అన్వేషించండి

Glow Skin Secrets : మెరిసే చర్మం కోసం స్కిన్ కేర్ నిపుణులు ఇస్తోన్న టిప్స్ ఇవే.. డల్​నెస్ పోగొట్టుకోవడానికి ఇవి బెస్ట్

Simple Tips for Radiant Skin : స్కిన్ కేర్ అందరికీ ముఖ్యమైనదే. అయితే చర్మం మెరిసేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో.. వాటితో స్కిన్ గ్లో ఎలా పొందవచ్చో.. నిపుణుల సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Skin Care Tips for Radiant Skin : ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలుష్యంలో తిరగడం.. మేకప్ ఎక్కువసేపు ఉంచుకోవడం.. లైఫ్​స్టైల్​లో మార్పులు.. వివిధ కారణాల వల్ల స్కిన్ మారిపోతుంది. ఎండలు, వర్షాలు, వాతావరణంలోని మార్పులు చర్మాన్ని మార్చేస్తాయి. స్కిన్​ని డల్​గా చేస్తాయి. చర్మం అలసిపోయి లుక్ మారిపోతుంది. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దీనికోసం చికిత్సలు అవసరం లేదని.. కొన్ని బేసిక్ రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలని అంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు డాక్టర్ గీతాంజలి శెట్టి. మెరిసిపోయే స్కిన్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ కొన్ని సూచించారు.

మైల్డ్ క్లెన్సర్..

చర్మ సంరక్షణకు మైల్డ్​గా ఉండే క్లెన్సర్​ను ఉపయోగించాలి. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి హెల్ప్ అవుతుంది. మేకప్, అదనపు నూనెను తొలగించేందుకు ఇది హెల్ప్ అవుతుంది. చర్మంపై ఉండే మృతకణాలను కూడా ఇది దూరం చేస్తుంది. కాబట్టి మృదువైన ఫేస్ వాష్‌ని ఎంచుకోవాలని చెప్తున్నారు. హైడ్రేషన్ కోసం చర్మాన్ని ఇది సిద్ధం చేస్తుంది. ఇది చర్మం డల్​నెస్​ నుంచి కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. డబుల్ క్లెన్స్ చేస్తే స్కిన్ మరింత హెల్తీగా ఉంటుంది.

హైడ్రేషన్ కీలకం

చర్మాన్ని హైడ్రేట్​గా ఉంచడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ చర్మాన్ని మృదువుగా, బిగుతుగా చేస్తుంది. కాబట్టి హైడ్రేటింగ్ పదార్థాలతో నిండిన ఫుడ్స్ తీసుకోవడం, నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. నీరు పుష్కలంగా తీసుకోవడం వల్ల చర్మంలోని టాక్సిన్లు బయటకిపోతాయి. ఇది చర్మం లోపలి నుంచి పోషణను ఇవ్వడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే హైడ్రేషన్​ కోసం మంచి మాయిశ్చరైజర్‌ ఎంచుకుంటే మంచిది. క్లెన్స్ తర్వాత స్కిన్ కాస్త డ్రైగా మారుతుంది కాబట్టి దానిని దూరం చేసేందుకు ఇది హెల్ప్ అవుతుంది.

సన్‌స్క్రీన్ మర్చిపోవద్దు

ఈవెంట్స్ తర్వాత లేదా సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే దానిని రక్షించడం చాలా ముఖ్యం. ఇలా కాపాడుకోవాలంటే రెగ్యులర్​గా సన్‌స్క్రీన్ వాడుకోవడం చాలా ముఖ్యం. ఇది పిగ్మెంటేషన్ దూరం చేయడంతో పాటు.. వృద్ధాప్య ఛాయాలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది స్కిన్ మెరిసేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా, తాజాగా ఉండడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. 

ఈ మూడు సింపుల్ టెస్ట్​లు రెగ్యూలర్​గా ఫాలో అయితే చర్మం శుభ్రపడడంతో పాటు మంచిగా హైడ్రేట్ అవుతుందని తెలిపారు గీతాంజలి. అలాగే స్వీయ సంరక్షణ తీసుకుంటేే స్కిన్ మెరుస్తూ ఉంటుందని.. దీనికోసం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదంటూ సూచనలిచ్చారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Dussehra Navratri Day 4 :దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget