చాలామంది రాత్రుళ్లు వండి తిన్నాక మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయం లేదా మరుసటి రోజు తింటారు. ఇలా రాత్రి మిగిలిన ఆహారాన్ని తినడం చాలా సాధారణం.
అయితే ఎక్కువకాలం మిగిలిపోయిన ఆహారం తింటే.. అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు నిపుణులు.
మిగిలిపోయిన ఆహారం తాజాదనం కోల్పోతుంది. అంతేకాకుండా రుచిని కూడా తగ్గిస్తుంది. ఇది మీ శరీరానికి హానికరంగా మారుతుంది.
సాల్మొనెల్లా, ఈ కోలి వంటి ప్రమాదకరమైన బాక్టీరియా మిగిలిపోయిన ఆహారంలో పేరుకుపోతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.
పాత ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కడుపు నొప్పి, వాంతులు, అతిసారం వంటివి రావచ్చు.
రెగ్యులర్గా మిగిలిపోయిన ఆహారం తింటే.. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
మిగిలిపోయిన ఆహారాన్ని పదేపదే తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి.. శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంది.
మిగిలిపోయిన ఆహారంలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు తగ్గుతాయి. ఇది కాలక్రమేణా పోషకాహార లోపాలకు దారితీస్తుంది.
పాత ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల కాలేయం కూడా దెబ్బతినే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.
మీరు తరచుగా మిగిలిపోయిన ఆహారం తింటే.. మంచి ఆరోగ్యం కోసం ఈ అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు.