Daily Habits for Liver Health : హెపటైటిస్ తగ్గించే మార్గాలివే.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రోజువారీ అలవాట్లు
Lifestyle Changes for Hepatitis : రోజువారీ అలవాట్లు, ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి దీర్ఘకాలిక హెపటైటిస్ను తగ్గిస్తాయని చెప్తున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇలా హెల్ప్ చేస్తాయో చూద్దాం.

Daily Habits That Help Heal Hepatitis : దీర్ఘకాలిక హెపటైటిస్ ఉన్న చాలా మందికి అది హెపటైటిస్ B లేదా Cగా మారుతుంది. ఇది ఆటోఇమ్యూన్ కారణాల వల్ల కావచ్చు. లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వల్ల కూడా రావచ్చు. కానీ దీనికి చికిత్స తీసుకున్న అది సగం మాత్రమే ఫలితాలు ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే మీరు జీవనశైలిలో చేసే మార్పులు సమస్యను తగ్గించి.. నిజమైన తేడా చూపిస్తుందని చెప్తున్నారు. మరి ఆ మార్పులు ఏంటో.. హెపటైటిస్ని తగ్గించే రొటీన్ ఏంటో చూసేద్దాం.
కాలేయ ఆరోగ్యం
మీరు హెపటైటిస్‌ను మాత్రలు లేదా ఇంజెక్షన్లతో నియంత్రించాలి అనుకుంటున్నారా? అయితే దానితో పాటు లైఫ్స్టైల్లో మార్పులు కూడా చాలా అవసరమని చెప్తున్నారు. ఎందుకంటే కాలేయంపై జీవనశైలి ప్రభావం చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. రోజువారీ అలవాట్లు, భోజనం, నిద్ర, ఒత్తిడి వంటివాటికి రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ధూమపానం చేస్తారా లేదా? ఆల్కహాల్ తాగుతారా? అనేదానిపై కూడా కాలేయ రక్షణ ఆధారపడి ఉంటుంది.
ఫ్యాటీ లివర్ ఉంటే..
కాలేయ సమస్యలు ఉన్నప్పుడు అది పని చేయడం కష్టం. ఇప్పటికే వాపుతో లేదా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు.. అదనపు ఒత్తిడిని తగ్గించడం చాలా కీలకం అవుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఆహారం తీసుకుంటూ.. దాని ప్రాముఖ్యతను గుర్తించి.. దానికి అనుగుణంగా లైఫ్‌స్టైల్ మార్చుకోవాలని చెప్తున్నారు. ప్రాసెస్ చేసిన స్నాక్స్, వేయించిన ఆహారాలు, అధిక చక్కెర, రెడ్ మీట్ వంటివి కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తాయి. వాటికి బదులుగా తృణధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు, తేలికపాటి ప్రోటీన్లు తీసుకోవాలి. ఇవి ఫ్యాటీ లివర్ ఉన్నవారికి శరీర బరువులో 5 నుంచి 10% వరకు.. కాలేయంలోని కొవ్వు నిల్వలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
జీవనశైలిలో చేయాల్సిన మార్పులు
- అప్పుడప్పుడు మద్యం సేవించినా కాలేయానికి నష్టం వాటిల్లుతుంది. ధూమపానం మానేయాలని, వినోదానికి ఉపయోగించే మందులకు దూరంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఎందుకంటే ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి.. కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.
- వ్యాయామం కూడా నయం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వారానికి దాదాపు 150 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలి. వేగంగా నడవడం, సైక్లింగ్ లేదా ఈత వంటివి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది కాలేయ కొవ్వును తగ్గిస్తుంది. చురుకుగా ఉండటం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని పెంచుతుంది. జీవక్రియను స్థిరంగా ఉంచుతుంది. ఇవన్నీ కాలేయానికి మంచివి. మెట్లు ఉపయోగించడం లేదా భోజనం తర్వాత చిన్న నడకలు చేయడం వంటి సాధారణ అలవాట్లు కూడా సహాయపడతాయి. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి.
- మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యలు తరచుగా కాలేయ వ్యాధితో ముడిపడి ఉంటాయి.
- నిద్ర, భావోద్వేగ ఆరోగ్యం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. నిద్రకు ఆంటంకం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఇది కాలేయం కోలుకోవడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. కాబట్టి యోగా వంటివి చేస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.






















