Prevent Wrinkles Naturally : ముఖంపై ముడతలు రాకుండదంటే.. లైఫ్ స్టైల్లో చేయాల్సిన మార్పులివే
Early Signs of Aging : మహిళలు ఖరీదైన ఉత్పత్తుల నుండి ఇంటి చిట్కాల వరకు చాలా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ముడతలు, పొడిబారడం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి.

Prevent Wrinkles Naturally : ప్రతిఒక్కరూ తమ ముఖం ఎల్లప్పుడూ తాజాగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అది తప్పేమి కాదు. స్కిన్ ఎల్లప్పుడూ సహజంగా మెరిస్తే బాగుంటుంది అనుకుంటారు. వయస్సుతో, జెండర్‌తో సంబంధం లేకుండా చాలామంది తమకు వృద్ధాప్యఛాయలు రావద్దని అనుకుంటారు. మగవారితో పోలిస్తే మహిళల్లో కాస్త ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఖరీదైన సౌందర్య ఉత్పత్తుల వాడడం నుంచి.. ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం వరకు చాలా ట్రై చేస్తారు. వాటిని ఫాలో అయినా కూడా కొన్నిసార్లు చర్మంపై ముడతలు రావడం, పొడిబారడం, నిర్జీవంగా కనిపించడం వంటివి జరుగుతాయి. అయితే దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
సాధారణంగా వృద్ధాప్య ఛాయలు వయసు పెరిగేకొద్ది వస్తాయి. అయితే ఇవి కేవలం వయసుతోనే కాకుండా కొన్ని అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. లైఫ్స్టైల్లోని కొన్ని పనుల కారణంగా కూడా ముఖంలో త్వరగా ముసలితనం వచ్చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా చేసే కొన్ని పనులపై దృష్టి పెట్టాలి. లేకుంటే ఎన్ని ప్రొడెక్ట్స్ వాడినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. ముఖాన్ని యవ్వనంగా ఉంచడంలో కీలకపాత్ర పోషించే లైఫ్‌స్టైల్ రొటీన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఒత్తిడి మెయిన్ రీజన్..
మీకు తెలుసా? ఒత్తిడి మానసికంగా, శారీరకంగానే కాదు.. బ్యూటీ పరంగా పలు ఇబ్బందులు ఇస్తుంది. నిరంతర ఒత్తిడి చర్మానికి హానికలిగిస్తుంది. ఆందోళన, అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు మొదలవుతాయి. తేమ కూడా తగ్గుతుంది. దీనివల్ల ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుంది. వృద్ధాప్యంగా మారుతుంది. అంతేకాకుండా చర్మం త్వరగా పొడిగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు రిలాక్స్ అవ్వడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మ్యూజిక్ వినడం, ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన పనిలో బిజీగా ఉండడం చేయాలి. అలాగే యోగా, ధ్యానం వంటివి ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.
కోపం ఎక్కువగా వస్తుందా?
పదే పదే కోపం తెచ్చుకోవడం వల్ల కూడా చర్మం డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. చర్మంపై ముడతలు, నలుపు పెరగడం త్వరగా కనిపిస్తాయి. నెమ్మదిగా మీ ముఖం అలసిపోయినట్లు, నిర్జీవంగా మారుతుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు.. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు శాంతపరచుకోవడానికి ప్రయత్నించండి.
నిద్రలేకపోతే.. త్వరగానే
నిద్ర లేకపోవడం మీరు త్వరగా ముసలివారు అవుతారు. తగినంత నిద్రపోనప్పుడు.. శరీరంలో హార్మోన్లు అసమతుల్యమవుతాయి. దీనివల్ల చర్మంపై నల్లటి వలయాలు, ఉబ్బిన కళ్ళు, నలుపు, ముందస్తు వృద్ధాప్యం వంటి లక్షణాలు వస్తాయి. నిద్ర సమయంలోనే చర్మం తనను తాను బాగు చేసుకుంటుంది. కాబట్టి రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. అలాగే నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.
వ్యాయామం
శారీరక శ్రమకు దూరంగా ఉంటే.. మీ చర్మం వయస్సును పెరిగిపోతుంది. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ కూడా బలహీనపడుతుంది. దీని ప్రభావం నేరుగా మీ చర్మంపై కనిపిస్తుంది. దీని కారణంగా, చర్మం వదులుగా మారడం ప్రారంభిస్తుంది. మెరుపు పోతుంది. వృద్ధాప్య ఛాయలు పెరుగుతాయి. వయస్సు కంటే పెద్దగా కనిపిస్తారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవండి. యోగా చేయండి లేదా తేలికపాటి వ్యాయామం చేయండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















