Leap Day 2024 : లీప్ డే లేకుంటే పరిస్థితి ఏమయ్యేదో.. అందుకే దీనికి ఇంత ప్రాధన్యత
February 29, 2024 : నాలుగు సంవత్సరాలకు ఓ సారి వచ్చే లీప్ ఇయర్‌ను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అసలు ఇదే లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది.
Leap Year 2024 : నాలుగు సంవత్సరాలకు ఓసారి వచ్చే లీప్ ఇయర్ ఈ(2024) సంవత్సరం వచ్చింది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అయితే లీప్ ఇయర్లో మాత్రం ఈ నెలలో 29 రోజులు ఉంటాయి. దీనినే లీప్డ్ అంటారు. ఇది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓసారి వస్తుంది. అయితే ఏదో అనుకుంటాము కానీ.. ఈ లీప్ ఇయర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అసలు లీప్ ఇయర్‌ని ఎందుకు చేసుకుంటాము? ప్రపంచవ్యాప్తంగా దీనిని ఏవిధంగా జరుపుకుంటారో? ఎప్పటినుంచి ఈ లీప్ ఇయర్‌ని ఫాలో అవుతున్నారో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365.242190 రోజులు పడుతుంది. అయితే 365 రోజులకంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా 44 నిమిషాలు ముందుగా సీజన్లు ప్రారంభమయ్యేలా చేస్తుంది. కాబట్టి ఈ అదనపు రోజును ఫిబ్రవరికి జోడించారు. ఈ లీప్ డే మన క్యాలెండర్‌ను భూమి కక్ష్యతో సమతుల్యం చేస్తుంది. సీజన్లు నుంచి బయటకు వెళ్లకుండా.. వార్షిక ఈవెంట్లు, వాటి షెడ్యూల్‌ను అనుకరించేలా చేస్తుంది.
లీప్ డే 2024 (Leap Day 2024) చరిత్ర
ఈ లీప్ ఎరా అనేది రోమన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్ర చెప్తుంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక అదనపు రోజును జోడించడం అప్పుడే జరిగింది. అయితే ఈ అదనపు రోజు క్యాలెండర్లో కొన్ని తప్పులకు దారి తీసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశ పెట్టారు. ఈ క్యాలెండర్ సూర్యుని చుట్టూ భూమి వాస్తవ కక్ష్యతో మరింత దగ్గరగా ఉండేలా చేసింది. దీనిలోనే లీప్ డేని ప్రవేశపెట్టారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నాలుగు సంవత్సరాలకు లీప్ ఇయర్ వస్తుంది. ఈ లీప్ ఇయర్ వల్ల మిగిలిన సంవత్సరాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా.. భూమి కక్ష్యకు తగ్గట్లు రూపొందించారు.
కొన్ని ప్రాంతాల్లో ఈ లీప్ డేని బ్యాచిలర్స్ డే (Bachelor Day)గా జరుపుకుంటారు. కొందరు ఫిబ్రవరి 29న పుట్టినరోజు చేసుకుంటారు. ఇలాంటి వారు ఫన్నీగా తమ వయసును 4 సంవత్సరాలను ఏడాదిగా లెక్కేసి చెప్తారు. లీప్డే రోజు పుట్టిన జరుపుకునేవారిని Leaplings or Leapers అంటారు. అయితే లీప్ రోజు పుడితే మార్చి 1వ తేదీన లేదా ఫిబ్రవరి 28వ తేదీన కొందరు పుట్టినరోజులు జరుపుకుంటారు. మరికొందరు స్పెషల్‌గా ఉండాలని.. ఫిబ్రవరి 29వ తేదీన డెలీవరి డేట్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. సో తమ పిల్లలు స్పెషల్‌గా ఫీల్ అవుతారని భావిస్తారు. పైగా లీప్ డే పుట్టిన వారికి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. లీప్డే రోజు కొందరు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. తమ స్పెషల్ డే మరింత స్పెషల్‌గా ఉండాలని చూస్తారు. మరికొందరు లీప్ డో రోజు మంచిది కాదని భావిస్తారు. ఆ రోజు ఎలాంటి మంచిపనులు చేయరు.
Also Read : మహిళలు రోజుకు ఇన్ని గంటలు కచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అంతే