అన్వేషించండి

Sleep Deprivation : నిద్ర సరిపోలేదా? అలసటగా ఉంటుందా? కారణాలు ఇవే.. విస్మరించకండి, ఇలా రీసెట్ చేసుకోండి

Sleep Problems : ఉదయాన్నే నీరసంగా ఉంటుందా? దీనికి నిద్ర నాణ్యతే కారణం. ఇది శరీరం ఇచ్చే తొలి సంకేతమని విస్మరిస్తే ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. దీనిని ఎలా దూరం చేసుకోవచ్చంటే...

Sleepiness Is a Serious Health Red Flag : నిరంతరం అలసట చాలా మందిలో సాధారణమైపోయింది. దీనికి కారణం చాలా కష్టపడిపోవడం అనుకుంటారు. కానీ సరైన కారణం గుర్తించ లేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం నిద్ర లేకపోవడమే అని చెప్తున్నారు నిపుణులు. ఈ నిద్ర సమస్య చాలా సూక్ష్మమైన, సులభమైన సూచనలతో ప్రారంభమవుతుందని.. ఇది శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు, ఎలా ఈ సమస్యను దూరం చేసుకోవాలో అనే అంశంపై పలు సూచనలు చేశారు P. D. హిందూజా హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ సెంటర్​లో కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్, ఎపిడెమియాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ లాన్సెలట్ పింటో. అవేంటో చూసేద్దాం. 

శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

పగటిపూట నిద్రపోవడం సాధారణం అని చాలామంది నమ్మే అపోహలలో ఒకటి అంటున్నారు డాక్టర్ పింటో. "ఒక వ్యక్తి రాత్రి తగినంత విశ్రాంతి తీసుకుంటే పగటిపూట నిద్రపోవడం చాలా కష్టం." పగలు గంటకు పైగా కునుకు తీస్తే.. అది రాత్రి నిద్ర నాణ్యతపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఉదయం ప్రయాణం చేసేప్పుడు అంటే "టాక్సీ, కారు లేదా ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు చాలామంది నిద్రపోతారు" ఇది కూడా రాత్రి నిద్రకు హాని చేస్తుందని చెప్తున్నారు. ఇది కంటిన్యూ అయితే.. "ముఖ్యమైన సమావేశాలు, ప్రెజెంటేషన్లు, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వారికి నిద్ర వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు." కాబట్టి ఈ సంకేతాలు ఎప్పుడూ విస్మరించకూడదని హెచ్చరించారు.

వైద్యపరమైన ముప్పుగా మారితే

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

నిద్ర లేకపోవడం అంటే అలసిపోవడం మాత్రమే కాదు.. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డాక్టర్ పింటో ప్రకారం.. "నిద్ర నాణ్యత, పరిమాణం రెండూ అనేక జీవక్రియ, హృదయనాళ వ్యాధులతో ముడిపడి ఉన్నాయి." అధిక రక్తపోటు, ప్రారంభ గుండె జబ్బులు, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు అన్నీ.. సరిపడా నిద్ర లేకపోవడానికి సూచనలు కావచ్చని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది అత్యవసర వైద్యపరమైన సమస్యగా మారుతుందని చెప్తున్నారు.

7–8 గంటలు నిద్రపోయేవారు కూడా అలసిపోయినట్లు అనిపించవచ్చు. అంటే "ఒక వ్యక్తి తగినంత నిద్రపోయినా నిద్రగా అనిపిస్తుందని చెప్తున్నారంటే.. అది నిద్ర నాణ్యత సమస్య కావచ్చు." నిద్రపోయే పరిసరాలు, గురక లేదా స్లీప్ అప్నియా వంటి రుగ్మతలు దీనికి కారణం కావచ్చని చెప్తున్నారు. "పెద్దగా గురక పెట్టడం లేదా నిద్ర మధ్యలో ఊపిరి ఆడనప్పుడు.. అది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు." జీవనశైలి ప్రేరేపకాలు కూడా నిద్ర నాణ్యతను మరింత దిగజారుస్తాయి. "కెఫిన్, చాక్లెట్, నిద్రపోయే ముందు ప్రకాశవంతమైన లైట్లలో ఉండడం  కూడా నిద్ర నాణ్యతకు ఆటంకం కలిగిస్తాయి." ఆల్కహాల్ కూడా నిద్ర సమస్యకు ప్రధాన కారణమని ఆయన హెచ్చరించారు.

నిద్ర సమస్యను ఎలా దూరం చేసుకోవాలంటే..

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

నిద్ర సమస్యను రీసెట్ చేయాలనుకుంటే.. డాక్టర్ పింటో కొన్ని సూచనలు ఇస్తున్నారు. "ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో మేల్కొనడానికి ప్రయత్నించడం మంచిదని చెప్తున్నారు. ఇది స్లీప్ సైకిల్​ని రీసెట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. పడుకునే ముందు ఎలక్ట్రిక్ పరికరాలను నివారించాలని, కెఫిన్‌ను తగ్గించాలని సూచిస్తున్నారు. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తే మంచిదని అంటున్నారు. అలాగే దీనిని ఉదయం చేస్తేనే మంచిదని.. అప్పుడే నిద్ర నాణ్యత పెరుగుతుందని.. ఈవెనింగ్ చేస్తే నిద్ర నాణ్యతకు ఆటంకం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 

చల్లని గది ఉష్ణోగ్రత, మసకబారిన లైటింగ్, వదులుగా ఉండే దుస్తులు, నిద్రకు ముందు కొంత వ్యవధితో కూడిన తేలికపాటి భోజనం శారీరక సౌకర్యాన్ని ఇచ్చి మంచి నిద్రను అందిస్తుంది. మీ పార్టనర్ గురక పెడుతున్నారని చెప్తే.. విస్మరించవద్దని సూచించారు. ఎందుకంటే నిద్ర సమస్య శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఇబ్బందులు కలిగిస్తుందని చెప్తున్నారు. చిరాకు, ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget