ఏడు మూమెంట్స్ ఏంటి.. వాటిని ఎలా చేయాలి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.
View this post on Instagram
మలైకా ఫాలో అవుతోన్న చైనీస్ మూమెంట్స్ ఇవే
- షోల్డర్ రోల్స్ : నిటారుగా నిల్చొని ఛాతీ దగ్గర రెండుచేతులు వేళ్లతో పెనవేసి కాస్త బెండ్ అవ్వాలి. ఇప్పుడు.. ఇరువైపులా వేగంగా కదలాలి. ఫాస్ట్‌గా లెఫ్ట్, రైట్ చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామం వల్ల భంగిమ మెరుగవుతుంది. అలాగే పొట్ట పైభాగంపై ఒత్తిడి పడుతుంది.
- వెన్నుముక ఆరోగ్యానికై : వెన్నునొప్పిని తగ్గించుకునేందుకు.. చేతులను చాపి.. ఒక చేతిని మడవడం మరోచేతిని పూర్తిగా చాపడం ఇలా ఫాస్ట్‌గా చేయాలి. అంటే ఒక చేయి హార్ట్ దగ్గరికి వస్తే మరో చేయి పూర్తిగా చాపాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేతాకుండా యాక్టివ్‌గా ఉంటారు. వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
- హ్యాండ్ రైజ్: చేతులను పొడుగ్గా చాపి.. ఒకదానిని నేలవైపు.. మరోదానిని ఆకాశం వైపు ఉంచాలి. ఇప్పుడు పాదాలను వేళ్లపై, మడమలపై ముందుకి వెనక్కి సాగుతున్నట్లు చేయాలి. అదే సమయంలో చేతులను ఒకటి పైకి, ఇంకోటి కిందకి అనాలి. దీనిని చేయడం వల్ల వీపుపై ఉన్న భారం తగ్గుతుంది. శరీరం బిగుతుగా ఉండదు. చెస్ట్ ఓపెన్ అవుతుంది. ఎగువ శరీరానికి రక్తం అందుతుంది.
- ప్రక్కటెముకలను స్ట్రెచ్ చేయాలి : కోర్, ప్రక్కటెముకలను స్ట్రెచ్ చేయాలనుకుంటే.. నిల్చోని కాస్త బెండ్ అయి చేతులను దగ్గరికి తీసుకుంటూ దూరంగా చాపుతూ చేయాలి.
ఇవేకాకుండా మరిన్ని మూవ్స్ ఎలా చేయాలనేది మలైకా తన వీడియోలో చూపించింది. దానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. "7 Chinese Movements That Melt Away Your Stiffness And Boost Your Lymphatic Flow. They look little different, but they release hidden tension and open up your body in powerful ways." అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
చైనీస్ మూమెంట్స్‌తో కలిగే లాభాలు
ఈ చైనీస్ మూమెంట్స్ రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరం, మనసు బ్యాలెన్స్ అవుతాయి. వశ్యతను మెరుగుపరచవచ్చు. కండరాలు పట్టేయడం తగ్గుతుంది. శోషరస వ్యవస్థను ఉత్తేజితం చేయవచ్చు. మొత్తం రక్త ప్రసరణను మెరుగుపరచవచ్చు. వీటిని చేయడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. కేవలం రెండు నిమిషాల్లో వీటిని చేయవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు, బరువు తగ్గేందుకు ఇవి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయంటున్నారు. మరి మీరు కూడా వీటిని ట్రై చేసి బెస్ట్ రిజల్ట్స్ పొందేయండి.






















